ఆర్మీ లెఫ్టినెంట్‌గా ఆయమ్మ కొడుకు!..! | Hardeep Gill: A mid-day meal workers son who achieved his Army dream | Sakshi
Sakshi News home page

ఆర్మీ లెఫ్టినెంట్‌గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి

Dec 19 2025 11:12 AM | Updated on Dec 19 2025 11:30 AM

Hardeep Gill: A mid-day meal workers son who achieved his Army dream

కొన్ని సక్సెస్‌లు సంవత్సరాల తరబడి నిరీక్షణ, అంకితభావం, ఓపికతో సాకారం అవుతాయి. అలాంటి కథలు ఎప్పటికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.చిన్ననాటినుంచి కష్టాలు, తగినన్ని వనరుల కొరత ఇన్ని ఉన్నా..ఎలాగైన అద్భుతమైన విజయం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగి గెలుపు తీరాలకు చేరుకున్నవారని జగజ్జేతలు అనొచ్చు. కలను నిజం చేసుకోవడంలో మార్గదర్శకులు కూడా. అలాంటి ప్రేరణాత్మక సక్సెస్‌ స్టోరీ ఈ లెఫ్టినెంట్‌ హర్దీప్‌ గిల్‌. 

హర్యానా రాష్ట్రం జింద్‌ జిల్లాకు చెందిన హర్దీప్‌గిల్‌ చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవ చేయాలనేది డ్రీమ్‌. బాల్యంలో స్కూల్‌లో మాస్టర్‌ల వల్ల మదిలో పురుడుపోసుకున్న డ్రీమ్‌ అతడితోపాటు పెరిగిందే కానీ కనుమరగవ్వలేదు. అయితే హర్దీప్‌ రెండేళ్ల వయసు నుంచి కన్నీళ్ల కష్టాల కడలిని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రిన పోగొట్టుకున్నాడు. కుటుంబ భారం అంతా అమ్మమీదే పడింది. 

ఆమె మధ్యాహ్నా భోజన పథకం వంటమనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేది. అలాగే కొంత ఆదాయం కోసం చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తుండేది అప్పడప్పుడూ. ఇంట్లో ఉన్నత చదువుకు తగినన్ని వనరులేమి లేవు. కానీ ఆ వాతావరణమే గిల్‌కి నిలకడను, క్రమశిక్షణ, బాధ్యతలను అలవర్చాయి. తనచుట్టూ ఇన్ని సవాళ్లు ఉన్న గిల్‌ తన ఆశయాన్ని కొనసాగించాడమే కాకుండా, ఎలాగైన ఆర్మీలో చేరి సేవ చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యాడు. 

ఆనేపథ్యంలో తన గ్రామంలోనే పాఠశాల విద్య, ఇగ్నో ద్వారా బీఏ పూర్తి చేసి చదవు తోపాటు ఇతర రక్షన పరీక్షలకు సిద్ధమవ్వడం కొనసాగించాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గిల్‌ భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌గా ఎంపికయ్యాడు. అతని విజయం కుటుంబంలో కొండంత ఆశను నెప్పింది. 

శిక్షణా ప్రక్రియ పూర్తి అయ్యి సర్వీస్‌లో చేరతాడు అనగా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి..మునుపటి నియమాకాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ తన ప్రస్థానం మొదట నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినందుకు నిరాశ పడలేదు. ఈసారి ఏకంగా కమిషన్డ్‌ అధికారి అవ్వడమే లక్ష్యంగా ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై ఫోకస్‌ పెట్టాడు. 

పదేపదే ఓటములు..
గిల్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డుకు అనేకసార్లు హాజరవ్వుతూనే ఉండేవాడు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉండేది. రాతపూర్వక పరీక్షలోనే విజయవంతమవ్వలేక నానా తిప్పలు పడ్డాడు. పాపం అది తన ఆత్మవిశ్వాసానికి, సహనానికి పరీక్షలా మారింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్నికొనసాగించాడు. చివరికి తొమ్మిదో ప్రయత్నంలో సక్సెస్‌ అందుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్‌లో 54వ ర్యాంక్‌ను సాధించాడు.

ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ
గిల్ 2024లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. కఠినమైన శిక్షణా షెడ్యూల్‌ ఉండేది. ఆ దినచర్య చాలా సవాలుతో కూడినది. ముందుకుసాగడం అంత సులభం కాదు. కానీ అందుకు తగ్గట్టుగా తనను తాను రాటుదేల్చుకుని మరి నిలబడ్డాడు. అనుకున్నట్లుగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కమిషన్డ్‌ అధికారిగా నియమించబడ్డాడు. 

గిల్‌ని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ 14వ బెటాలియన్‌కు అదికారిగా నియమించారు. ఇది క్రమశిక్షణ, కార్యచరణ సింసిద్ధతలకు పేరుగాంచిన యూనిట్‌. ఈ దృఢ సంక్పలం తన తల్లిన నుంచి వచ్చిందని చెబుతున్నాడు గిల్‌. ముఖ్యంగా ఎయిర్‌మ్యాన్‌ అవకాశాన్ని కోల్పోవడాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కొండంత ఆశతో మొదటి నుంచి మొదలుపెడుతే..తీరా పదేపదే పలకరించే వైఫల్యాలను అధిగమించి సక్సెస్‌ అందుకోవడం అనేది మాటల్లో చెప్పగలిగేంత సులభం కాదు అని అంటాడు గిల్‌. ఇది అలాంటి ఇలాంటి సక్సెస్‌ స్టోరీ కాదుకదూ..!

(చదవండి: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్‌! 93 ఏళ్ల రికార్డు ‍​బ్రేక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement