దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్‌లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.
ఫిబ్రవరి మాసంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి.
క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్‌ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్‌ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ.


