breaking news
Air India plane crash
-
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
టేకాఫ్ చేసిన కొద్ది సెకండ్లలో ఎయిరిండియా బోయింగ్ 787 విమానంలోని ఇంధన నియంత్రణ మీటల్ని కెప్టెన్ (సీనియర్ పైలట్) సుమీత్ సబర్వాల్ ఎందుకు ఆపేశాడు? ఒక్క సెకను తేడాతో రెండు స్విచ్చులు ఆఫ్ అయ్యాయి. ఫలితంగా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. పైలట్స్ తేరుకుని మీటల్ని లాగి ఇంధన సరఫరాను పునరిద్ధరించేందుకు యత్నించినా అప్పటికే సమయం మించిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంధనం అందక, చోదక శక్తి క్షీణించి విమానం కుప్పకూలింది. గత నెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే సంభవించిన ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగతా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. ఈ 241 చావుల్లో ఒకదాన్ని (కెప్టెన్/సీనియర్ పైలట్) ఆత్మహత్యగా, మిగతా 240 మరణాలను హత్యలుగా (మాస్ మర్డర్-సూసైడ్) భావించాలా? వీరే కాకుండా విమానం కూలిపోయాక భూమిపై ఉన్న మరో 19 మంది చనిపోయారు. మొత్తం మరణాలు దాదాపు 260. ఇంతకూ ఇది పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్కృత్యమా? పరధ్యానమా? లేక ప్రమాదమా? విద్రోహ చర్యా? ఏమో... ఇంకా తెలియరాలేదు. కారణాల వెలికితీత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైలట్ల మానసిక ఆరోగ్యంపైనా చర్చను లేవదీస్తోంది.పైలట్లే కూల్చేశారు!విమాన దుర్ఘటనల్లో పైలట్ ‘హత్యాత్మహత్యల’ ఉదంతాలు అరుదు అయినప్పటికీ చరిత్రలో అవి కూడా లేకపోలేదు. 2015లో ‘జర్మన్ వింగ్స్’ కో-పైలట్ ఆండ్రియాస్ లుబిడ్జ్ తన కెప్టెన్ (సీనియర్ పైలట్)ను కాక్‌పిట్ వెలుపల బంధించి ఎ320 ఎయిర్ బస్ విమానంతో నేరుగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలను ఢీకొట్టాడు. దాంతో విమానంలోని మొత్తం 150 మందీ చనిపోయారు. ఇక 1997లో ‘సిల్క్ ఎయిర్’ ఫ్లైట్ 185, 1999లో ‘ఈజిప్ట్ ఎయిర్’ ఫ్లైట్ 990 విమాన ప్రమాదాలకు పైలట్ల ఉద్దేశపూర్వక చర్యలే కారణమని అమెరికా ఇన్వెస్టిగేటర్లు నిర్ధారించారు. ఈ రెండు ఘటనల్లో 321 మంది చనిపోయారు. అయితే ఆ రెండు దుర్ఘటనలకు దారితీసిన కారణాలపై అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కనుగొన్న అంశాలతో ఇండోనేషియా, ఈజిప్ట్ విభేదించండం వేరే సంగతి. ఇక ఇటీవల 2022లో చైనా ఈస్టర్న్ ఫ్లైట్ 5735 కూడా తాను ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగిపోయి కూలిపోవడంతో 132 మంది మరణించారు. అది కూడా పైలట్ ఉద్దేశపూర్వక చర్యేనని లీకైన డేటా సూచిస్తోంది. హిందూమహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తూ 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ 370 విమానం అదృశ్యమైంది. అందుకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా ‘హత్యాత్మహత్యల’ (ఉద్దేశపూర్వక) చర్య ఫలితంగానే ఈ దుర్ఘటన సంభవించిందన్న వాదనలు కొన్ని తెరపైకి వచ్చాయి. స్విస్ ‘బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఆర్కైవ్’ సమాచారాన్ని విశ్లేషించి ‘న్యూస్ వీక్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం... గత 30 ఏళ్లలో ఇలాంటి ఉద్దేశపూర్వక హత్యాత్మహత్యల వల్ల 1,034 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన విమానాల ప్రమాదాల్లో అదే గత 30 ఏళ్ల వ్యవధిలో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే... ఈ పైలట్ ‘మర్డర్-సూసైడ్’ మరణాల సంఖ్య 3.5 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇలాంటి సంఘటనలు అరుదే అయినప్పటికీ విమానయాన భద్రతలో పైలట్ల మానసిక ఆరోగ్యానికి ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో అవి తేటతెల్లం చేస్తున్నాయని ‘సెంటర్ ఫర్ ఏవియేషన్ సైకాలజీ’ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ రాబర్ట్ బోర్ వ్యాఖ్యానించారు. మొత్తం విమాన ప్రమాదాల్లో ఈ ‘ఉద్దేశపూర్వక’ ఘటనల భాగం స్వల్పమే అయినప్పటికీ వాటిల్లే నష్టం మాత్రం అపారం. ఎందుకంటే వాటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. విమానయానంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. పైలట్ల మానసిక ఆరోగ్యం పట్ల వైమానిక రంగ పర్యవేక్షణా లోపాల్ని అవి ఎండగడతాయి. పైలట్లు అత్యంత అప్రమత్తంగా మెలగాలని కోరుకుంటామని, అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సాంకేతికపరమైనవి మాత్రమే కాదని, అందులో వ్యక్తిగత, ఆర్థిక, సంబంధాలపరమైన అంశాలు కూడా ఉన్నాయని రాబర్ట్ బోర్ చెప్పారు. పైలట్లు ఎదుర్కొంటున్న ఇటువంటి ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా అలాగే ఉపేక్షిస్తే అవి ప్రమాదకరంగా మారతాయని అన్నారు. తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పైలట్స్ ఎవరైనా బయటికి చెబితే వారి కెరీర్ రిస్కులో పడుతుందని, పైలట్ లైసెన్స్ కోల్పోయే అవకాశముందని, ఆ భయంతో వారెవరూ ముందుకురారని వైమానిక నిపుణుడు, మాజీ పైలట్ డాన్ బబ్ చెప్పారు. పైలట్ ‘మర్డర్-సూసైడ్’ ఘటనల నివారణకు వీలుగా విమానం కాక్‌పిట్‌లో పైలట్లపై నిఘా కోసం వీడియో కెమెరాలు పెట్టాలని అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి 2000 సంవత్సరంలో సూచించింది. తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని పైలట్లు అభ్యంతరం చెబుతుండటంతో కాక్‌పిట్‌లో వీడియో రికార్డింగుపై చర్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంజిన్లకు ఇంధనం సరఫరా ఎందుకు ఆపివేశావంటూ ఎయిరిండియా బోయింగ్ 787 విమానం సీనియర్ పైలట్ ను కో-పైలట్ అడిగినట్టు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) వెల్లడించడం చూస్తుంటే... పైలట్ల మానసిక ఆరోగ్యం విషయంలో వైమానిక పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. - జమ్ముల శ్రీకాంత్ -
‘ఊహలొద్దు.. దర్యాప్తు ముందుంది’: విమాన ప్రమాదంపై అమెరికా
వాషింగ్టన్: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తును ముగించాలనే తొందరపాటు పలువురిలో కనిపిస్తున్నదని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటివరకూ వచ్చిన నివేదికలు ఊహాజనితమైనవేనని ఆయన అన్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-7 ప్రమాదంపై ఎన్టీఎస్బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇటీవలి మీడియా నివేదికలు ఊహాజనితమైనవి. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుంది. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నాం’ అని ఎన్టీఎస్బీ ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలిపింది. Statement from NTSB Chairwoman Jennifer Homendy:“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లను టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకు కటాఫ్ స్థానాన్ని గుర్తించారు. 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను పునరుద్ధరించినప్పటికీ, విమానం అప్పటికే థ్రస్ట్‌ను కోల్పోయింది. ఇది ప్రమాదానికి దారితీసింది. అలాగే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ను ఎందుకు కట్ఆఫ్ చేశారని అడగటం వినిపిస్తుంది. అందుకు ప్రతిగా అతను అలా చేయలేదని చెప్పడం రికార్డయ్యింది. ఈ నివేదిక నేపధ్యంలో భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ దేశంలోని అన్ని బోయింగ్ 737, 787 విమానాలలో ఇంధన నియంత్రణ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించింది. పరిశీలన దరిమిలా వాటిలో ఎటువంటి లోపం లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్
ముంబై: ఎయిరిండియా విమాన మృతుల కుటుంబాల కోసం టాటా సన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 260 మంది మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ట్రస్ట్ AI171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటైంది. రూ.500 కోట్లతో ఈ ట్రస్ట్‌ను టాటా సన్స్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి వైద్య ఖర్చులకు వినియోగించనున్నారు.ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ప్రమాదం 32 సెకన్లలోపే జరిగిపోయింది.ఉదయం 11.17: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్ 23 నుంచి టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్ వేగం అందుకున్న విమానం.. అదే సమయంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘రన్’ పొజిషన్ నుంచి ‘కటాఫ్’కు మారాయి. 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్ పవర్ అందించేందుకు రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ) పంప్ క్రియాశీలమైంది.1.38:52: ఒకటో ఇంజన్ స్విచ్ ఆన్ కాగా.. 1.38:54కి ఏపీయూ ఇన్లెట్ తలుపు తెరుచుకుంది. 1.38:56కి రెండో ఇంజన్ స్విచ్ ఆన్ అయ్యంది. 1.39:05కి పైలట్ ప్రమాద (మే డే) సందేశం పంపించారు. 1.39:11కి తుది డేటా నమోదైంది. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకిన విమానం.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. -
ముందస్తు నిర్ణయం దారుణం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో పైలెట్ల తప్పిదం కారణంగానే ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిందంటూ అంతర్జాతీయ మీడియాలో తప్పుడు కథనాలు వెల్లువెత్తుతున్నాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నిరాధార సమాచారంతో ప్రమాదఘటనపై ముందస్తు నిర్ణయానికి రావొద్దని విదేశీ మీడియాకు ఆయన హితవు పలికారు. ‘‘ అసంబద్ధ కథనాలు అల్లడం మానేయండి. ఈ కేసు సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక రూ పొందిస్తాం. ఆలోపే అసమగ్ర సమాచారంతో ఎవ్వరూ ముందస్తు అంచనాకు, తుది నిర్ణయానికి రావొద్దు. తప్పుడు డేటాతో భారత విమానయాన రంగం భద్రతపై ప్ర యాణికుల్లో ఆందోళనను అనవసరంగా పెంచకండి’’ అని యుగంధర్ హితవు పలికారు. వివాదమైన అమెరికా ‘క్రాష్’ నివేదికఎయిరిండియా విమాన ప్రమాదంలో అమెరి కా క్రాష్ నివేదిక వివాదమైంది. కెప్టెన్ ఇంజిన్లకు ఇంధన ప్రవాహాన్ని తగ్గించాడని కాక్‌పిట్ రికార్డింగ్‌లను ఉదహరిస్తూ యూఎస్ ఇచ్చిన నివేదికను భారత పైలట్ల సమాఖ్య తోసిపుచ్చింది. అమెరికా అధికారుల అంచనా ను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ముందే నివేదిక వెల్లడించడంపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానానికి ఆరోజు 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ కెప్టెన్ హోదాలో నాయకత్వం వహించారు. ఆయనకు మొత్తం 15,638 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. 32 ఏళ్ల మరో పైలట్ క్లైవ్ కుందర్ ఆరోజు ఫస్ట్ ఆఫీసర్ హోదాలో కో–పైలట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మొత్తం 3,403 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఇంధన స్విచ్‌లు ‘కటాఫ్’ పొజిషన్లోకి మారడం చూసి కుందర్.. సుమీత్‌ను మీరెందుకు సిŠవ్చ్లను రణ నుంచి కటాఫ్‌లోకి మార్చారు? అని ప్రశ్నించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అమెరికా ఉన్నతాధికారుల ద్వారా ఈ సమా చారాన్ని సేకరించామని వార్తాసంస్థ పేర్కొంది. స్విచ్‌లు కటాఫ్‌లోకి మారడంతో కుందర్ భయపడిపోయారని, కుందర్ ప్రశ్నించాక కూడా పైలట్ సుమీత్ ఎలాంటి భయం, ఆందోళనలేకుండా ప్రశాంతంగా కనిపించారని వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. -
Air India crash probe: ‘ఇంధన స్విచ్‌లలో ఇబ్బందే లేదు’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెలలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్‌లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్సీఎస్ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.తమ ఇంజనీరింగ్ బృందం ఎస్సీఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్ ఉందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు. ‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. -
ఈ అరకొర నివేదిక దేనికి?!
ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్’ చేసివున్నాయి. కానీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలెట్ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్’ అని అడగటం, అందుకు రెండో పైలెట్ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్ చేయటానికైనా, స్విచాఫ్ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్ కూడా స్విచాఫ్ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్ సుమీత్ సభర్వాల్‌కు బోయింగ్ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్) వుండగా, కో పైలెట్ క్లైవ్ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్ పర్యవేక్షణలో కో పైలెట్ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ వెబ్సైట్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ, వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి. -
Air India Crash: అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొంటూ... ‘ఏకైక’ ప్రయాణికుని దుస్థితి
అహ్మదాబాద్: విశ్వాస్ కుమార్ రమేష్... జూన్ 12న జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. ఈయన ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా 270 మంది మరణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఫుటేజ్‌లో రమేష్ రక్తంతో తడిసి, అంబులెన్స్ వైపు కుంటుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ప్రమాదం జరిగి, నెల రోజులు గడిచిన దరిమిలా విశ్వాస్ కుమార్ రమేష్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు?అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ విషాదాన్ని మరువలేకపోతున్నాడు. ఈ ఘటన రమేష్‌ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. అతని బంధువు సన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్‌ను వెంటాడుతున్నాయి. అతను ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం, అతని సోదరుని మరణం మొదలైన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. విదేశాలలో ఉంటున్న మా బంధువులు.. రమేష్ తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అయితే రమేష్ ఎవరితోనూ మాట్లాడటం లేదు. విమాన ప్రమాదం, అతని సోదరుని మరణం దరిమిలా అతనికి అయిన గాయం ఇంకా మానలేదు. రమేశ్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడు. తరువాత నిద్రపోవడం లేదు. చికిత్స కోసం మేము అతనిని రెండు రోజుల క్రితం మానసిక వైద్యనిపుణుని వద్దకు తీసుకెళ్లాం. అతనికి ఇప్పుడే చికిత్స ప్రారంభమైనందున, లండన్ వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు’ అని తెలిపారు.జూన్ 17న రమేష్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయిందని వివరించాడు. తన సీటు, 11ఏ.. ఎడమ వైపున ఉన్న అత్యవసర తలుపుకు దగ్గరగా ఉందని తెలిపారు. జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోకి కూలిపోయింది. -
Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు
వారాల తరబడి వేచి ఉన్నాక, ప్రాథమిక దర్యాప్తు జరిగాక నివేదిక వెలువడితే ఆ విమానప్రమాద రహస్యాలు బయటికొస్తాయని అందరూ ఆశించారు. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తాలూకు నివేదిక అందుకు భిన్నంగా మరిన్ని చిక్కుముడులు వేసేలా వెలువడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వేపై పరుగెత్తి ఆకాశంలోకి ఎగిరేదాకా పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ]ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. అయితే స్విచింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్ చేయడాన్ని గమనించి పైలట్ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగనతలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్‌ను మార్చి, కూల్చేసేందుకు పాక్ సైబర్ దాడులను యత్నిస్తోందన్న కథనాల నడుమ ఈ నివేదిక విడుదలైంది. అయితే ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేముందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. అయితే పైలట్లను ఈ నివేదిక ఎక్కడా తప్పుబట్టకపోవడం విశేషం. అలా అని ఇది పూర్తిగా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్య కారణంగా జరిగిందనీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో ముగించింది. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్ చేశారా? లేదంటే స్విచింగ్ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమా? విమానం సెకన్ల వ్యవధిలో నేలరాలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్ ఈ రెండు ఫ్యూయల్ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్ చేయడం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఫ్యూయల్ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్ చేయడం అంత సులభంకాదు. వీటికి లీవర్–లాక్‌లు ఉంటాయి. స్విచ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ భద్రతా ఫీచర్ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్ గార్డ్ బ్రాకెట్స్ అనేవి కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్/ఆఫ్ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాటి పొజిషన్ మారి ఉంటుంది’’అని ఆ నిపుణుడు వివరించారు. 737 మోడల్లో లాకింగ్ ఫీచర్లో సమస్యలు! బోయింగ్ 737 రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్‌లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను 2018 డిసెంబర్లో విడుదలచేసింది. అందులో బోయింగ్ 737లోని ఫ్యూయల్ స్విచ్‌లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్ డిజైన్‌ను బోయింగ్ 787–8 రకం విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన వీటీ–ఏఎన్‌బీ విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది. మొత్తం ఆడియో ఎందుకు బయటపెట్టలేదు? నువ్వెందుకు స్విచ్ ఆఫ్ చేశావని ఒక పైలెట్‌ను మరో పైలట్ అడగడం, నేను ఆఫ్చేయలేదని అతను బదులివ్వడం తప్పితే మరే ఇతర ఆడియో వివరాలు బహిర్గతం చేయకపోవడం సైతం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వే అటు కొనకు చేరుకుని రన్‌వేపై ప్రయాణించి, గాల్లోకి లేచి, కూలిపోయే చిట్టచివరి సెకన్ దాకా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్ అయంది. అలాంటప్పుడు మొత్తం ఆడియోను విడుదలచేస్తే నిపుణులు విశ్లేషించి ప్రమాదంపై ఓ అంచనాకు రాగలరు. వాళ్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలుస్తాయి’’అని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ గోయెల్జ్ చెప్పారు. ఏమిటీ ఇంధన స్విచ్‌లు విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, లేదా షట్‌డౌన్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. టేకాఫ్ సయయంలో స్విచ్‌లను అచేతనావస్థలో (ఆఫ్ చేసి) ఉంచడం అత్యంత అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఇదే కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ముంబై: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉన్నాయని భారతీయ ఎయిర్‌లైన్ పైలెట్ల సంఘం(ఏఎల్పీఏ) వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఏఎల్పీఏ అధ్యక్షుడు కెప్టెన్ శ్యామ్ థామస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘పైలెట్లదే తప్పు అని తేల్చేలా దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఇలాంటి నిర్ణయానికి రావడం విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు? ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం శోచనీయం. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల సంఘ ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అప్పుడే దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయి. ఫ్యూయల్ స్విచ్ గేట్స్ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల పొజిషన్లు మారడం సైతం ప్రమాదానికి కారణం కావచ్చని అమెరికాలోని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. భారత్‌లో దర్యాప్తు జరుగుతుండగా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాకముందే అందులోని అంశాలు ఎలా లీకయ్యాయి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య ఉందా? ‘‘విమానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య కారణంగా ఫ్యూయల్ స్విచ్ పొజిషన్ మారిందా లేదా అనేది తెలియల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే’’అని భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ దర్యాప్తు నిపుణుడు కెపె్టన్ కిశోర్ చింతా అన్నారు. ‘‘ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. రెండో ఇంజిన్‌నూ స్టార్ట్చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్ చేస్తే మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ అ«దీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు’’అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ విమానంలో ఫ్యూయల్ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు నివేదికలో లేకపోవడం సైతం ఫ్యూయల్ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు: రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. మంత్రిత్వ శాఖలో దీనిపై మేం విశ్లేషిస్తున్నాం. విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు. నివేదికపై మేము వారితో సమన్వయం చేసుకుంటున్నాం. తుది నివేదికలు త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నా. అనంతరం, ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉంటుంది. పైలట్లు, సిబ్బంది పరంగా ప్రపంచంలో మనకు అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి ఉంది. ఇది నేను నిజంగా నమ్ముతున్నాను. పైలట్లు, సిబ్బందే విమానయాన పరిశ్రమకు వెన్నెముక’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Vizag | On AAIB's preliminary report on AI 171 crash, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, "This is a preliminary report, at the ministry we are analysing it...We are coordinating with AIBB for any support they need. We are hoping that the final… pic.twitter.com/UsJB7yD1Xj— ANI (@ANI) July 12, 2025ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. -
విమాన ప్రమాదం.. కారణాలివే
-
‘నో కామెంట్’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025 -
విమాన ప్రమాదంపై AAIB రిపోర్ట్..
-
కేంద్రం చేతికి ఎయిరిండియా ఘటన ప్రాథమిక నివేదిక
భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం✈️ ప్రాథమిక నివేదిక కేంద్రానికి చేరింది. త్వరలో ఇందులోని వివరాలను ప్రజల కోసం బహిర్గతం చేసే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం సెకన్ల వ్యవధిలోనే నేలకూలి పేలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు 270 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికార వర్గాలకు అందజేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఇప్పటిదాకా సేకరించిన విషయాలను, దర్యాప్తు తాలుకా వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాథమిక నివేదికలో ఏం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విమాన ప్రమాదానికి కారణాలు అందులో ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం చివర్లో ఈ నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. 📌 ప్రమాదం వివరాలు:తేదీ: జూన్ 12, 2025 మధ్యాహ్న సమయంవిమాన నంబర్: AI-171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్)స్థలం: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన వెంటనే, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందిమృతులు: 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు సహా మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు🧾 ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు?..బ్లాక్‌బాక్స్ డేటా విజయవంతంగా డౌన్లోడ్ చేసి విశ్లేషణ ప్రారంభించారుకాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారుపైలట్ మేడే కాల్లో “నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్” అని చెప్పిన ఆడియో రికార్డు దొరికింది✈️ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు జూలై 8న అందజేసింది.🔍 తదుపరి దర్యాప్తు:AAIB నివేదికను ఆధారంగా తీసుకుని పూర్తి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాల్సిందిగా కేంద్రం ఆదేశించిందిమరోవైపు ఎన్ఐఏ కూడా కుట్ర కోణంపై విచారణ ప్రారంభించింది -
విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన దరిమిలా అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముగ్గురు శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787 విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పైలట్లు విద్యుత్ వైఫల్యాలను తిరిగి సృష్టించారు. ఫలితంగా డ్యూయల్-ఇంజిన్ నిలిచిపోయంది. దీంతో విమానం టేకాఫ్ తర్వాత పైకి వెళ్లలేకపోయింది.ప్రమాద ఘటన అనంతరం జెట్‌లైనర్ బ్లాక్ బాక్స్‌ల నుండి ఇప్పటికే డేటాను డౌన్లోడ్ చేసుకున్న పరిశోధకులు, 787లోని ఇంధన స్విచ్‌ల స్థానాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇంధన స్విచ్‌ల శిధిలాలతో ఈ డేటాను ధృవీకరించనున్నారు. విమానం క్లిష్టమైన దశకు చేరుకున్నప్పుడు టేకాఫ్ రన్ సమయంలో పైలట్లు అనుకోకుండా ఏదైనా స్విచ్ ఆఫ్ చేశారా? అనేదానిని నిర్ధారించడానికి రీక్రియేషన్ ఉపకరించనుంది.రీక్రియేషన్ చేసిన పైలెట్లు ఘటన జరిగిన నాటి పరిస్థితులను తిరిగి సృష్టించారు. ఈ ఫలితాలతో ట్రిమ్ షీట్ డేటాను రూపొందించారు. ట్రిమ్ షీట్ అనేది విమానం సమతుల్యతను లెక్కించడానికి, రికార్డ్ చేయడానికి ఏవియేషన్‌లో ఉపయోగించే విధానం. ఇది విమానపు టేకాఫ్, ల్యాండింగ్ కోసం గురుత్వాకర్షణ కేంద్రం సురక్షిత పరిమితుల్లో ఉందని నిర్ధారిస్తుంది. శిక్షణ పైలట్లు ఒకే ఇంజిన్ వైఫల్యాన్ని రీక్రియేట్ చేసి, పలు వివరాలను సేకరించారు. కాగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని పైలట్లకు 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు డ్యూయల్-ఇంజిన్ వైఫల్యం తలెత్తితే, దానిని ఎదుర్కొనేందుకు శిక్షణ అందించలేదని సమాచారం. ఇది కూడా చదవండి: బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం -
విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్ స్పూఫింగ్?
సాక్షి, నేషనల్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌మ మొహోల్ సైతం చెప్పారు. గ్లోబల్ పోజీషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. పైలట్‌కు తప్పుడు సంకేతాలు భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–130జే విమానం ఏప్రిల్‌లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్చేశారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్‌పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్‌లో ఇంటర్ఫియరెన్స్ రేటు 175 శాతం, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్‌పిట్‌లోని పైలట్‌కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్‌వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ జామింగ్ లేదా స్పూఫింగ్ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్ సరిహద్దుల్లో స్ఫూపింగ్ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్‌తోపాటు భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో జీపీఎస్ స్ఫూపింగ్, జామింగ్ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణీకులను పీడకలలా వెంటాడుతోంది. దీంతో విమానంలో చీమ చిటుక్కుమంటే చాలు ప్రాణభయంతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఏం చేశారో తెలుసా? జూన్ 30న షాంఘై పుడాంగ్ విమానాశ్రయం - టోక్యో నరిటా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఏం జరిగిందో పదండి తెలుసుకుందాం.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం 36వేల అడుగుల ఎత్తులో శరవేగంగా దూసుకుపోతోంది. 191 మంది ప్రయాణికులతో ఈ విమానం చైనాలోని షాంఘై నుండి జపాన్ రాజధాని నగరం టోక్యోకు వెళుతోంది. సీట్లలో అలా కూర్చుని, సీట్ బెల్ట్ తీసి అలా రిలాక్స్ అవుతున్నారో లేదో ఒక్కసారిగా కలకలం రేగింది. విమానం యాంత్రిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా 10 నిమిషాల్లోపు దాదాపు 36,000 అడుగుల నుండి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు దిగిపోయింది విమానం. క్యాబిన్లో ఒత్తిడి తగ్గడంతో, ఫ్లైట్ అటెండెంట్స్ మాస్క్‌లు ధరించాలనే సూచనలు అందించారు. ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికుల వణికిపోయారు. విమానం కూలిపోతోందనే భయంతో హడలిపోయారు. నిద్రలో ఉన్న ఒక్క కుదుపుతో మేల్కొన్నారు. మరికొందరు ప్రయాణికులు వీడ్కోలు సందేశాలు రాయడం మొదలు పెట్టారు. బ్యాంక్ పిన్లు ,బీమా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలతో ప్రియమైనవారికి సందేశాలు పంపడం ప్రారంభించారు.A #JapanAirlines #flight from #Shanghai to #Tokyo made an emergency landing at Kansai Airport last night after a cabin depressurization alert. The #Boeing 737-800, carrying 191 people, landed safely. No injuries reported. #China #Japan pic.twitter.com/wCneZ3nkk0— Shanghai Daily (@shanghaidaily) July 1, 2025"> మరోవైపు ఈ పరిణామంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత నెలలో, అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం జరిగిన వినాశకరమైన ప్రమాదంలో 275 మంది మరణించారు. అప్పటి నుండి, బోయింగ్ విమానాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలు, తయారీదారు భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా ప్రమాదంపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం... ఆఖరి బాధితుడి గుర్తింపు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు పూర్తయింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా శనివారం 260వ మృతుడిని గుర్తించి, సంబంధీకులకు మృతదేహాన్ని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మొత్తం 260 మంది చనిపోయినట్లు తేలిందన్నారు. జూన్ 12వ తేదీన జరిగిన దుర్ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మొత్తం 241 మంది చనిపోయారు. విమానం కూలిన ప్రాంతంలో మరికొందరు చనిపోయారు. దీంతో, 270 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. అయితే, మృతదేహాలను బట్టి విమానంలోని 241 మంది, నేలపైనున్న 19 మంది కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి శనివారం చెప్పారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. -
బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్‌లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్‌లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
ఎయిరిండియా విషాదం : రూ. 500కోట్లతో టాటా సన్స్ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న లండన్‌కు బయలుదేరిన విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విషాద సంఘటన 270 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం రూ. 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అటా సన్స్ యోచిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోరవిషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీని గురించి చర్చించారు.ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ల బోర్డుకు వివరిస్తూ, సహాయక చర్యలు త్వరగా అమలు అయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నానని చంద్రశేఖరన్ వివరించారు. అలాగే వీరి సహాయార్థం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ రూ. 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో రెండు ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్ , సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు."టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటి" గా పేర్కొన్న చంద్రశేఖరన్, కంపెనీ తన బాధ్యతల నుండి వెనక్కి తగ్గదని గాయపడిన వారి వైద్య ఖర్చులు, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాకారం తోపాటు సంబంధిత అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్లాక్‌బాక్స్ నుంచి డేటా సేకరణ షురూ
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్‌బాక్స్‌ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్‌ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ప్రతినిధులు ఉంటారని పేర్కొంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్) రెండూ ఏఏఐబీ) ఆధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ‘ఈ నెల 25న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఏఐబీ, ఎన్‌టీఎస్‌బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సీపీఎం)ను సురక్షితంగా వెలికి తీశారు. మెమరీ మాడ్యూల్‌ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఏఐబీ ల్యాబ్‌లో డౌన్లోడ్ చేశాం. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), విమాన డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునరి్నర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది’అని పౌర విమానయాన శాఖ తెలిపింది. -
అరిగిపోయిన టైర్లు.. అడుగడుగునా నిర్లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: విమానసంస్థల నిర్లక్ష్యం, విమానాశ్రయాల నిర్వహణ తీరుపై కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విషాదం నేపథ్యంలో ఈనె 20, 21వ తేదీల్లో పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో సేఫ్టీ ఆడిటింగ్ చేపట్టింది. ఒక విమానయాన సంస్థకు చెందిన విమానం టైర్లు పూర్తిగా అరిగిపోయినా దాన్ని అలాగే టేకాఫ్ చేయిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే ఆ విమానాన్ని నిలిపివే యాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసి ఇలాంటివే పలు లోపాలు డీజీసీఏ ఆడిట్ సమ యంలో అధికారుల దృష్టికి వచ్చాయి. అహ్మదాబాద్‌లో ఘోర విషాదం జరిగిన తర్వాత కూడా దేశీయ విమా నాయాన సంస్థల నిర్వహణ తీరు మారకపోవడంపై డీజీసీఏ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. నిబంధనలు బేఖాతరు...ఒక ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఉండే సెట్టర్ లైన్ మార్కింగ్ కనిపించని విషయాన్ని అధికారులు ఆడిట్లో గుర్తించారు. పైలట్లకు ఈ మార్కింగ్ స్పష్టంగా కనిపించకుంటే రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, విమాన సంస్థలు పలురకాల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, చాలావరకు విమానయాన సంస్థలు గత మూడేళ్లుగా అవసరమైన డేటాను అప్డేట్ చేయలేదని తెలిసింది. విమానాశ్రయం లోపల స్పీడ్ గవర్నర్లు లేకుండానే చాలా వాహనాలు నడుస్తున్నట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్‌లో కూడా చాలా లోపాలు ఉన్నట్లు ఆడిట్లో గుర్తించారు. విమానం ఒకటైతే.. శిక్షణ మరొకటి...ఒక విమానం నడపడానికి పైలట్‌కు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తారు. పైలట్ ఆ విమానాన్ని నడపడానికి, అందులోని కమాండ్లను అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఇస్తారు. అయితే, విమానం ఒకటైతే పైలట్‌కు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ ఇంకొకటని, అది ఆ విమానం కాన్ఫిగరేషన్‌తో సరిపోలలేదని సేఫ్టీ ఆడిట్లో వెల్లడైంది. దీంతో, విమాన ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే పైలట్‌కు దిక్కుతోచని స్థితి తప్పదని తేలింది. ఇంజనీర్లు కూడా లేరు విమానం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్‌లను పాటించడం లేదని కూడా ఈ ఆడిట్లో తేలింది. విమానంలో ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేయడానికి చాలా చోట్ల ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్లు లేరని గుర్తించారు. విమానానికి సబంధించిన మరమ్మతుల రిపోర్ట్‌ను టెక్నికల్ లాగ్ పుస్తకంలో నమోదు చేయడంలేదని తేలింది. ఈ రికార్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని సైతం డీజీసీఏ సేఫ్టీ ఆడిట్ బృందం గుర్తించింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్బాక్స్(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.బ్లాక్‌బాక్స్‌లో ముందు భాగంలో ఉండే క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ల్యాబ్‌లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్స్, ఫ్లైట్ డాటా రికార్డర్స్ నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.బ్లాక్‌బాక్స్‌తో..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్‌కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రియుడితో కయ్యం.. ప్రేమ పిచ్చి దెయ్యం.. జైలు పాలైన వైనం
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్‌లో సీనియర్ రోబోటిక్స్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్‌ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడిఅ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్‌లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్‌ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్‌ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్‌ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్‌తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. -
విద్యుత్ వైఫల్యమే కారణం!
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అకస్మాత్తుగా విద్యుత్ వైఫల్యం చెందడం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. అత్యవసర టర్నరౌండ్ను అమలు చేయడానికి లేదా మొత్తం విద్యుత్ నష్టం జరిగినప్పుడు బ్యాక ప్ వ్యవస్థ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ)ను ఉపయోగించుకోవడానికి అవసరమైన కనీస ఎత్తుకు విమానం చేరుకోలేదు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేసిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందంటున్నారు. బ్లాక్ బాక్స్‌లు – ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఆ«దీనంలో ఉన్నాయి. అయితే బ్లాక్ బాక్స్‌లను విదేశాలకు పంపుతున్నట్లు వస్తున్న వార్తల స్పందించిన పౌర విమానయాన శాఖ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.231 డీఎన్ఏల గుర్తింపు.. 210 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 231 డీఎన్ఏ నమూనాలు సరిపోలాయని, 210 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ శుక్రవారం తెలిపింది. మృత దేహాలు అప్పగించిన 210 మందిలో 166 మంది భారతీయులు కాగా, ఏడుగురు పోర్చుగీస్, 36 మంది బ్రిటిషర్స్, ఒక కెనడియన్ ఉన్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. 183 మంది మృతదేహాలను అంబులెన్స్‌ల ద్వారా, 15 మంది మృతదేహాలను విమానంలో పంపించినట్లు తెలిపారు. విమాన ప్రమాదంలో 222 మంది బాధితులను గుర్తించగా, వారిలో ఎనిమిది మంది డీఎన్ఏ మ్యాచ్ కాలేదని తెలిపారు. జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోవడం, విమానంలోని 241 మంది మరణించడం తెలిసిందే. -
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్‌లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.అతడు చెప్పేది అబద్ధంఅతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.ట్వీట్ డిలీట్ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్‌లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.నటిగా..గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్‌కపూర్‌ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు. Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025 చదవండి: ధనుష్‌తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా! -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్‌లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్‌లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్‌తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్‌లోని 33 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్‌లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
ఎయిరిండియా ఘటన: బ్లాక్‌బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్‌బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్‌క్లూజివ్‌గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్‌కు పంపడంఅమెరికాలోని ఎన్‌టీఎస్‌బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌బాక్స్ ట్విస్ట్! -
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్‌లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్‌లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
Ahmedabad Plane Incident: ‘ఒక ఇంజిన్‌ను మార్చిలో చేంజ్ చేశాం..’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్లైన్స ఇండియాపై అపనమ్మకం ఎక్కువ కావడంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమాన మెయింటినెన్స్ పరంగా చూస్తే తమ నుంచి ఎటువంటి తప్పిదాలు లేకపోయినా ఆ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకర పరిణామమన్నారు ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్. ఈ మార్చి నెలలో ప్రమాదానికి గురైన విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్‌ను మార్చామన్నారు. అదే సమయంలో ఏప్రిల్‌లో ఎడమవైపు ఇంజిన్‌ను పరీక్షించామని స్పష్టం చేశారు. అయితే 2024 జూన్‌లో ఆ విమానానినికి మేజర్ ఇన్స్పెక్షన్ నిర్వహించామని, ఈ డిసెంబర్లో ఆ విమానాన్ని పూర్తి పర్యవేక్షణ అనేది షెడ్యూల్ చేయబడిందన్నారు. ఈ మేరకు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ లాయల్టీ ప్రొగ్రామ్ మహరాజా క్లబ్ సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు క్యాంప్‌బెల్ విల్సన్. ఇక్కడ విమానం మెయింటినెన్స్ నిర్వహణలో ఎటువంటి లోపం జరగలేదని, పైలట్ల విషయంలో కూడా అపార అనుభవం ఉన్నవారే ఉన్నారన్నారు. ఆ విమానాన్ని నడిపన పైలట్, కో పైలట్లకు ఇద్దరికీ కలిపి 13,400 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉందన్నారు. -
Ahmedabad Plane Incident కో పైలట్‌కు కన్నీటి వీడ్కోలు..
ముంబై: గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన కో పైలట్ క్లైవ్ కుందర్‌కు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈరోజు(గురువారం. జూన్ 19వ తేదీ) ఉదయం క్లైవ్ కుందర్ మృతదేహాన్ని ముంబైలోని అయన నివాసంలో ఉంచగా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే క్లైవ్ కుందర్ తల్లి బోరున విలపించారు. తన కుమారుడిని ఇలా చూస్తానని ఊహించలేదని కుందర్ తల్లి శోకతప్త హృదయంతో విలపించారు. కుందర్ బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సేవిరి క్రైస్తవ స్మశానవాటికకు తరలించారు. ముంబైలోని గొరెగావ్ వెస్ట్‌లో తల్లి, దండ్రులు, ఒక సోదరితో కలిసి జీవిస్తున్న కుందర్‌కు 1, 100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్, కో-పైలట్‌గా ఉన్నారు. అయతే విమానం టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలో కూలిపోవడంతో మొత్తం విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ తో సహా 241 మంది అసువులు బాసారు. ఆ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే డీఎన్ఏ టెస్టులు పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను వారి వారి బంధువులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాల గుర్తింపులో జాప్యం చోటు చేసుకుంటోంది. -
Plane Crash: విషాదంగా ముగిసిన మరో దంపతుల కథ..!
అహ్మదాబాద్ సమీపంలో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకరు తల్లిదండ్రులు కలవాలనుకుంటే..మరొకరు కుటుంబంతో కలిసి ఆనందంగా లండన్‌లో గడపొచ్చని..ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కమ్మని కలతో లండన్‌కి పయనమయ్యారు. అయితే గమ్యం చేరక ముందే ఘోర ప్రమాదానికి బలయ్యారు. అదే ప్రమాదంలో చనిపోయిన ఒక యువ దంపతుల కథ వింటే కళ్లు చెమర్చక మానవు. గుజరాతీకి చెందిన ఈ జంట తమ కంటి పాప రాకను స్వాగతించాలనే ఆకాంక్షతో ఆనందంగా లండన్‌కు పయనమైంది. అంతలోనే ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం ఆ ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేసేసింది. ఇద్దరు ఆ విమాన ప్రమాదంలో అసువులు బాశారు. తమవాళ్లకు తీరని శోకం మిగిల్చారు. వారే వైభవ్ పటేల్, జినాల్ గోస్వామి దంపతులు. జినాల్ గోస్వామి ఏడు నెలల గర్భిణి. సీమంతం వేడుక కోసం ఆ దంపతులిద్దరు లండన్ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చారు. ఇక్కడే ఆ వేడుకని ఘనంగా చేసుకుని తిరిగి లండన్ పయనమయ్యారు. తమ తొలి సంతనం రాకకే ఎంతో ఆనందంగా ఎదురు చూసిన ఆజంట ఊహించిన ఈ విమాన ప్రమాదంలో దుర్మణం పాలయ్యారని అతడి సన్నహితుడు నీరవ్ చెబుతున్నారు. తనకు వైభవ్ చాలా ఏళ్లుగా తెలుసునని ఇటీవలే లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో స్థిరపడ్డాడని అన్నారు. అతడికి పెళ్లై నాలుగేళ్లు అయ్యిందని. తమ కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న బిడ్డ కోసంఎంతో సంతోషంతో ఉన్న ఆ దంపతులు ఇలా ఈ ప్రమాదానికి బలైపోవడం జీర్ణించుకోలేపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యాడు నీరవ్. కాగా, అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 241 మంది మరణించగా, భారత సంతతి బ్రిటిష్ వ్యాపారవేత్త 40 ఏళ్ల రమేష్ విశ్వాస్ ఒక్కడే బతికిబట్టకట్టాడు. (చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్‌లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్‌లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు. -
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్‌లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025 -
Ahmedabad Plane Crash: భద్రతకు ఢోకాలేదు.. కానీ.. ‘వాచ్డాగ్’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు దారితీసిన అంశాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఎయిర్ ఇండియాకు చెందిన 24.. 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల సమీక్ష చేపట్టింది. దీనిలో పాల్గొన్న డీజీసీఏ.. 24 బోయింగ్ 787 విమానాలతో ఎటువంటి భద్రతా సమస్యలు లేవని తెలిపింది. అయితే ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్లలో అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎయిర్ ఇండియాకు సూచించింది.తాజాగా ఎయిర్ ఇండియా తన దగ్గరున్న మొత్తం 33 బీ 787-8/9 విమానాలలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తోంది. వీటిలో 24 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 12- 17 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా మొత్తం 514 విమానాలను నడిపింది. వాటిలో 83 రద్దు అయ్యాయి. వీటిలో 66 రద్దులు బోయింగ్ 787 విమానాల విమానాలకు సంబంధించినవి. అత్యధిక సంఖ్యలో డ్రీమ్లైనర్లు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు సంయుక్తంగా దేశీయ, అంతర్జాతీయంగా ప్రతిరోజూ వెయ్యికి పైగా విమానాలను నడుపుతున్నాయి.ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా.. -
ఎయిర్ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు!
న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్ 17) వరుసపెట్టి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు శాన్ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు. -
Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు డ్యుయల్ ఇంజన్‌తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్ పని చేయని పక్షంలో మరో ఇంజన్ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది. ఎయిర్‌లైన్స్‌లో RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది. విమానంలో ఆటోమేటిక్‌గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న. గేర్లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన. టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు -
Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది. -
టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్ల్సాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-పారిస్ విమానంలో సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కాగా, తాజాగా ఢిల్లీ-పారిస్ విమానాన్ని రద్దు చేశారు. మంగళవారం(జూన్ 17) నాడే మూడు ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఆ తర్వాత అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం, ఇప్పుడు ఢిల్లీ-పారిస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేయాల్సి వస్తుంది. ఇటీవల జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం బీజే మెడికల్ హాస్టల్‌పై కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. అందుకు తగ్గట్టే ఆ సర్వీసుల్లోనే వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో మరింత భయం పుట్టిస్తోంది ప్రయాణికుల్లో. గత 48 గంటల్లో వరుసగా 9 విమానాల్లో సాంకేతిక లోపాల్ని గుర్తించారు. -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్‌లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్‌కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
పైలట్ సుమీత్ సభర్వాల్ అంత్యక్రియలు పూర్తి
ముంబై: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన పైలట్ సుమీత్ సభర్వాల్ మృతదేహాన్ని ముంబైలోని అతని స్వగృహానికి తరలించారు. పోవైలోగల జల్ వాయు విహార్‌కు మంగళవారం ఉదయం అతని మృతదేహం చేరుకోగానే, అక్కడ గంభీరమైన నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ ఏI-171 ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.పైలట్ సుమీత్ సభర్వాల్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అతని ఇంటికి చేరుకున్నారు. సుమీత్ మృతదేహానికి అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ల కెప్టెన్ సభర్వాల్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ముందుగానే పదవీ విరమణ చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.చిన్నప్పటి నుంచి సభర్వాల్‌ను తెలిసిన పొరుగువారు మాట్లాడుతూ ‘సబర్వాల్ కుటుంబం దశాబ్దాలుగా ఇక్కడేవుంటోంది. సబర్వాల్ ఎంతో ధైర్యవంతుడు. విమానం ప్రమాదంలో పడిన సమయంలో అతను విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించి ఉంటారు. వారి కుటుంబానికి ఇది తీరని నష్టం. సబర్వాల్ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి -
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్‌కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్‌ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.జూన్ 12న అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్‌ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025 -
భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4— ANI (@ANI) June 16, 2025తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot. He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025 కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్యవిజయ్ రూపానీ - అంజలి రూపానీ విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్‌లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్‌ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్‌ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీ సమావేశం
-
అహ్మదాబాద్‌కు ‘బోయింగ్’ నిపుణులు.. ప్రమాదంపై విశ్లేషణ
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై అన్నివైపుల నుంచి దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ప్రమాదంపై విశ్లేషించేందుకు ‘బోయింగ్’ నిపుణులు సోమవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 242 మందితో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని ఒక వైద్య కళాశాలపై కూలిపోయింది.ఈ ప్రమాదంలో 11 ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ మృతిచెందారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను 2023 జూన్‌లో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి సమగ్ర తనిఖీలు చేయాల్సివుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికిందని ధృవీకరించారు. ఇది ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడంలో వారికి సహాయపడనుంది. #AhmedabadPlaneCrash || PK Mishra, Principal Secretary to @PMOIndia, visits the plane crash site in Ahmedabad and reviews the ongoing operations. pic.twitter.com/fBQ98M9xT1— All India Radio News (@airnewsalerts) June 15, 2025ఆదివారం బీజే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రాకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానంలో కీలకమైన డేటాను రికార్డ్ చేసే పరికరం హాస్టల్ పైకప్పుపై లభ్యమయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అంతర్జాతీయ ప్రోటోకాల్‌ల కింద సమాంతర దర్యాప్తును నిర్వహిస్తోంది.ఇది కూడా చదవండి: 2027 మార్చి ఒకటి నుంచి జనగణన.. ప్రక్రియ ఇదే.. -
Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితుల సంఖ్య రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా తన భర్త, చిత్ర నిర్మాత కనిపించడంలేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా సందేహాల మధ్య కుటుంబం DNA నమూనాలను సమర్పించింది . మరోవైపు అతని మొబైల్ ఫోన్ చివరిగా భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.నరోడా-నివాసి మహేష్ కలవాడియా, మహేష్ జిరావాలా (Mahesh Jirawala) అని కూడా పిలుస్తారు. సంగీత ఆల్బమ్‌లకు దర్శకత్వం వహిస్తాడు. లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి, అదృశ్యమైనాడని అతని భార్య హేతల్ ఫిర్యాదు చేసింది."నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేసి తన సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, నేను అతని ఫోన్‌కు కాల్ చేసాను కానీ అది స్విచ్ ఆఫ్ అయింది. అతని స్కూటర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, అతని మొబైల్ ఫోన్ చివరిగా అతను క్రాష్ సైట్ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించింది" అని ఆమె ఆందోళన చెందుతోంది. సాధారణంగా తన భర్త ఈ మార్గంలో ఎపుడూ రాడని, ఏమైందో అర్థం కావడంలేదని హేతల్ తెలిపింది.కాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్లోసర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్‌లోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలోకి విమానం కూలిపోయింది. AI-171 విషాదకరమైన ప్రమాదం జరిగి మూడు రోజుల తరువాత, ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆసుపత్రి అధికారులు ఆదివారం DNA మ్యాచింగ్ ద్వారా 47 మంది బాధితులను గుర్తించినట్లు నిర్ధారించారు. అధికారులు 24 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. భయంకరమైన విషాదంలో బాధితుల గుర్తించేందుకు ధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్‌కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్‌లోని మహిసాగర్‌కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు. (Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య)‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్‌లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల గుర్తింపు
-
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. విమాన భయం అధిగమించేందుకు..భయం పోయేలా 4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్‌గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
ఆకాశమంత విషాదానికి అసలు కారణం అదేనా?
-
Plane Crash: నా భార్యకింకా తెలియదు..!
అహ్మదాబాద్: ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఓ టీ స్టాల్ వెనక కూలింది. ఆ టీ కొట్టు నడిపే సీతాబెన్ అనే మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. కాలిన గాయాలతో బతికి బయటపడింది. చెట్టుకింద టీస్టాల్లో నిద్రపోతున్న 14 ఏళ్ల కుమారుడు ఆకాశ్ మాత్రం మంటలకు బలయ్యాడు. తన వెనకగా చెలరేగుతున్న మంటల నుంచి సీతాబెన్ తప్పించుకుని పరుగెత్తుకుంటూ వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐసీయూలో కోలుకుంటున్న ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘నేను విమానాన్ని చూడలేదు. కానీ భారీ శబ్దం విన్పించింది. వెంటనే మంటలు, పొగ కమ్ము కుంటుండటంతో ఏమీ కన్పించకుండా పోయింది. భయపడి పరుగులు తీశాను’’ అంటూ గుర్తు చేసుకుంది.నా భార్యకింకా తెలియదుసీతాబెన్ భర్త సురేశ్‌కుమార్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ‘‘ప్రమాద సమ యంలో నేను ఇంట్లో ఉన్నా. టీ స్టాల్లో ఉన్న నా భార్యకు ఆకాశ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లాడు. తర్వాత అక్కడే పడుకుని ప్రమాదానికి బలైపో యాడు’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘ఈ ఘోరం గురించి నా భార్యకు ఇంకా చెప్పలేదు. నా కొడుకు మృతదేహం గుర్తించలేనంతగా కాలిపోయింది. దాంతో పరీక్షల నిమిత్తం నా డీఎన్ఏ నమూనా ఇచ్చా’’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. -
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
-
Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికఖాయం
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్‌వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025 -
Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం జరిగిన జూన్ 12న గుజరాత్‌కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్ వెంటనే తన విమాన టికెట్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.యమన్ వ్యాస్ కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్‌కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్‌లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్‌కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్‌లో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది. -
Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం దరిమిలా మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 31 మృతదేహాలను ధృవీకరించారు. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్ వెళ్తున్న ఏI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌పై కూలిపోయింది.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో 31 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారని ఒక అధికారి తెలిపారు. వీటిలో 12 మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు వచ్చారని తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు, సంబంధీకులకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాధితులను సంప్రదించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ 31 మంది మృతదేహాలు సంబంధీకుల డీఎన్ఏతో సరిపోలాయని, వీటిలో 12 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని డాక్టర్ పటేల్ పేర్కొన్నారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాలకే విమానం కూలిపోయింది. అధికారులు తెలిపిన ప్రకారం ఆ రోజు విమానంలో ప్రయాణించినవారి చెక్-ఇన్ లగేజీ సురక్షితంగా ఉందని, గుజరాత్ పోలీసులు ఈ లగేజినంతటినీ ఎయిర్ ఇండియాకు అప్పగించనున్నారు. ఆ తరువాత బ్యాగేజ్ స్టిక్కర్ల ఆధారంగా మృతుల కుటుంబాలకు లగేజీని అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌తో సంబంధాన్ని ఖండించిన టర్కీ -
ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌తో సంబంధాన్ని ఖండించిన టర్కీ
అంకారా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ నిర్వహణతో తమకు సంబంధం లేదని టర్కీ స్పష్టం చేసింది. టర్కీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్ దీనిపై స్పందిస్తూ, బోయింగ్ 787-8 ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణను టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదనను ఖండించింది.అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానాన్ని టర్కిష్ టెక్నిక్ నిర్వహించిందనే వాదన తుర్కియే-భారత్ సంబంధాలను దెబ్బతీసేలా ఉందని , ఇది ప్రజల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశించిన తప్పుడు సమాచారమని టర్కీ యంత్రాంగం ‘ఎక్స్’లో పేర్కొంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్ ఆవరణలోకి కూలిపోయింది. The claim that ‘the maintenance of the Boeing 787-8 passenger aircraft was carried out by Turkish Technic’ following the crash of an Air India passenger aircraft during take-off is false.The claim that the crashed aircraft was maintained by Turkish Technic constitutes… pic.twitter.com/lmdjVKHMSo— Dezenformasyonla Mücadele Merkezi (@dmmiletisim) June 13, 2025‘2024-25 ఏడాదికి సంబంధించి ఎయిర్ ఇండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీ777-రకం వైడ్-బాడీ విమానాలకు ప్రత్యేకంగా టర్కీలో నిర్వహణ సేవలు అందిస్తారు. అయితే ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. నేటి వరకూ టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ సేవలు అందించలేదు’ అని టర్కీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని ఊహాగానాలను వ్యాపించకుండా ఉండేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చిన దరిమిలా భారత్‌లోని తొమ్మిది విమానాశ్రయాలలో సేవలను అందించిన ఒక టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోంది. అలాగే మే 8న భారత్‌పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ భాగం టర్కీలో తయారయినవి అని తేలింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో అప్రమత్తమైన టర్కీ.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ నిర్వహణలో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్ బయలుదేరి.. -
ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక మలుపు..
-
Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్ బయలుదేరి..
అహ్మదాబాద్: దేశంలో సంభవించిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లండన్‌లోని తన ముద్దుల మనవరాళ్లలో ఆనందంగా ఆడుకోవాలనే ఆశతో బయలుదేరిన ఆయన అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయారు.బద్రుద్దీన్ హలానీ తన భార్య యాస్మిన్, వదిన మాలెక్‌తో కలిసి విమానంలో లండన్ బయలుదేరారు. అక్కడ తన మనవరాళ్లతో కలసి ఆడుకుంటూ కాలం గడపాలని ఎన్నో కలలుగన్నారు. అలాగే తన కలల ప్రాజెక్ట్ అయిన సిల్వాసాలోని ఆర్ఎస్ఎస్ఎస్ అనుబంధ సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించేందుకు అమెరికా వెళ్లాలని కూడా బద్రుద్దీన్ హలానీ ప్లాన్ చేసుకున్నారు. అతని సోదరుడు రాజుభాయ్ హలానీ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న సామాజిక సేవ చేయడంలో ముందుంటారని, సిల్వాసాలోని సైనిక్ స్కూల్ నెలకొల్పాలని అనుకున్నారన్నారు. లండన్‌లో తన మనవరాళ్లతో ఆనందంగా కాలం గడపాలని అనుకున్నారని తెలిపారు.ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ లండన్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. తన తండ్రి మృతదేహాన్ని గుర్తించేందుకు తన డీఎన్ఏ నమూనాను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా ఇద్దరు కుమార్తెలు.. తాతనాన్నమ్మ లండన్ వస్తున్నారని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాత కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఆ కార్డులను ఎవరికి ఇస్తారు? మా కుటుంబానికి తట్టుకోలోని పరిస్థితి ఎదురయ్యింది. మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. నేను ఏ బొమ్మ అడిగితే, అది కొనిచ్చారు. అదే ప్రేమ మనవరాళ్లకు కూడా ఇస్తారని అనుకున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే.. -
Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్‌లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్‌లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడాన్ని గమనించాడు. ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న 20 మంది బాధితులను ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో.. -
‘171’ నంబర్‌కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ‘ఏఐ171’అనే నంబర్ కలిగిన బోయింగ్ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగించాయి.ఇక, అహ్మదాబాద్–లండన్ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్‌తో పిలువనున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్171’నంబర్‌ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్‌ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్‌ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్ ఇండియా పైలట్ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. -
ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఎయిర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీలోని ఉడాన్ భవన్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. మీడియా సమావేశానికి ముందు అక్కడి వారంతా మృతులకు సంతాపసూచికగా ఒక నిమిషం మౌనం పాటించారు. ‘‘ఉన్నత స్థాయి బృందంలో హోంశాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ నియమించాం. అవసరమైతే మరి కొందరిని కమిటీలోకి తీసుకుంటాం. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుందని భావిస్తున్నాం’’అని మంత్రి తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయన్నారు. ‘‘బోయింగ్787–8 డ్రీమ్‌లైనర్ విమానంలోని బ్లాక్‌బాక్స్ శుక్రవారం సాయంత్రం దొరికింది. దానిని డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని సమగ్రస్థాయిలో విశ్లేషించిన తర్వాతే మీడియాకు అదనపు సమాచారం అందజేస్తాం. బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం. ప్రస్తుతం బోయింగ్787 సిరీస్‌లో 33 విమానాలు ఉన్నాయి. వీటిలో ఏడు విమానాల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించా. ఈ సిరీస్ విమానాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించాం. ఉన్నత స్థాయి బృందం సోమవారం భేటీ అవుతుంది’’అని మంత్రి పేర్కొన్నారు. ఆ బాధ నాకూ తెలుసు.. ఈ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రామ్మోహన్ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, మృతదేహాలను వీలైనంత తొందరగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. -
దురదృష్టంగా భావించే సీటే ఇప్పుడు హాట్ కేకు
11ఏ. ఎయిరిండియా విమాన ప్రమాదం తరువాత ఎక్కడ చూసినా ఈ సీట్ నంబర్ గురించిన చర్చే. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు రమేశ్ కూచున్నది ఆ సీట్లోనే కావడం తెలిసిందే. సాధారణంగా 11ఏను దురదృష్టకరమైన నంబర్‌గా పిలుస్తారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే ఉంటుంది. బిజినెస్ క్లాస్ పూర్తవగానే మొదలయ్యే ఎకానమీ క్లాసులో ఉంటుంది గనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ సీటు పక్కనే వస్తుంది. దాంతో 11ఏ సీటుకు కిటికీ ఉండదు. చాలామంది అందమైన మేఘాలను, భూమిపై బుల్లిగా కనిపించే ఊళ్లు, పట్టణాలను చూసే ఆసక్తితో విండో సీటే కోరుకుంటారు. ఆ అవకాశం ఉండదు గనుక 11ఏను ఎవరూ అంతగా ఇష్టపడరు. కానీ రమేశ్ విషయంలో ఈ దురదృష్టకరమైన సీటే ప్రాణదాతగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఊడిపోవడమే గాక పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ విరిగిపోయింది. దాంతో వెంటనే కిందికి దిగి ప్రాణాలతో బయటపడ్డాడు.అప్పుడూ 11ఏ సీటే27 ఏళ్ల కిందట థాయ్ ఎయిర్వేస్ విమానం కూలిపోయినప్పుడు కూడా అచ్చు ఇలాగే జరిగింది. 1998 డిసెంబర్ 11న దక్షిణ థాయ్‌లాండ్‌లో ల్యాండయ్యే క్రమంలో అది చిత్తడి నేలల్లో పడిపోయింది. విమానంలోని 146 మందిలో 101 మంది మరణించారు. కానీ 11ఏ సీట్లో కూర్చున్న థాయ్ నటుడు–గాయకుడు రువాంగ్సాక్ లోయ్చుసాక్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా ప్రమాదంలోనూ సరిగ్గా అదే నంబర్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు క్షేమంగా బయట పడ్డట్టు తెలిసి ఎంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారాయన. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘నాకు రెండో జీవితం దక్కింది బహుశా 11ఏలో కూచోవడం వల్లేనేమో. నాటి బోర్డింగ్ పాస్ నా దగ్గర లేదు. కానీ నా సీట్ నంబర్ అప్పుడు పత్రికలన్నింట్లోనూ వచ్చింది. ఆ ప్రమాదం దెబ్బకు దశాబ్దం పాటు నేను విమాన ప్రయాణం చేయలేదు’’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.ఆ సీటుపై ఆసక్తిఎయిరిండియా విమాన ప్రమా దం తరువాత వాణిజ్య విమానాల్లో ఎమ ర్జెన్సీ ఎగ్జిట్ సీట్లపై ఆసక్తి పెరిగింది. 11ఏ సీట్‌నే బుక్ చేసుకోవాలను కుంటున్నట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రమేశ్ ఉదంతంతో ఈ సీట్ చాలా సురక్షితమని భావిస్తున్నారు. కానీ అది నిజమనేందుకు ఎలాంటి సాంకేతిక ఆధారాలూ లేవు. ఒక్కో ప్రమాదం ఒక్కోలా జరుగుతుంది గనుక ఫలానా సీటు సురక్షితమని చెప్పలేమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ అన్నారు. విమానంలో ముందుకంటే వెనక వైపు సీట్లు ఎక్కువ సురక్షితమని 1971 నుంచి జరిగిన ప్రమాదాలపై 2007లో పాపులర్ మెకానిక్స్ చేసిన అధ్యయనంలో తేలింది. -
274కు పెరిగిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అంతా దుర్మరణం పాలవడం తెలిసిందే. విమానం రన్‌వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంటీన్, బాయ్స్ హాస్టల్ భవనాలపై పడి పేలిపోవడమే గాక మరో రెండు పరిసర భవనాలకు కూడా నిప్పంటుకుంది. దాంతో వాటిలో ఉన్నవారిలోనూ చాలామంది చనిపోయారు. వారి సంఖ్య 33గా శనివారం తేలింది. ఇదే తుది సంఖ్యా, లేక మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాద సమయంలో మెస్, హాస్టల్ భవనాల్లో కనీసం 40 మందికి పైగా వైద్య విద్యార్థులున్నట్టు కాలేజీ వర్గాలు శనివారం తెలిపాయి. వారికి తోడు పలువురు స్థానికులు కూడా ఉన్నట్టు వెల్లడించాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి ఇప్పటిదాకా 270 మృతదేహాలు వచ్చినట్టు బీజే మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేతీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులని గురువారమే తేలడం తెలిసిందే. అక్కడ టీ స్టాల్ నడిపే కుటుంబానికి చెందిన ఆకాశ్ పాట్నీ అనే 14 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తాజాగా ధ్రువీకరణ అయింది. మిగతా 27 మందిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు ఎంతమంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదంలో నాలుగు భవనాలు బాగా దెబ్బతిన్నట్టు కాలేజీ డీన్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. ‘‘దర్యాప్తు నిమిత్తం బాయ్స్ హాస్టల్ భవనాలను ఖాళీ చేయిస్తున్నాం. ఇప్పటికే 200 మంది విద్యార్థులకు పైగా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న, జరగబోయే ఎంబీబీఎస్ ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేస్తున్నాం’’అని ప్రకటించారు. హాస్టల్ భవనంపై చిక్కిన విమానం తోక భాగం నుంచి శనివారం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అది ఎయిర్‌హోస్టెస్‌దిగా తేల్చారు. కొనసాగుతున్న డీఎన్ఏ పరీక్షలు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయిపోవడం తెలిసిందే. గుర్తుపట్టే స్థితిలో ఉన్న 8 మృతదేహాలను ఇప్పటికే కుటుంబీకులకు అప్పగించారు. మిగతా వాటికి డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారానికి 11 మృతదేహాలను గుర్తించారు. మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు కౌన్సెలర్లను అందుబాటులో ఉంచారు. మరణించిన విమాన ప్రయాణికుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే. బోయింగ్ విమానాల్లో భద్రతా తనిఖీలుప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు 26 బోయింగ్ 787–8, ఏడు 787–9 సిరీస్ విమానాలను భద్రతాపరంగా క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటిదాకా 9 విమానాల్లో తనిఖీలు పూర్తయినట్టు వెల్లడించింది. తనిఖీల కారణంగా పలు ఎయిరిండియా విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787–8 విమానానికి వచ్చే డిసెంబర్లో సమగ్ర తనిఖీలు జరగాల్సి ఉంది. దాన్ని చివరిసారిగా 2023 జూన్‌లో క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుడివైపు ఇంజన్‌ను గత మార్చిలో ఓవరాలింగ్ చేశారు.వీడియో తీసిన టీనేజర్‌ను విచారించిన పోలీసులు ఎయిరిండియా విమాన ప్రమాద వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. ఆర్యన్ 17 ఏళ్ల బాలుడు తన మొబైల్‌తో ఆ వీడియో తీశాడు. దర్యాప్తులో భాగంగా సాక్షిగా అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతని స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. తాను వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టిన 24 సెకన్లలోనే విమానం కూలినట్టు ఆర్యన్ మీడియాకు తెలిపాడు. ‘‘కళ్లముందే జరిగిన ప్రమాదంతో విపరీతంగా భయపడిపోయా. చాలాసేపటిదాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయా. వీడియోను మొదట నా సోదరికి చూపించా. తర్వాత మా నాన్నకు చెప్పా. కళ్లు మూసినా, తెరిచినా విమాన ప్రమాదమే గుర్తుకొస్తోంది. మేముండే ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఉండాలని లేదు’’అని చెప్పుకొచ్చాడు. ఆర్యన్ ఆ రోజంతా ఏమీ తినలేదని, రాత్రంతా నిద్ర కూడా పోలేకపోయాడని అతని తల్లి చెప్పింది. రెండుసార్లు వాయిదా వేసుకుని.. రూపానీ మృత్యుప్రయాణం! విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ వాస్తవానికి మే 19నే లండన్ వెళ్లాల్సింది. అసెంబ్లీ ఉప ఎన్నిక పనుల కారణంగా టికెట్ రద్దు చేసుకుని ప్రయాణాన్ని జూన్ 5కు వాయిదా వేసుకున్నారు. తర్వాత అదీ రద్దు చేసుకుని జూన్ 12న ప్రమాదం బారిన పడిన ఏఐ171లోనే టికెట్ బుక్ చేసుకున్నారు. అలా విధి ఆయనను మృత్యుముఖానికి నడిపించింది. 2డి నంబర్ సీట్లో కూచున్న ఆయన ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో చిక్కి మరణించారు. -
‘నాన్నా.. నేను మాత్రం బ్రతికాను.. తమ్ముడు ఏమయ్యాడో తెలీదు’
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం జూన్ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్ విశ్వాస్ కుమార్‌తో పాటు అతని సోదరుడు కూడా లండన్ బయల్దేరాడు. కానీ రమేశ్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్‌ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్ తన తండ్రికి ఫోన్ చేసిన విషయాన్ని రమేశ్ మరో సోదరుడు నయన్ కుమార్ రమేశ్ స్కై న్యూస్క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్ విశ్వాస్ ఫోన్ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు. What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే! -
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్లో ఐదు సెకన్ల పాటు రికార్డ్ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్.. నో త్రస్ట్.. గోయింగ్ డౌన్ ఇవి కెప్టెన్ సబర్వాల్ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్‌కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్‌కు సమానార్ధకం. ఫ్రెంచ్‌లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే..!ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. -
ఆ భగవద్గీత ఈమెదే!
అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు. విమాన ప్రయాణికులు సజీవ దహనమైపోవటంతో పాటు విమానం కూలిన భవనంలోని వాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే..ఈ దుర్ఘటనలో కన్నీటి కథలు.. ఎన్నో భావోద్వేగ గాథలు వెలుగుచూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని.. విమానం మొత్తం కాలిబూడిదైనా ఆ పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . అయితే.. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే.. భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే.. మరోవైపు, అసలు ఆ భగవద్గీత ఎవరిదీ..? ఫ్లైట్‌లో ఎందుకుంది..? అని ప్రశ్నలు మొదలయ్యాయి.సాగర్ అమీన్ అనే వలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. ఈలోపు.. ఆ గ్రంథం ఎవరనేదానిపై రకరకాల కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత జయశ్రీ పటేల్(27)కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ కథన సారాంశం. అందులోని వివరాల ప్రకారం..గుజరాత్ ఆరావళి జిల్లా కంభిసర్‌కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం, భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలో ఆమెకు వివాహం అయ్యింది. భర్త లండన్‌లో ఉద్యోగం. దీంతో ఆమె అక్కడికి బయల్దేరింది. అలా వివాహం అయిన మొదటిసారి.. ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్‌హోస్టెస్‌దంటూ మరో కథనం వైరల్ అవుతోంది. Bhagavad Gita was found from the debris of the plane crash. The surprising thing is that the book did not burn even in the midst of such a fierce fire. Jai Shree Krishna 🙏🌸Om Shanti#Ahmedabad | #Planecrash | #AirIndia | #BlackBox #planecrashahmedabad #bhagavadgita pic.twitter.com/ypdrm2JP2i— DivineDiva ❤️ (@potus021) June 13, 2025 -
‘మై లవ్..’గర్ల్‌ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో
Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా రోదిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావద్దేశాన్ని దిగ్భ్రాతిలో ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన వారు రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు, ‘మై లవ్ అంటూ సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ జర్నలిస్ట్ వీడియోను షేర్ చేశారు. జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు. At hospital waiting room, we found this young man. The body was yet to be handed over. He quietly sat there and wept on his own. He lost his girlfriend. No one by his side but a whole bundle of memories that he has to live with for the rest of his life. “Who are you waiting… pic.twitter.com/pdxsZhBPPN— Tamal Saha (@Tamal0401) June 13, 2025 -
ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది: విమానయాన మంత్రిత్వ శాఖ
-
ఉన్నత చదువులకు ఫస్ట్ ఫ్లైట్ అదే లాస్ట్..: ఆటో డ్రైవర్ కుమార్తె విషాదాంతం
Air India Plane Crash : అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో విసాదం. ఉన్నత చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకోవాలని కోటి ఆశలతో తొలిసారి విమానం ఎక్కిన ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందిగుజరాత్లోని హిమత్‌నగర్‌కు చెందిన పాయల్ ఖాతిక్ (Payal Khatik) తొలిసారి విమానం ఎక్కింది. భవిష్యత్ కలలతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా బయలుదేరింది. కానీ అదే అదే చివరికి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఆమె తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతాడు. MTech చదవడానికి లండన్ వెళ్లేందుకు గురువారం ఉదయం ఉత్సాహంగా బయలుదేరింది. నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో విమానం ఎక్కిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని బాగా చూసుకోవాలని, పేదరికం నుండి విముక్తి చేయాలని ఎన్నో కలలు కంది. కానీ ఆ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.ఉదయపూర్‌లో బిటెక్ పూర్తి చేసిన ఆమె ఇంజనీరింగ్ , టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి యునైటెడ్ కింగ్డమ్కు పయనమైంది.ఉదయం తమ ప్రియమైన కుమార్తెకు హృదయపూర్వక వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది, ఆమె లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఆమె చదువులో రాణిస్తుందని కొండంత నమ్మకం వాళ్లకి. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విమానంతో పాటు, వీరి ఆశలు కూడా గల్లంతైపోయాయి."ఆమె కళాశాల పూర్తి చేసిన తర్వాత, మాతోనే ఉంది ...లండన్‌లో పై చదువులు చదువు కోవాలనుకుంది. ఇందుకోసం మేం రుణం తీసుకుసి పంపాం.." అంటూ ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ దుఃఖంతో చెప్పారు.#WATCH | Sabarkantha, Gujarat | Relative of a deceased passenger of AI-171 plane crash, Suresh Khatik says, "...After completing her college, she used to stay with us. Then she wanted to study in London. We took out loans to support her education there...My DNA sample has been… pic.twitter.com/G35tZaWJha— ANI (@ANI) June 13, 2025పాయిల్ చాలా మంచి అమ్మాయి అని ఆమె స్నేహితులు తెలిపారు. బీటెక్ పూర్తైన తరువాత ట్యూషన్లు చెప్పి, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండేదని బంధువు పాయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం పాయల్ ఖాతిక్‌ను చివరిసారిగా కలిశానని, గత ఆరేళ్లుగా తన కుమారుడికి ట్యూషన్ చెబుతోందనీ, పాఠక్ దంపతులు తెలిపారు. -
11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విమానయాన రంగంలో అనుభవం లేదు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి అని అన్నారు.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. రామ్మోహన్ నాయుడుకు విమానాయన రంగంలో అనుభవం లేదు. ఒక గంట కూడా విమానయాన రంగం గురించి ఆయన చదవలేదు. రామ్మోహన్ నాయుడుతో వ్యక్తిగత గొడవలు లేవు. ఆయనకు ఇంకా కేబినెట్ పదవి రావాలని కోరుకుంటాను. కానీ, భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి. ప్రధాన మంత్రిపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాక ముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి.ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. ప్రధాని బాధ్యతను అమిత్ షా కు అప్పగించాలి. విమాన ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా సీఈఓ, విదేశాంగ మంత్రి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత ప్రతిష్ట కాపాడటం కోసం తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి. జీ-7 సమ్మిట్‌లో విమాన ప్రమాదం ఏవిధంగా జరిగిందనేది చర్చ జరగనుంది. ముందస్తుగా ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాని, విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. అదానీ అభివృద్ధికి తీసుకోవడం, ఎయిర్ పోర్టు పక్కన భవనాలు ఉండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని కామెంట్స్ చేశారు. -
Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్‌ని అదే కాపాడిందా?
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విస్వాస్ కుమార్ రమేష్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మిగిలిన 241 మంది మృతిచెందారు. దీంతో విస్వాస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడని అంటున్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ ‘11ఏ’ సీటులో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతిచెందగా, 40 ఏళ్ల వ్యాపారవేత్త విస్వాస్ కుమార్ రమేష్ శిథిలాల మధ్య నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. రక్తంతో తడిసిన షర్టుతో కనిపించాడు. తాను ఈ ప్రమాదం నుంచి దాని నుండి ఎలా సజీవంగా బయటపడ్డానో తనకే తెలియడం లేదని ఆయన ‘దూరదర్శన్’కు చెప్పాడు.రమేష్ ప్రాణాలతో బయటపడిన దరిమిలా అతను కూర్చున్న ‘11ఏ’ సీటు సురక్షితమైనదంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రమేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడంటూ చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విమానయాన నిపుణుడు అంగద్ సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. వివిధ విమాన ప్రమాదాల గణాంకాల ప్రకారం, విమానంలో కొన్ని సురక్షితమైన సీట్లు ఉంటాయి. మధ్యలో ఉన్న సీట్ల కంటే చివర లేదా కుడి ముందు భాగంలో ఉన్న సీట్లు సురక్షితమైనవని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందుకు భిన్నంగా జరిగిందన్నారు. సీటు 11ఏ విమానం మధ్యలో, రెక్క ముందు ఉందన్నారు. ఈ ఘటన అద్భుతమని, ఇంకా చెప్పేందుకు మరో పదం లేదన్నారు.విమానాలకు సంబంధించి ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుందని, సీటు స్థానం ఆధారంగా సురక్షితమనేది తేల్చిచెప్పడం అసాధ్యమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ పేర్కొన్నారు. కాగా మీడియా నివేదికల ప్రకారం 2007 పాపులర్ మెకానిక్స్ అధ్యయనం ప్రకారం విమానం వెనుక వైపు ఉన్న సీట్లు సురక్షితమైనవని తేలింది. కొంతమంది నిపుణులు రెక్కల దగ్గరుస్న సీట్లు సురక్షితమైనవని చెబుతుంటారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.ఇది కూడా చదవండి: Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట.. -
Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట..
అహ్మదాబాద్: జూన్ 12 మధ్యాహ్నం రెండు గంటలు.. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం వైపు దూసుకువస్తోంది.. ఈ అకస్మాత్తు పరిణామాన్ని గ్రహించని ఇద్దరు వైద్య విద్యార్థులు మెస్‌లో అప్పుడే భోజనం ముగించారు. తన స్నేహితునికి మొబైల్ ఫోన్ ఇచ్చిన 20 ఏళ్ల ఆర్యన్.. చేతులు కడుక్కుంటూ ‘నువ్వెళ్లు.. నేను నీతో జాయిన్ అవుతాను’ అని అన్నాడు. ఆ స్నేహితుడు బయటకు వెళ్లిపోయాడు.ఆర్యన్ చేతులు కడుక్కనే పనిలో ఉన్నాడు. ఆ క్షణంలో విమానం భవనాన్ని ఢీకొని కుప్పకూలింది. వెంటనే ఆ ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 10 నిమిషాలకు తేరుకున్న ఆ స్నేహితుడు తన చేతిలోని ఆర్యన్ ఫోన్‌తో గ్వాలియర్‌లోని అతని బంధువులకు ఫోన్ చేశాడు. ‘మీరు త్వరగా రండి, ఆర్యన్ తీవ్రగాయాలతో ఐసీయూలో ఉన్నాడు’ అని చెప్పాడు. ఆర్యన్ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్‌కు వెంటనే బయలుదేరారు. వారు వచ్చే సమయానికే ఆర్యన్ మృతిచెందాడు.జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (ఫైమా) సభ్యుడు డాక్టర్ ధవల్ ఘమేటి మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్యన్ రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. విమానం కూలిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలొదిలాడు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు’అని తెలిపారు. ఆర్యన్ ఎంతో తెలివైన విద్యార్థి. నీట్ కోచింగ్ తీసుకోకుండానే ఈ పరీక్షలో 720 కి 700 స్కోర్ చేశాడు. అదికూడా మొదటి ప్రయత్నింలోనే ఈ ఘనత సాధించాడు. ఇంటర్నెట్లో దొరికిన స్టడీ మెటీరియల్ సాయంతో నీట్ క్రాక్ చేశాడు. ఆర్యన్ తండ్రి రామ్హెట్ రాజ్‌పుత్ మాట్లాడుతూ తన చిన్న కొడుకును డాక్టర్‌గా చూడాలనే తన కల భగ్నమయ్యిందన్నారు. తన పెద్ద కుమారుడు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నాడని తెలిపారు.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు. -
కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!
Air India plane crash అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్‌లో తమ ప్రియమైన స్నేహితురాలు రంజిత గోపకుమార్ చనిపోయిందనే వార్త తెలిసి పుల్లాడ్ (కేరళ)లోని శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు షాక్ అయ్యారు.‘ఇది నిజమేనా!’ అని ఒకరికి ఒకరు ఫోన్ చేసుకున్నారు.పాత ఫోటోలలో రంజితను చూస్తూ భోరున విలపించారు.రంజిత నర్స్‌గా పనిచేసేది.‘రంజిత ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉండేది. అందరినీ నవ్వించేది. ఎన్నో కబుర్లు చెప్పేది. రంజిత నాకు మంచి స్నేహితురాలు. ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి’ అంటోంది జీజా దేవి. ఆమె రంజితకు పదవతరగతిలో క్లాస్మేట్.తురుతికాడ్లో ఇద్దరూ బీఎస్సీ కలిసి చదువుకున్నారు.డిగ్రీ సెకండ్ ఇయర్లో బీఎస్సీ నర్సింగ్‌లో చేరింది రంజిత.‘రంజితది ఒకరి మీద ఆధారపడే స్వభావం కాదు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఓపెన్‌గా ఉండేది. ఆమె చనిపోయిందనే వార్త ఒక పట్టాన నమ్మలేకపోయాను’ అంటోంది దేవి. రంజితకు ‘సొంత ఇల్లు’ కల ఉండేది.‘ఇల్లు కట్టుకోవాలనేది రంజిత కల. అందుకోసమే యూకేలో ఉద్యోగం చేయాలనుకుంది. కొత్త ఇంటి నిర్మాణం పుల్లాడ్లో జరుగుతోంది. తన కలల ఇంట్లోకి అడుగుపెట్టక ముందే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది’ అని బాధపడ్డారు రంజిత పొరుగింటి వ్యక్తి అనిల్ కుమార్.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్‌కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్‌కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్‌కు డీవీఆర్‌ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్‌కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్‌ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడుముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.1978, నూతన సంవత్సరం తొలిరోజున..గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్‌లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్‌కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్‌లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. -
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అయితే, తాజాగా సినీ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఎయిరిండియా విమానంలో తాను ప్రయాణించానని ఆమె చెప్పింది. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతోనే కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. దీంతో ఆమె అసలు విషయాన్ని చెబుతూ ఒక వీడియోతో పాటు ఎక్స్ పేజీలో పోస్ట్ చేసింది.'విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిరిండియా ఫ్లైట్‌లో నేను ప్రయాణించిన మాట వాస్తవమే.. కానీ, నేను ముంబై నుంచి లండన్ వెళ్లాను. అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను లండన్ చేరిన వెంటనే ఈ వార్త తెలుసుకున్నాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోయింది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్‌కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది. మన ప్రాణాలు ఒక క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదహారణ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థం అవుతుంది. బాధిత కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి.' అని మంచు లక్ష్మి తెలిపింది.Devastated by the tragic flight crash in Ahmedabad. So many innocent lives gone, it’s truly painful. My heart breaks as I hear about even more resident doctors who have lost their lives in this tragedy…Can’t believe I just flew to London today on Air India God is Great. This…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 12, 2025 -
Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్‌కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.దీనికి ఎవరు బాధ్యులు?తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు.. -
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్‌డీఆర్‌లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్‌గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
మెడికల్ కాలేజీ మృతులెందరు?
అహ్మదాబాద్: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్‌వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ మెస్, హాస్టల్‌పై పడి పేలిపోవడం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది. అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్‌డీఆర్‌లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్‌పిట్‌లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్‌లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్‌తో బ్లాక్‌బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్‌ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్‌బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్‌పిట్, కేబిన్‌లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్‌ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
ఒకరు మానేద్దామనుకున్నారు.. ఇంకొకరు ఇప్పుడే మొదలెట్టారు!
ముంబై: ప్రమాదానికి గురైన బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ పైలట్ సుమీత్ సభర్వాల్(56), కో పైలట్ క్లైవ్ కుందర్లది విభిన్నమైన నేపథ్యం. ఒకరు ఎంతో అనుభవశాలి కాగా, మరొకరు ఇప్పుడిప్పుడే కెరీర్‌ను మొదలుపెట్టారు. సభర్వాల్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉండగా, క్లైవ్ కుందర్ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఫ్లయింగ్ అనుభవం వీరిద్దరిదీ కలిపి 9,300 గంటలు కాగా, ఇందులో సభర్వాల్ ఒక్కరికే 8,200 గంటల అనుభవముంది. పైలట్ సుమీత్ సభర్వాల్(56) ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన జల్ వాయు విహార్‌లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన సుమీత్కు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారని పేరుంది. ‘వింగ్ కమాండర్‌గా రిటైరయ్యాను. ఎయిరిడింయా సిబ్బందితో కలిసి సుదీర్ఘ కాలం పనిచేశాను. కెప్టెన్ సుమీత్ ఎంతో మంచివారు. అనుభవశాలి అయిన పైలట్. ఆయన మరణం ఎయిరిండియాకు తీరని లోటు’అని సుమీత్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంజీవ్ పాయ్ చెప్పారు. ‘సుమీత్ పనితీరుపై గానీ, ప్రజలతో వ్యవహరించే తీరుపైగానీ ఎన్నడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఆయన ఎంతో సౌమ్యుడు. శాంతిస్వభావి’అని పాయ్ అన్నారు. ‘సుమీత్ తండ్రి డీజీసీఎ అధికారిగా పనిచేసి, రిటైరయ్యారు. ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు సైతం పైలట్లుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సుమీత్ పైలట్ అయ్యారు. అయితే, 82 ఏళ్ల వృద్ధుడైన తండ్రి బాగోగులను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం సుమీత్ నాతో అన్నారు’అని పాయ్ వివరించారు.కో–పైలట్ క్లైవ్ కుందర్‌కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవముంది. క్లైవ్ తల్లి ఫ్లయిట్ క్రూ సభ్యురాలు. ముంబై జుహులోని బాంబే ఫ్లయింగ్ క్లబ్లో క్లైవ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సు పూర్తి చేశారు. ఏరోనాటికల్ ఇంజినీర్‌గా ఏడాదికి పైగా పనిచేశారు. కలినాలోని ఎయిరిండియా కాలనీలో క్లైవ్ పెరిగాడు. అనంతరం వీరి కుటుంబం బొరివలికి మకాం మార్చింది. కుందర్ పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఎయిరిండియాలో చేరారని పొరుగునుండే ఫ్లాయిడ్ డిసౌజా చెప్పారు. ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తుండే క్లైవ్ కుందర్‌కు, ఆయన తండ్రి క్లిఫ్పర్డ్కు ఆటలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. క్లైవ్ ఖాళీ దొరికితే చాలు క్రికెట్ ఆడేవారని చెప్పారు. విషాదం తెల్సిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న క్లైవ్ సోదరి క్లైన్, తల్లి రేఖ ఇండియాకు బయలుదేరారని ఫ్లాయిడ్ అన్నారు. క్లైవ్ కుందర్ మృతిపై నటుడు విక్రాంత్ మస్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. -
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నారు. విమానం కూలిపోవడంతో ధ్వంసమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘావీ ఉన్నారు. ప్రమాదం గురించి వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్, మెస్ ధ్వంసమైన తీరును వివరించారు. అనంతరం మోదీ సిటీ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. విమాన ప్రమాదంలో గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ రమేశ్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న సీ7 వార్డును మోదీ సందర్శించారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విజయ్ రూపానీ కుటుంబానికి ఓదార్పు విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని గుజ్‌సెయిల్ కార్యాలయంలో విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో గుండె నిబ్బరం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారులతో సమీక్ష ప్రధాని మోదీ గుజ్‌సెయిల్ ఆఫీసులో గుజరాత్ ప్రభుత్వ అధికారులతో, పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విమాన ప్రమా దం, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. -
లండన్‌కు చేరాక ఫోన్ చేస్తా..
ముంబై: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల హృదయవిదారక విషాద గాథలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ క్యాబిన్ క్రూలో పనిచేసే మైథిలీ పాటిల్(23) తన తండ్రి మోరేశ్వర్ పాటిల్‌కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్ చేశారు. లండన్ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ ఆయన్ను అనునయించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఘోరం జరిగిపోయింది. ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. డ్రీమ్‌లైనర్‌లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. అంతేకాదు, వీరిలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది క్రూ సిబ్బంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. నవా గ్రామానికి చెందిన మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈమె తండ్రి మోరేశ్వర్పాటిల్ ఓఎన్జీసీ లేబర్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. లండన్ చేరుకున్న వెంటనే ఫోన్ చేస్తానంటూ మైథిలి దుర్ఘటనకు కొద్దిసేపటి ముందే తండ్రికి ఫోన్ చేసి చెప్పారని ఆమె బంధువు, నవా గ్రామ మాజీ సర్పంచి జితేంద్ర మాత్రే చెప్పారు. క్యాబిన్ క్రూ మరో సభ్యుడు దీపక్ పాఠక్ థానె పక్కనే ఉన్న బద్లాపూర్ నివాసి. ఎయిరిండియాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న పాఠక్ లండన్ వెళ్లేముందుకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని ఆయన సోదరి చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రూ సభ్యుడు అపర్ణా మహదిక్(43)కి కూడా ముంబై సమీప గోరెగావ్ ప్రాంతమే. ఈమె భర్త కూడా ఎయిరిండియా క్రూ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అపర్ణకు ఎన్సీపీ నేత సునీల్ తత్కారేకు బంధువు. విమానం క్రూ సభ్యుల్లో ఒకరైన ఇర్ఫాన్ సమీర్ షేక్(22) రెండేళ్ల క్రితమే ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈయన ఎన్నో కలలు కన్నారని కుటుంబసభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. షేక్ కుటుంబం పుణె నగరం పింప్రి చించ్వాడీలో ఉంటోంది. క్రూలో మరో సభ్యురాలు శ్రద్ధా ధావన్‌ది ములుండ్‌లోని వైశాలి నగర్. ధావన్ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డీఎన్ఏ నమూనాలు ఇచ్చేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లారు. విమాన క్యాబిన్ క్రూ సభ్యుల్లో రోష్ని రాజేంద్ర సొంఘారె డొంబివిలి ప్రాంతంలో ఉంటుండగా, సాయినీత చక్రవర్తి జుహు కొలివాడకు చెందిన వారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిన సొంఘారేకు ఇన్‌స్టాలో 54 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమీత్ పుష్కరాజ్ సభర్వాల్(56) ముంబైలోని పొవైలో జల్ వాయు విహార్‌లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. విమానం కో–పైలట్ క్లైవ్ కుందర్ది కూడా ముంబైనే. శాంటాక్రుజ్ ప్రాంతంలోని కలినాలో జెరోమ్ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. భర్తతో కలిసి గడపాలని.. గుజరాత్‌లోని మెహ్సనాకు చెందిన అంకితా పటేల్‌ది మరో విషాదం. ఈమెకు గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త వసంత్ లండన్‌లో ప్రొవిజన్ స్టోర్ యజమాని. ఈ నూతన దంపతులు కలిసి గడిపింది కేవలం 12 రోజులు మాత్రమే. వసంత్ లండన్ వెళ్లిపోవడంతో, తనూ అక్కడికి వెళ్లి భర్తతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితోపాటు వసంత్ సోదరితో కలిసి వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అంకితను లండన్ పంపించేందుకు వీరంతా గురువారం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు గుడ్ బై చెప్పి మెహ్సనాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయిందని వసంత్ సోదరి ఆశాబెన్ పటేల్ చెప్పారు. వెంటనే తిరిగి వచ్చామన్నారు. గాట్విక్ విమానాశ్రయంలో భార్యకు ఘనస్వాగతం పలకాల్సిన వసంత్..బదులుగా ఆమె అవశేషాలను తీసుకునేందుకు వస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు అంకిత సోదరుడి డీఎన్ఏ నమూనాలు తీసుకున్నట్లు వివరించారు. ప్రయాణాలంటే ఎంతో సరదా.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన నీరజ్ లవానియా(50), అపర్ణ దంపతులకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో లండన్ వెళ్లాలనుకున్నారు. వీరితోపాటు 18 ఏళ్ల కుమార్తె కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, ఒంటరిగా ఉండే 70 ఏళ్ల నీరజ్ తల్లిని చూసుకునేందుకని ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానమెక్కిన లవానియా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటున్న వీరి కూతురు తల్లిదండ్రుల అవశేషాలను గుర్తుపట్టేందుకు అహ్మదాబాద్ వెళ్లి అధికారులకు డీఎన్ఏ నమూనా ఇచ్చారు. ఆగ్రాలోని అకోలాకు చెందిన నీరజ్ 1995లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసమని వడోదరకు మకాం మార్చారు. చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉండే నీరజ్ మరణ వార్త విని అకోలా వాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందే 1.30 గంటల సమయంలో తనతో నీరజ్ మాట్లాడాడని సోదరుడు సతీశ్ చెప్పారు. టీవీలో వచ్చిన వార్తను చూసి షాక్‌కు గురయ్యానన్నారు.కుమారుడి వద్ద గడిపేందుకని..డ్రీమ్‌లైనర్ ప్రమాద మృతుల్లో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వాసి మహదేవ్ పవార్(68), ఆశా(60) దంపతులు కూడా ఉన్నారు. సంగోలా తెహశీల్లోని హటిడ్ గ్రామానికి చెందిన మహదేవ్ గుజరాత్‌లోని నడియాడ్‌లోని టెక్స్టైల్ మిల్లులో పని చేసేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు అహ్మదాబాద్‌లో, మరొకరు లండన్‌లో ఉంటున్నారు. లండన్‌లో నివసిస్తున్న కుమారుడి వద్దకని బయలుదేరిన ఈ దంపతులు విమాన ప్రమాదం బారినపడ్డారు. వీరు అహ్మదాబాద్‌లో 15 ఏళ్లుగా నివసిస్తున్నారని సోలాపూర్ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దంపతులు ఇటీవలే హటిడ్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చి వెళ్లారని చెప్పారు.భర్త బర్త్‌డే కోసం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన హర్‌ప్రీత్ కౌర్ హొరొ(28) ఐటీ నిపుణురాలిగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈమె భర్త రొబ్బీ హొరా లండన్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఈనెల 16న రొబ్బీ పుట్టినరోజు. వాస్తవానికి హర్‌ప్రీత్ ఈ నెల 19న లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, భర్త పుట్టిన రోజు వేడుక కోసమని ముందుగానే ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. లండన్ వెళ్లాక దంపతులు యూరప్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారని బంధువులు చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని, వీరి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయని బంధువులు చెప్పారు.టీస్టాల్ యజమాని 14 ఏళ్ల కుమారుడు.. డ్రీమ్‌లైనర్ ప్రమాదం అహ్మదాబాద్ మెఘానీనగర్ ప్రాంతం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌కు సమీపంలోని చెట్టు కింద టీకొట్టు నడుపుకునే కుటుంబంలో తీరని విషాదం నింపింది. విమానం కూలిన సమయంలో సీతా బెన్ టీ తయారు చేస్తుండగా ఆమె కుమారుడు 14 ఏళ్ల ఆకాశ్ పట్ని పక్కనే నిద్రిస్తున్నాడు. కూలిన విమాన లోహ శకలం ఒకటి వచ్చి ఆకాశ్ తలను తాకింది. ఆ వెంటనే చెలరేగిన మంటల్లో ఆకాశ్ మాడి మసయ్యాడు ఆకాశ్. కుమారుడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో తల్లి సీతా బెన్ తీవ్రంగా గాయపడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతోంది.అంతా బాగుందని చెప్పి అంతలోనే.. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉండే సురేశ్ మిస్త్రీ అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈయన కుమార్తె 21 ఏళ్ల క్రినా మిస్త్రీ విమాన ప్రమాదంలో చనిపోయింది. వర్క్ వీసా రావడంతో ఏడాది క్రితం లండన్ వెళ్లిన క్రినా ఇటీవలే ఆనంద్‌కు తిరిగి వచ్చింది. వైద్య చికిత్స అనంతరం డ్రీమ్‌లైనర్‌లో లండన్ తిరిగి పయనమయ్యింది. విమానం ఎక్కాక కూడా తండ్రికి ఫోన్ చేసి నిశ్చింతగా ఇంటికి వెళ్లండంటూ ధైర్యం చెప్పింది. ఇంటికి వెళ్లాక దుర్వార్త తెలిసిందని, క్రినా ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు సురేశ్ గద్గద స్వరంతో చెప్పారు.తిరిగొచ్చాక భారీగా వేడుక చేద్దామని..గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విషాదంలో అసువులు బాసిన వారిలో భవిక్ మహేశ్వరి(26) అనే నవ వరుడు కూడా ఉన్నారు. లండన్‌లో పనిచేసే భవిక్ 15 రోజులక్రితమే వడోదరకు వచ్చారు. పెళ్లి చేసుకున్నాకే తిరిగి లండన్ వెళ్లాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్ 10న ఓ యువతితో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవ వధువును లండన్ పంపేందుకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరోసారి వివాహ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. నూతన వధువు సహా కుటుంబసభ్యులంతా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో భవిక్‌కు వీడ్కోలు పలికారు. వారి తిరిగి ఇళ్లకు చేరుకున్నారో లేదో ఘోరం జరిగిపోయింది. ఈ విషాదాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బంధువొకరు తెలిపారు.ఏకైక కెనడియన్ నిరాలీ పటేల్..అహ్మదాబాద్ విషాద బాధితుల్లో కెనడా పౌరురాలు ఒకరుండటం తెల్సిందే. ఈమె భారత సంతతికి చెందిన నిరాలీ పటేల్(32). టొరంటోని ఎటోబికోక్‌లో ఉండే నిరాలీ సోషల్ ట్రిప్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. నిరాలీ మరణవార్త తెల్సిన భర్త, ఏడాది వయస్సున్న కుమార్తెతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈమె తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం బ్రాంప్టన్‌లో నివస్తున్నారు. భారత్‌లో 2016లో దంత వైద్యంలో డ్రిగీ పొందిన నిరాలీ 2019లో కెనడా వెళ్లారు. మిస్సిస్సౌగాలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నిరాలీ మృతి పట్ల కెనడా ప్రధాని మార్క్ కార్నీ, విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలకు బయల్దేరి అనంతలోకాలకు అహ్మదాబాద్/నాగ్‌పూర్: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు అంత్యక్రియల కోసం వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు విమాన ప్రమాదంలో మరణించారు. నాగపూర్‌కు చెందిన 32 ఏళ్ల యశా కామ్దార్కు నాలుగేళ్ల కిందట అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి ఆమె అహ్మదాబాద్‌లోనే నివసిస్తున్నారు. మామ కిషోర్ మోదా చాలాకాలంగా లండన్‌లో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఒకటిన్నరేళ్ల కొడుకు, 58 ఏళ్ల అత్త రక్షతో కలిసి ఆమె లండన్ బయల్దేరి ముగ్గురూ ప్రమాదానికి బలయ్యారు. దాంతో యశా కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగపూర్‌లోని ఆమె తల్లిదండ్రులు అహ్మదాబాద్ బయలుదేరారు.లండన్ నుంచి పూర్తిగా వచ్చేయాలనుకుని.. కోచి: విమాన ప్రమాదంతో మరణించిన 39 ఏళ్ల కేరళ నర్సు రంజితది మరో విషాద గాధ. కేరళ ప్రభుత్వ నర్సుగా చేసిన ఆమె సెలవు పెట్టి కొంతకాలం ఒమన్‌లో పని చేశాక బ్రిటన్ వెళ్లింది. లండన్‌లో నర్సుగా చేస్తోంది. కేరళలో కొత్తిల్లు కట్టుకుని కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంది. లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి శాశ్వతంగా భారత్‌కు వచ్చేయాలనుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిని రంజిత తల్లి చూసుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే కేరళ వచ్చింది. అక్కడ మళ్లీ తన ప్రభుత్వోద్యోగంలో చేరడానికి లాంఛనాలు పూర్తి చేసింది. లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్టిఫికెట్లు, సామగ్రి తెచ్చుకోవడానికి గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లింది. లండన్‌కు ఎయిరిండియా విమానమెక్కి తిరిగిరాని లోకాలకు చేరింది. దాంతో పిల్లలు, తల్లి దిక్కులేనివారయ్యారు. కాగా, రంజితను కులపరంగా, లైంగికంగా వేధిస్తూ ఆన్లైన్లో అసభ్య పోస్టులు పెట్టిన కాసరగోడ్ జిల్లా వెల్లరికుందు డిప్యూటీ తహశీల్దార్ పవిత్రన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్‌లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్‌గా మారింది. బ్లాక్‌బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్‌లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్‌లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్‌కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్‌లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్‌ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్‌వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్‌కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్‌లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్‌కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్‌ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్‌కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్‌కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!
