ఇప్పుడంటే...
ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్‌లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.
అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్‌కు సంబంధించిన పోస్టర్‌లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్‌లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్‌కు సంబంధించిన అద్భుత పోస్టర్‌ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్‌లోని ‘హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...
1920లలో...
మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.
అలా మొదలైంది...
దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్‌లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ పోస్టర్‌లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్‌టైజ్‌మెంట్. అద్భుతమైన లేఔట్‌తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్‌ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.
ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్
ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.
కళాత్మక విలువలు
నవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్‌లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్‌ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్‌లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.
ఆ కాలానికి స్వాగతం
అలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్‌లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్‌లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది.


