ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్‌ లుక్‌..! | Nita Ambanis Saree and Vintage Basra Pearl Necklace Goes Viral | Sakshi
Sakshi News home page

Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్‌ లుక్‌..!

Dec 19 2025 12:46 PM | Updated on Dec 19 2025 1:19 PM

Nita Ambanis Saree and Vintage Basra Pearl Necklace Goes Viral

ధీరూభాయ్‌ ఇంటర్నెషనల్‌ స్కూల్‌​ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్‌లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్‌ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్‌ని బట్టి తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉంటుంది. ఇక ఈ స్కూల్‌ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్‌ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్‌ ఆమె ఫ్యాషన్‌ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. 

స్టైలిష్‌గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్‌ లుక్‌ దటీజ్‌ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్‌ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్‌ని ప్రజెంట్‌ని చేశారు నీతా. 

ఈ కార్యక్రమంలో  ధీరుబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌​ స్కూల్‌ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ ​‍కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్‌ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్‌ ఖాన్‌, క్రికెటర్‌ రోహిత్‌ శర్మ తదితరులు పాల్గొనన్నారు. 

బాస్రా ముత్యాల ప్రత్యేకత..
హైదరాబాద్‌ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్‌లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. 

ప్రస్తుత ఇరాక్‌ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్‌ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్‌ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్‌, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు.

 

 (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్‌గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement