శాంతిదూతకు ఆహ్వానం

Christmas Celebrations Started In Bengulure - Sakshi

సాక్షి, బెంగళూరు: భువిపై శాంతిదూత ఏసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజుకు రెండురోజులే మిగిలి ఉంది.  ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో క్రిస్మస్‌ సందడి నెలకొంది. చర్చిల ముస్తాబు, షాప్‌లు, మాల్స్‌లో రంగురంగుల లైట్ల అలంకరణ మిరుమిట్లు గొలుపుతోంది. కేక్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరు శివాజీనగరలోని సెయింట్‌ మేరీ బెసెలికా చర్చి, ఫ్రేజర్‌టౌన్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ కెథడ్రెల్‌ చర్చ్, బ్రిగేడ్‌ రోడ్డులోని సెయింట్‌ ప్యాట్రిక్‌ చర్చ్, సెయింట్‌ మార్క్స్‌ కెథెడ్రల్, చామరాజపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చ్, ఎంజీ రోడ్డులోని చర్చీలు, సెయింట్‌ జాన్స్‌ చర్చి తదితర నగరంలోని పలు రోమన్‌ క్యాథలిక్, ప్రొస్టెటెంట్‌ చర్చిలు పండుగ ఏర్పాట్లతో కోలాహలంగా ఉన్నాయి. స్టార్లు, బెలూన్లు, క్రిస్మస్‌ ట్రీలతో అందంగా తయారయ్యాయి. శాంటాక్లాజ్‌ బొమ్మలు పిల్లలూ పెద్దలను అలరిస్తున్నాయి.   

రాష్ట్రమంతటా 
క్రిస్మస్‌ గంటలను మోగిస్తున్నారు. క్రైస్తవులు బంధుమిత్రుల ఇంటింటికి వెళ్లి క్యారల్స్‌ పేరు మీద వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీటికితోడు క్రైస్తవ మత పెద్దలు పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పేదవారికి బట్టలు, పిల్లలకు పుస్తకాలను బహూకరిస్తున్నారు. బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ తదితర ప్రధాన నగరాల్లోని చర్చిలు ముస్తాబయ్యాయి. 24వ తేదీ నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఆరంభం కాబోతున్నాయి.  
 

జోరుగా వ్యాపారాలు  
పండుగ నేపథ్యంలో జయనగర, బ్రిగేడ్‌ రోడ్డు, ఎంజీరోడ్డు, కమర్షియల్‌ స్ట్రీట్, గాంధీ బజార్‌ తదితర చోట్ల ఫ్యాన్సీ స్టోర్లలో ‘మేరీ క్రిస్‌మస్‌’ సందేశముండే కార్డులను, బహుమతులను, యేసుక్రీస్తు, మేరీమాతా ప్రతిమలను, విభిన్న డిజైన్లలోని క్యాండిళ్లు, శాంటాక్లాజ్‌ బొమ్మల విక్రయాలు ఊపందుకున్నాయి. కేక్‌లు, వంటకాలకు డిమాండ్‌ పెరిగింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top