బెంగళూరు: ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ టైకూన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్(డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్‌మండ్ టౌన్‌లోని తన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపార పరిశ్రమ వర్గాలను ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది.
సీజర్ రాయ్) బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. 2005లో ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో విస్తరించింది.
అప్పులు లేకుండా వ్యాపారం నడిపిన మోడల్‌తో ప్రసిద్ధి గాంచారు సీజర్ రాయ్. : రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, విస్తృత నెట్‌వర్క్ తో వ్యాపార వర్గాల్లో గుర్తింపు పొందారు. ఈరోజు ఐటీ శాఖ ఆయన నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.


