Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం.. | Air India Sole survivor struggles with unbearable trauma | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా ప్రమాద మృత్యుంజయడు: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..

Nov 4 2025 4:29 PM | Updated on Nov 4 2025 4:45 PM

Air India Sole survivor struggles with unbearable trauma

జూన్‌ 12న అహ్మదాబాద్‌లో టేకాప్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు.  ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్‌లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 

లక్కీమ్యాన్‌ కాదు..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్‌ వార్తల్లో నిలిచారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌ కుమార్‌.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్‌ కుమార్‌ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. 

అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్‌గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. 

తాను తిరిగి నార్మల్‌గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్‌రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. 

భార్య సాయం లేనిదే కనీసం..
తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్‌ లీసెస్టర్‌ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్‌ పటేల్‌, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్‌ సీగర్‌లు కూడా తమ వంతుగా రమేష్‌కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. 

అలాగే ఎయిర్‌ ఇండియా కూడా రమేష్‌కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియా సైతం రమేష్‌కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.

 

(చదవండి: భారత్‌పై జర్మన్‌ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement