గ్యాస్‌ కష్టాలు.. ఆఫీసుకు రాకండి! | HCLTech and Infosys Gives WFH Option As Gas Crunch | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కష్టాలు.. ఆఫీసుకు రాకండి, ఇంట్లో పనిచేసుకోండి

Mar 12 2026 5:29 PM | Updated on Mar 12 2026 6:24 PM

HCLTech and Infosys Gives WFH Option As Gas Crunch

దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హెచ్‌సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement