breaking news
Red Saree
-
ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!
ధీరూభాయ్ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్‌లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్‌ని బట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ స్కూల్ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్ ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. స్టైలిష్‌గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్ లుక్ దటీజ్ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్‌ని ప్రజెంట్‌ని చేశారు నీతా. ఈ కార్యక్రమంలో ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ తదితరులు పాల్గొనన్నారు. బాస్రా ముత్యాల ప్రత్యేకత..హైదరాబాద్ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్‌లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. ప్రస్తుత ఇరాక్ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్‌గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి) -
'కిష్కింధపురి' ఈవెంట్లో అనుపమ పరమేశ్వరన్(ఫొటోలు)
-
రెడ్ శారీలో మెరిసిపోతున్న మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. (ఫోటోలు)
-
రెడ్ శారీలో అలేఖ్య హారిక స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
‘ఎర్ర చీర’ ట్రైలర్ ఈవెంట్ లో మెరిసిన హీరోయిన్ కారుణ్య చౌదరి (ఫొటోలు)
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
రెడ్ అండ్ బ్లాక్ సారీలో.. శ్రీలీల అన్‌స్టాపబుల్ లుక్స్ (ఫోటోలు)
-
ఎర్ర చీరలో కావ్య థాపర్.. మేడమ్ సార్ మేడమ్ అంతే
-
ఎర్రచీరలో 'యానిమల్' బ్యూటీ.. చూపు తిప్పగలరా? (ఫొటోలు)
-
ఎర్ర చీర.. మల్లెపూలు.. నయన్ అల్ట్రా క్లాస్ లుక్ (ఫొటోలు)
-
Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో సరికొత్త లుక్‌తో జాన్వీ కపూర్ (ఫోటోలు)


