మనలో చాలా మందికి క్రిస్మస్ పండుగ వేడుక అనగానే క్రిస్మస్ చెట్టు లేదా శాంతా క్లాజ్ మాత్రమే కావచ్చు కానీ పలు దేశాల్లో ప్రజలకు మాత్రం ఇంకా చాలా చాలా గుర్తొస్తాయి. కొందరికి దెయ్యం దహనం గుర్తొస్తే మరికొందరికి వీధుల్లో భోగి తరహాలో వేసే మంటలు గుర్తోస్తాయి. ఈ అంతర్జాతీయ పండుగను ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారం ఇది..
ఐస్‌లాండ్‌లో క్రిస్మస్ జానపద కథలు సంప్రదాయాలతో నిండి ఉంటుంది. ఇక్కడి శాంతా క్లజ్ లాగానే అనిపించే దుష్ట సోదరుల సమూహం అయిన యూల్ లాడ్స్ చిన్నారులను అలరిస్తారు. మొత్తం 13 రోజుల పాటు ప్రతి చిన్నారికి రాత్రి వేళల్లో చిన్న చిన్న బహుమతులు అందిస్తారు అది కూడా కిటికీల దగ్గర ఉంచిన బూట్లలో వాటిని పెట్టి వెళ్లిపోతారు. వారి రాక పండుగ సీజన్ అంతటా ఉత్సాహాన్ని సృష్టిస్తుంది.
జపాన్‌లో క్రిస్మస్ ఉల్లాసంగా చాలా ఆధునికంగా ఉంటుంది. నగరాలన్నీ విద్యుత్ కాంతులతో మెరుస్తాయి క్రిస్మస్ ఈవ్‌ను ఒక రొమాంటిక్ అకేషన్‌గా భావిస్తారు. దాంతో జంటల సందడి కనిపిస్తుంది. అలాగేక్రిస్మస్ విందులో భాగంగా కెఎఫ్‌సిని ఆస్వాదించడం అనేది 1970లలో ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా కెఎఫ్‌సి బకెట్ల కోసం కుటుంబాలు ముందస్తుగా భారీ ఆర్డర్‌లు ఇస్తాయి. అలాగే క్రీమ్ స్ట్రాబెర్రీలతో అలంకరించిన క్లాసిక్ క్రిస్మస్ కేక్‌ను కూడా వీరు ఆస్వాదిస్తారు.
ఇండోనేషియా దేశం ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ, అక్కడి క్రై స్తవ సమాజాలు ఈ పండుగను గొప్పగా వైభవంతో జరుపుకుంటాయి. ఆ దేశంలోని ఉత్తర సుమత్రాలో, బటాక్ జాతీయులు ఈ పండుగ సందర్భంగా మార్బిండా అనే సంప్రదాయాన్ని పాటిస్తారు దీనిలో భాగంగా జంతు బలి కూడా ఉంటుంది. బంధుత్వాన్ని గౌరవించడానికి విందును పంచుకుంటారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రమైన బాలిలో, పెంజోర్ బాంబూ పోల్స్‌తో వీధుల్ని అలంకరిస్తారు. కుటుంబాలు ఇంట్లో తయారుచేసిన వంటకాలను బహుమతిగా పంచుకునే న్గేజోట్ అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.

గ్వాటెమాలాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా లా క్వెమా డెల్ డయాబ్లో పేరిట దెయ్యాన్ని దహనం చేయడం అనే విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. డిసెంబర్ 7న, కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దుష్టశక్తులను తరిమికొట్టడానికి అదృష్టాన్ని స్వాగతించడానికి పాత చెత్తతో పాటు దెయ్యం ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. వీధులు భోగి మంటల తరహాలో మంటలు, సంగీతం సమావేశాలతో వీధులన్నీ కళకళలాడతాయి. ఈ సీజన్ అర్ధరాత్రి వేడుకల్లో బాణసంచా కుటుంబ విందులతో కొనసాగుతుంది,
గ్రీస్ పండుగ పడవ సంప్రదాయం గ్రీస్‌లో కరవాకి అని పిలిచే రంగురంగుల చెక్క పడవలు గ్రీస్ సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే పండుగ చిహ్నాలుగా వెలిగిపోతాయి. క్రిస్మస్ సందర్భంగా, పిల్లలు ఇంటి నుంచి ఇంటికి వెళ్లి కలంద అనే సాంప్రదాయ కరోల్‌లను పాడుతూ, త్రిభుజాలు లేదా డ్రమ్స్ వాయిస్తారు. ఇళ్ళు మెలోమకరోనా (సాంప్రదాయ గ్రీకు క్రిస్మస్ కుక్కీలు) వంటి తేనె బిస్కెట్ల సువాసనతో నిండిపోతాయి, కుటుంబాలు క్రిస్టోప్సోమో (క్రీస్తు రొట్టె)ను ప్రతీకాత్మక విందు గా కాలుస్తాయి
(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?)


