అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే | Sensational Report Released By AAIB On Ahmedabad Air India Plane Crash Tragedy, Cockpit Exchange Of India Pilots Before Crash | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే

Jul 12 2025 7:07 AM | Updated on Jul 12 2025 10:59 AM

Cockpit exchange of Ahmedabad Air India pilots before crash

ఢిల్లీ: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. 

అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్‌ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.

క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్‌ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్‌ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట​్‌ వాయిస్‌లో పైలట్‌ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. 

విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌
అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్‌ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. జూన్‌ 12న ఎయిర్‌ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్‌లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement