మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్ మోటార్ సైకిల్ రైడర్ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్ మీడియలో షేర్ చేసుకున్నాడు.
జర్మన్‌కి చెందిన మోటార్ రైడర్ మార్క్ ట్రావెల్స్‌గా పేరుగాంచిన మార్కస్ ఎంగెల్ భారతదేశాన్ని బెస్ టూరిస్ట్ ప్లేస్‌గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేశారు.
ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి
, మార్కస్ ఎంగెల్ సాహసయాత్రలు, సుదూర మోటార్ సైకిల్ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్‌కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా.
అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్‌లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్ వేరేలెవెల్. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్‌గా మారాడు.
(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