వడోదరా: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్‌లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వడోదరాకు చెందిన భావిక్ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్ నుంచి భారత్‌కు వచ్చిన భావిక్.. జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్‌లో పని చేస్తున్న భావిక్,.. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది. తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్ వెళ్లాక ఫోన్ చేస్తానన్నాడు. టేకాఫ్ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్‌లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు. -
Plane Crash: ఉద్యోగులకు టాటా గ్రూప్ చైర్మన్ లేఖ
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ అనేది టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్.. తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన. ‘నిన్న(గురువారం, జూన్ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. #AirIndiaFlightCrash | Tata Group Head Natarajan Chandrasekaran writes to his colleagues, "What occurred yesterday was inexplicable, and we are in shock and mourning. To lose a single person we know is a tragedy, but for so many deaths to occur at once is incomprehensible. This… pic.twitter.com/XboB94W6DG— ANI (@ANI) June 13, 2025 కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు. -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్‌లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్‌కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్‌లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్‌లైన్స్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
బోయింగ్ డ్రీమ్‌లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్‌బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్‌లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్‌ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్‌పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్‌ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్‌లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్‌పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్‌కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్‌కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్‌లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్‌కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్‌గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్‌తో నా కూతురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్‌కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు. -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్‌లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్‌బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్‌లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్‌లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్‌బాక్స్‌తో ఏం చేస్తారో తెలుసా? -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్‌ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్‌లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్‌లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్‌బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
పైలట్ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్ సుమీత్కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్‌కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్ తన తండ్రికి ఫోన్ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.కాగా, అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 787–8 డ్రీమ్‌లైనర్ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్ క్లైవ్‌కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది. -
నేను ఎలా బతికానంటే..! మృత్యుంజయుడి మాటల్లో
-
విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
సివిల్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు ప్రధాని మోదీ పరామర్శ
-
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు
-
విమాన ప్రమాద ఘటనపై YSRCP క్యాండిల్ ర్యాలీ..
-
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం.. కన్నీటి చిత్రాలు
-
విమాన ప్రమాద ఘటనా స్థలంలో ప్రధాని మోదీ
-
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్‌ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్‌ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు."కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్‌కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్‌ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు. -
ప్రయాణికుల పాలిట పీడకలగా డ్రీమ్ లైనర్
-
ప్రమాదానికి కారణం పైలటా? ఎయిర్ ఇండియా లోపమా?
-
ప్రమాదం జరిగే ముందే సంకేతం.. కీలకంగా మారిన బ్లాక్ బాక్స్
-
విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్‌పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్‌లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం... మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 265 మంది దుర్మరణం... మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
-
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
-
అర నిమిషంలో కూలిపోయింది
-
పక్షి ఢీకొట్టిందా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787–7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్‌తో సహా ఏడుగురు చనిపోయారు. రన్‌వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్‌వేపై 700సార్లు! పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్‌వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షిల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని పక్షులూ ముప్పుకాదు 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్‌విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్‌లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్‌వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులే కారణం. -
మట్టి నిండిన భోజనం!
అహ్మదాబాద్: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్ టేబుల్స్‌పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్ టేబుల్స్.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్ భవనంలో రెసిడెంట్ వైద్యులు నివాసం ఉంటారు. నేరుగా భవనంపైనే కూలిన విమానం.. సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. విమాన ఫ్యూజ్‌లేజ్‌లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. -
Air India flight crash: ఆశలు బుగ్గిపాలు
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఆరేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమీ వ్యాస్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్‌కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్ భారత్‌కు వచ్చి కుటుంబంతో సహా లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులనీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. లండన్‌కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం.. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఆకాశంలో విషాదం!
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్–787–8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్‌లో పనిచేసిన ఒక ఇంజనీర్ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం విజువల్స్
-
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్‌కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్‌పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్‌లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్‌లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్‌పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్‌తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్‌గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
ఆయనొక యోగా ఔత్సాహికుడు.. భారత్‌లో యోగా ప్రోగ్రామ్‌లు నిమిత్తం అహ్మదాబాద్‌కు వచ్చారు. కొన్ని రోజుల పాటు అహ్మదాబాద్‌లోని ద హౌస్ ఆఫ్ ఎంజీలో బస చేశారు. ఇక ఇక్కడ ప్రోగ్రామ్‌లు పూర్తి కావడంతో భారత్ గురించి, అహ్మదాబాద్‌లోని తాను బస చేసిన హోటల్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా బ్రిటన్‌లో ఉన్న భార్యకు షేర్ చేశాడు. అహ్మదాబాద్‌లోని ద హౌస్ ఆఫ్ ఎంజీపై ప్రశంసలు కురిపించారు. నిజంగానే ఒక హెరిటేజ్ హోటల్ అని, భారత్‌లోని తన అనుభవాలు అద్భుతమని ఇలా ఒక్కో స్టోరీని పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి(బుధవారం, జూన్ 11) ఇదే ఇక్కడ చివరి రాత్రి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇప్పుడు అదే వైరల్‌గా మారింది. దాంతో పాటు విమానం ఎక్కేముందు ‘గుడ్ బై ఇండియా’ అని బ్రిటన్‌కు చెందిన జమీ మీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాసేపటికి ఆయన విమానం ప్రమాదంలో మృతి చెందడం జరిగిపోయాయి. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! కాగా, గురువారం(జూన్ 12) అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా టేకాఫ్ తీసుకున్న తర్వాత జనవాసాలపై కూలిపోయింది. బీజే మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్‌పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు. అయితే విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్రరు బ్రతికిబయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్‌ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్‌లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్‌ప్రెస్‌తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
ఢిల్లీ,సాక్షి: ఎయిరిండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. అదనంగా, ఎయిరిండియా విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్‌ను పుననిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/jBPxfmo4at— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025 -
మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్: రమేశ్ విశ్వాస్ కుమార్ బుచార్వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్ బ్రిటీష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్‌కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జి.ఎస్.మాలిక్ తెలిపారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)ప్రయాణం వాయిదాతో బతికాడుఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్ బుక్ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025 -
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్‌లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం ప్రయాణికులు దుర్మరణం చెందినట్ల తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు.విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..ఈ ప్రమాదం కూలిన వెంటనే దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి.. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడారు. ‘ నేను విమానం కూలినప్పుడు నేను ఇంటిలోనే ఉన్నా. ఒక్కసారిగా బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందని బయటకి వచ్చి చూశాను. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించి ఉంది. అక్కడకు వెళ్లి చూశాను. విమానం కూలిపోయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అక్కడంతా భయానకంగా కనిపించింది’ అని పేర్కొన్నారు. VIDEO | Ahmedabad plane crash: Here's what an eyewitness said:"I was at home when we heard a massive sound. When we went out to see what had happened, there was a layer of thick smoke in the air. When we came here, dead bodies and debris from the crashed aircraft were scattered… pic.twitter.com/Km0xCm9yde— Press Trust of India (@PTI_News) June 12, 2025 -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్‌లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్‌టాప్ రన్‌వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్‌ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్‌కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్‌ఈస్ట్‌లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్‌లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
విమాన ప్రమాదం పట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గురువారం మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానం(Air India AI-171 flight).. టేకాఫ్ అయిన కాసేపటికే సమీపంలోని కుప్పకూలి పేలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. వీటికి తోడు విమానం జనావాసాలపై కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. I am deeply shocked to know about the tragic crash of Air India AI-171 flight with 242 passengers near Ahmedabad airport. I extend my heartfelt condolences to the families of passengers, crew members and casualties at the crash site. I pray for strength and healing for everyone…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2025 -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇండోర్‌లో ఈవెంట్.. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్‌ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్‌ని క్యాన్సిల్ చేశారు.నా గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్‌ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్‌లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్‌లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025 -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్‌కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔— Allu Arjun (@alluarjun) June 12, 2025 Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.— Jr NTR (@tarak9999) June 12, 2025 Extremely shocked and in disbelief to hear the crash of Air India flight from Ahmedabad to London, with 232 passengers on board, just after take off. Prayers for the safety of the passengers and the crew. #GodBeWithThem #planecrash— KhushbuSundar (@khushsundar) June 12, 2025 Heartbreaking to hear about the tragic plane crash in Ahmedabad.My thoughts and prayers are with all those affected.Hoping for survivors and strength for the rescue teams.May the departed rest in peace, and may their families find the strength to endure this immense loss. 🙏— Randeep Hooda (@RandeepHooda) June 12, 2025 Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు,ఒకకెనడియన్, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది ప్రాణాలున్నారు అనేది సందేహమే.#WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్‌లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్)బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ 787, మరొకటి జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్‌లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్‌బ్లోయర్ సామ్ సలేహ్‌పూర్ డ్రీమ్‌లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్‌కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్‌పిట్‌లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్‌లైనర్‌ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట. -
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025