christamas celebrations
-
సెమీ క్రిస్మస్..కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
విజయవాడ: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో జరుగుతున్న వేడుకలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని స్పష్టం చేశారు. అనంతరం, కొవ్వుత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇదే సమయంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్‌తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
మెగా ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ-క్రిస్మస్ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎలాంటి పండగైన, బర్త్‌డే సెలబ్రెషన్స్ అంటే మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరుతారు. ఈ నేపథ్యంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలో భాగంగా మెగా ఇంట సీక్రెట్ శాంట గేమ్ నిర్వహించారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా డాటర్స్ నిహారిక కొణిదేల, సుష్మితా కొణిదెల, శ్రీజలతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, చరణ్ వైఫ్ ఉపాసన, మిగతా కజిన్స్ అంతా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఉపాసన సీక్రెట్ శాంట అంటూ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్'
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా '' డిసెంబర్ 25, 2018.. డిసెంబర్ 25, 2019''.. తాను జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశాడు.'' సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్.. అందరికి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు. చదవండి: Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి' ఇక సచిన్‌తో పాటు పలువురు క్రీడాకారులు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కూడా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. '' మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.. మీ జీవితాలు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, జాయ్‌గా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అంటూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు. Different years, same feeling! Merry Christmas everyone.🎄🎅 pic.twitter.com/9OjFy003CX — Sachin Tendulkar (@sachin_rt) December 25, 2021 De coração cheio, desejo a todos um Feliz Natal! 🎅🏻🙏🏽❤️ #blessed pic.twitter.com/yCOLAzuhf8 — Cristiano Ronaldo (@Cristiano) December 24, 2021 -
కూలిస్తే ఉన్మాదం.. ప్రేమిస్తే మతం
సాక్షి, హైదరాబాద్: ఏ మతమైనా ఎదుటివారిని ప్రేమించాలనే చెబుతుందని, దాడులు చేయాలని ఎక్కడా చెప్పలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మతోన్మాదం పెరిగితేనే విషమ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. మైనారిటీలపై దాడులు తాత్కాలికమేనని, ఈ దాడులతో ఎవరూ సాధించేమీ ఉండదన్నారు. ప్రజలు ఈర్షాద్వేషాలు విడనాడి ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దాడులతో మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు.. ఒక మతం మీద మరో మతం ధ్వేషం పెంచుకొని ఆలయాలను, ప్రార్థనా మందిరాలను కూల్చడం వల్ల సాధించిందేమిటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘గతంలో ముస్లింలు గుడులపై దాడులు చేస్తే హిందువులు మసీదులపై దాడులు చేశారు. దీనివల్ల మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు. ఎదుటివారిని ప్రేమించాలి. మానవజాతికి అదే కావాలి. దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీ అంటే ఏదో ఒక మతానికో సంబంధించిన కాదు. దేశం, రాష్ట్రంలోని ప్రజలందరిదీ’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషే కాడు ‘ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటివారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. మనిషిని ప్రేమించడమే గొప్ప లక్ష్యం. మనిషిని ప్రేమించలేని వాడు... మనిషిని మనిషిగా చూడలేని వాడు అసలు మనిషే కాదు. మతంలో తప్పులేదు. తప్పు చేయాలని మతం ఎక్కడా చెప్పలేదు. మనిషిని ప్రేమించాలని మాత్రమే మతం చెప్పింది. తప్పు చేయాలని మత బోధకులు చెప్పలేదు. ఈర‡్ష్య, ద్వేషం పెంచుకోవాలని చెప్పలేదు. ప్రేమించాలని, శాంతియుతంగా ఉండాలని చెప్పారు’అని సీఎం అన్నారు. అందరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే ‘రాష్ట్రంలో ప్రజలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో పండుగలను సెలబ్రేట్ చేయాలని ఎవరూ చెప్పలేదు. దరఖాస్తులు పెట్టలేదు. ఎన్నో పోరాటాలు, అనేక క్షోభలు ఎదుర్కొన్న తెలంగాణలో అందరూ బాగుండాలని ఓ పాలసీగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరు. అందరినీ కాపాడే బాధ్యత తెలంగాణ సర్కార్‌దే. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎట్టుండే... ఇప్పుడు ఎట్లుంది? ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకొని ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దాన్ని కొనాలని కేంద్రంతో కొట్లాడే స్థాయికి తెలంగాణ ఎదిగింది’అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగులు కలబోసుకున్న దేశం ఇండియానే ‘ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండే పండుగలుంటాయి. క్రిస్టియన్ దేశాల్లోనూ అంతే. కానీ నెల తిరక్కుండానే పండుగలు చేసుకొనే దేశం ఇండియా ఒక్కటే. క్రిస్మస్, రంజాన్, దసరా, దీపావళి, సంక్రాతి... ఇలా అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటే. భారత్ అత్యుత్తమ దేశం. ఈ దేశంలో ప్రేమైక సమాజం కావాలి’అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, క్రైస్తవ ప్రతినిధులు జాన్ గొల్లపల్లి, పూల ఆంథోని, సతీశ్ కుమార్, సాల్మన్, డేనియల్, రాబెల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి -
క్రిస్మస్, కొత్త ఏడాదిపై ఆంక్షలు?
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కరోనా మూడో దశ, రూపాంతర ఒమిక్రాన్ భయాలు క్రిస్మస్, నూతన ఏడాది సందడిని తగ్గించేలా ఉన్నాయి. మూడో దశను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాలను కట్టడి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సర్కారుకు గురువారం కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు జన సందడిని నియంత్రించాలని కోరింది. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నా
లండన్ : అదేంటి ఎప్పుడు కూల్‌గా ఉంటూ ఏ విషయంలో తలదూర్చని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నెటిజన్లపై మండిపడుతున్నారేంటి అనుకుంటున్నారా! అయితే మీరు పొరబడ్డట్లే. అసలు విషయం ఏంటంటే.. పాకిస్థాన్ మూలాలున్న బ్రిటీష్ బాక్సర్ ఆమిర్‌ఖాన్ తన భార్య, పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు. 'మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నా కుటుంబసభ్యులతో ఆనందంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నా. ఖాన్ ఫ్యామిలీ నుంచి మీ అందరికి మరోసారి #మెర్రీ క్రిస్మస్' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై స్పందించిన అతని ఫాలోవర్స్ ఆమిర్‌ను తప్పుబడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి క్రైసవుల పండుగను ఎలా జరుపుకుంటారని ఆమిర్‌ను దుమ్మెత్తిపోశారు. దీంతో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. 'మీరు పెట్టిన కామెంట్స్ నాకు ఆశ్చర్యం కలిగించాయి. మతం అనే బేషజాలు లేని ఒక వ్యక్తిగా నేను అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరుపుకున్నాము. కానీ దీనిని మీరందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను మీ అందరిని మనస్పూర్తిగా ద్వేషిస్తున్నా' అంటూ రీట్వీట్ చేశారు. So shocked by all the hate I’m getting on my Twitter & instagram for wishing everyone Merry Christmas and posting a picture with my family in Christmas outfits. Just want to tell those people ‘I don’t give a f**k’ — Amir Khan (@amirkingkhan) December 26, 2019 బ్రిటీష్ బాక్సర్‌గా పేరు పొందిన ఆమిర్ ఖాన్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ రింగ్‌లోకి దిగలేదు. అయితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో బరిలోకి దిగనున్నట్లు ఇంతకు ముందే మీడియాకు వెల్లడించాడు. కాగా 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లైట్ వెయిట్ విభాగంలో ఆమిర్ దేశానికి సిల్వర్ మెడల్‌ను అందించాడు. కాగా, 33 ఏళ్ల ఆమిర్ ఖాన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు ఇదివరకే స్పష్టం చేశాడు. -
నల్లగొండలో క్రిస్మస్ వేడుకలు
-
రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చర్చిల్లో ప్రముఖులు ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కృష్ణా: ఏసుక్రీస్తు పుట్టినరోజుకు గుర్తుగా భక్తిభావంతో కోట్లాదిమంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు, మానవజాతికి ఆదర్శమని మంత్రి పేర్నినాని తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మానవాళికి జీసస్ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం చూపించాలిని ఆయన జీవితం ద్వారా మహోన్నత సందేశాలు ఇచ్చారని తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్లక్షమాపణ గుణం ఉండాలిని జీసస్ బోధించినట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా భక్తులు, ప్రజలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సెయింట్‌పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీనేతలు పాల్గొన్నారు. అనంతపురం: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వేలాది మంది విదేశిభక్తులు పాల్గొన్నారు. నెల్లూరు:సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సాగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి అనిల్ కుమార్ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, సంతోషాలతో కూడిన వెలుగులను ప్రజల జీవితాల్లో నింపేదే క్రిస్మస్ పండగని తెలిపారు. చిత్తూరు:చిత్తూరు టౌన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే భక్తులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు: జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండగ సందర్భంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. గుంటూరు, ఫిరంగిపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు. విశాఖ పట్నం: జగదాంబ జంక్షన్ సెయింట్ అంథోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవ భక్తిగీతలతో ప్రార్థన మందిరం కళకళలాడుతుంది. ఈ పార్థనల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్ధరాత్రి నుంచి చర్చిల్లో భక్తులు పార్ధనల్లో పాల్గొన్నారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ప్రార్ధనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ లుథర్, సీఎస్ఐ చర్చి, సికింద్రాబాద్ సెయింట్ మేరిస్ చర్చి, విజయవాడ గుణదల చర్చిలో జరుతున్న క్రిస్మస్ వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొని ప్రత్యేక పార్ధనలు చేస్తున్నారు. మంచిర్యాల: సీఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్ పాల్గొని.. భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టాల మండలంలోని విజయనగరం సీఎస్ఐ చర్చిలో జరగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ప్రజలు, భక్తులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కొత్తగుడెం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు. -
క్రిస్మస్కు ముస్తాబైన సిలికాన్ సిటీ
సాక్షి, బెంగళూరు: భువిపై శాంతిదూత ఏసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజుకు రెండురోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిల ముస్తాబు, షాప్‌లు, మాల్స్‌లో రంగురంగుల లైట్ల అలంకరణ మిరుమిట్లు గొలుపుతోంది. కేక్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరు శివాజీనగరలోని సెయింట్ మేరీ బెసెలికా చర్చి, ఫ్రేజర్టౌన్లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కెథడ్రెల్ చర్చ్, బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ ప్యాట్రిక్ చర్చ్, సెయింట్ మార్క్స్ కెథెడ్రల్, చామరాజపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చ్, ఎంజీ రోడ్డులోని చర్చీలు, సెయింట్ జాన్స్ చర్చి తదితర నగరంలోని పలు రోమన్ క్యాథలిక్, ప్రొస్టెటెంట్ చర్చిలు పండుగ ఏర్పాట్లతో కోలాహలంగా ఉన్నాయి. స్టార్లు, బెలూన్లు, క్రిస్మస్ ట్రీలతో అందంగా తయారయ్యాయి. శాంటాక్లాజ్ బొమ్మలు పిల్లలూ పెద్దలను అలరిస్తున్నాయి. రాష్ట్రమంతటా క్రిస్మస్ గంటలను మోగిస్తున్నారు. క్రైస్తవులు బంధుమిత్రుల ఇంటింటికి వెళ్లి క్యారల్స్ పేరు మీద వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీటికితోడు క్రైస్తవ మత పెద్దలు పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పేదవారికి బట్టలు, పిల్లలకు పుస్తకాలను బహూకరిస్తున్నారు. బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ తదితర ప్రధాన నగరాల్లోని చర్చిలు ముస్తాబయ్యాయి. 24వ తేదీ నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఆరంభం కాబోతున్నాయి. జోరుగా వ్యాపారాలు పండుగ నేపథ్యంలో జయనగర, బ్రిగేడ్ రోడ్డు, ఎంజీరోడ్డు, కమర్షియల్ స్ట్రీట్, గాంధీ బజార్ తదితర చోట్ల ఫ్యాన్సీ స్టోర్లలో ‘మేరీ క్రిస్మస్’ సందేశముండే కార్డులను, బహుమతులను, యేసుక్రీస్తు, మేరీమాతా ప్రతిమలను, విభిన్న డిజైన్లలోని క్యాండిళ్లు, శాంటాక్లాజ్ బొమ్మల విక్రయాలు ఊపందుకున్నాయి. కేక్‌లు, వంటకాలకు డిమాండ్ పెరిగింది. -
డిసెంబర్ 5లోగా జిల్లాలకు క్రిస్మస్ గిఫ్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5 లోగా జిల్లా కేంద్రాలకు క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు పంపించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ హాజరయ్యే విందు కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖ క్రిస్టియన్ అవార్డులను అర్హత గల 12 మందికి, 6 సంస్థలకు ఇవ్వాలని సూచించారు. క్రిస్టియన్ భవన్‌కు పునాది రాయి వేయడానికి అవసరమైన ఏర్పాట్లు వచ్చే నెల 20 కల్లా పూర్తవుతాయన్నారు. 63 ఎకరాల భూమిని శ్మశాన వాటికల ఏర్పాటుకు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే మైనార్టీ సంక్షేమశాఖకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్, టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ బి.శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియో : ఇది కలా.. నిజమా?!
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టమస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్టమస్ అనగానే టక్కున గుర్తుకొచ్చేవి.. క్రిస్టమస్ ట్రీ, స్టార్, శాంటా.. ఇంకా బోలెడన్ని బహుమతులు. అయితే వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించిన క్రిస్టమస్ శాంటాను చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం అవాక్కయ్యారు. తాము చూస్తున్నది కలా.. నిజమా అని పోల్చుకోవడానికి వారికి కాస్తా సమయం పట్టింది. ఎందుకంటే క్రిస్టమస్ శాంటాగా వారిని పలకరిచండానికి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కావడం విశేషం. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న చిన్నారుల్లో పండగ సరదాను తీసుకురావాలని భావించిన ఒబామా, వాషింగ్టన్లో ఉన్న చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడున్న పిల్లలను కలిసి వారితో కాసేపు ముచ్చటించి.. బోలేడన్ని బహుమతులు ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఒబామా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఈ చిన్నారులను ఎంత శ్రద్దగా చూస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యావాదాలు అన్నారు. ఒబామా, ఆస్పత్రిలో చిన్నారులతో మాట్లాడుతూ.. సందడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Thank you @BarackObama for making our patients’ day so much brighter. Your surprise warmed our hallways and put smiles on everyone’s faces! Our patients loved your company…and your gifts! https://t.co/bswxSrA4sQ ❤️ #HolidaysAtChildrens #ObamaAndKids pic.twitter.com/qii53UbSRS — Children's National 🏥 (@childrenshealth) December 19, 2018 -
విల్లామేరీ విమెన్స్ కాలేజీలో క్రిస్మస్ సందడి
-
క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
⇒ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు ⇒ కేక్ కట్‌చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన జగన్మోహన్రెడ్డి సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి రెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాస్టర్ రెవరెండ్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలోని భక్తుల మధ్య కేక్ కట్ చేసి రాయలసీమ సీఎస్ఐ డయాసిస్, బిషప్ రెవరెండ్ డాక్టర్ బి.డి.ప్రసాదరావు, పెదనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిలకు తినిపించారు. అనంతరం పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. చర్చిలో ఉన్న వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలం దరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిం చారు. అంతకుమునుపు వేదికపై వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డిలు బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించారు. ప్రార్థనలో వైఎస్ కుటుంబ సభ్యులు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి దంపతులు, ైవె ఎస్ మేనత్త కమలమ్మ, వైఎస్ జగన్ మామ డాక్టర్ ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ఎస్.బి.అంజాద్ బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్నారు. చిన్నారికి నామకరణం పులివెందులలోని చర్చి ఆవరణలో గంగా భవాని, యోహాన్ దంపతుల కుమార్తెకు విజయమ్మ అని వైఎస్ జగన్ పేరు పెట్టారు. జగన్ చేతుల మీదుగా నామకరణం చేయించాలని చాలా రోజులుగా ఎదురు చూశామని, ఇపుడు ఆ కోరిక నెరవేరిందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. క్రిస్మస్ రోజున నామకరణం జరగడంతో వారు ఉప్పొంగిపోయారు.