
హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు.

అమెరికా స్ఫూర్తికి, తెలంగాణ స్ఫూర్తికి సారూప్యత ఉంది.స్నేహాన్ని కోరుకోవడం,బంధాలను పటిష్టం చేసుకోవడం తెలంగాణ ప్రత్యేకత.

2008లో ముఖ్యమంత్రిగా డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఏర్పాటైంది.











