ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్‌లు లెహంగాకి గ్రాండ్ లుక్‌ని తెప్పించాయి.
నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్‌కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్‌గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్‌తో కూడిన ఎంబాలిష్‌మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది.
ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్‌మెంట్‌రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్‌ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్‌గ్రీన్‌గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..)


