పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నేలంతా పరుచుకున్న పచ్చదనం చూసి ముగ్దులవుతుంటాం. కానీ, ఈ సీజన్‌లో ప్రత్యేకంగా నేలంతా గులాబీ రంగుపరుచుకున్నట్టుగా.. అలల్లా ఎగిసిపడుతున్న ఆ అందం చూడాలంటే మన దేశంలోనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వీకెండ్‌లో ఈ పింక్ సీజన్.. మీలో ఫుల్ స్వింగ్‌ను ఇట్టే తెచ్చేస్తుంది. అతిథులుగా విచ్చేసి, సందడి చేస్తున్న పింక్ ఫ్లెమింగోలు బారులు బారులుగా తేరు కట్టి, తీరుగా మనల్ని అలరిస్తున్నాయి. ఆ అందాల ఆనందాన్ని తిలకించడానికి ముందుగా ముంబై మీదుగా ప్రయాణిద్దాం...
భారతదేశంలో అధికారికంగా ఫ్లెమింగో సీజన్ వచ్చేసింది. పిలవకుండా వచ్చే ఈ శీతాకాలపు అతిథులు ముంబైతోపాటు నవీ ముంబైలలోని కొన్ని బెస్ట్ సైట్ సీయింగ్ ఫ్లెమింగో ప్రదేశాలు ఉన్నాయి. పొడవాటి కాళ్ళు, వంగిన మెడలు, విలక్షణమైన కిందికి వంగిన ముక్కులతో సొగసైన ఈ నీటి పక్షులు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను గులాబీ రంగుతో చిత్రించడం ప్రారంభించాయి. ప్రతి యేటా అక్టోబర్ చివరి నుండి మే మొదటి వారం వరకు ఫ్లెమింగోలు భారతదేశానికి వలస వస్తుంటాయి. ఫిబ్రవరి నుండి మార్చి వరకు వీటి సంఖ్య గరిష్టస్థాయిలో ఉంటుంది.
ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ కొంచెం పెరగడంతో ఈ పక్షుల రాకలో కొంచెం ఆలస్యం జరిగిందని పక్షి పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, ఈ అద్భుతమైన పక్షుల మొదటి గుంపు ముంబై, నవీ ముంబై అంతటా ఐకానిక్ ప్రదేశాలలో వచ్చి చేరాయి. దీంతో వీక్షకుల ఉత్సాహం మిన్నంటుతోంది. థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం
పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామమే. ఈ అభయారణ్యం ఐరోలి, వాషి మధ్య విస్తరించింది. ఉల్హౌస్ నది సల్సెట్ ద్వీపం ఈశాన్య మూలలో రెండు ఉపనదులుగా విడి΄ోతుంది. మరొకటి వాసాయి క్రీక్. ఈ రెండూ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. క్రీక్ సాల్సెట్ ద్వీపం తూర్పు సరిహద్దును ఏర్పరచడం, కొంకణ్ ప్రధాన భూభాగం నుండి ద్వీపాన్ని వేరు చేస్తుంది. దీనినే థానే క్రీక్ అంటారు.
ఈ ్ర΄ాంతం వివిధ ఏవియన్ జాతులకు నిలయంగా ఉండటంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ముఖ్యమైన పక్షి ప్రాంతంగా గుర్తించబడింది. ముఖ్యంగా ఇది ఫ్లెమింగోలు, అనేక ఇతర వలస, నీటి పక్షుల జనాభాకు నిలయంగా ఉంది. ఫ్లెమింగోలను దగ్గరి నుంచి వీక్షించడానికి కోస్టల్ – మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ నుండి ప్రసిద్ధ బోట్ సఫారీ ఉంది.
సేవిరి మడ్ ఫ్లాట్స్
ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ΄ోషకాలతో కూడిన బురద ఫ్లాట్‌లు వేలాది ఫ్లెమింగోలను ఆకర్షిస్తాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇక్కడ గైడెడ్ వాక్‌లు మరియు ఫ్లెమింగో–వాచింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తుంది.
భండప్ పంపింగ్ స్టేషన్
తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేకి దూరంగా ఉన్న ఈ క్రీక్‌సైడ్ స్పాట్ పక్షులను చూసేవారికి, ముఖ్యంగా సూర్యోదయ– సూర్యాస్తమయ సమయంలో చాలా ఇష్టమైనది. ఈ ప్రాంతం మడ అడవులతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల నీటి బాతులు, వలస పక్షులను ఆకర్షిస్తుంది.
డీపీఎస్ ఫ్లెమింగో సరస్సు
ఇప్పుడు నవీ ముంబైలోని నెరుల్ ప్రాంతంలో ఒక పరిరక్షణ అభయారణ్యం, ఈ సరస్సు సూర్యోదయం– సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది ఫొటోగ్రాఫర్ల కంటికి కళల దృశ్యమై కనువిందు చేస్తుంది. ఇది నగరంలో ప్రశాంతమైన ప్రదేశం, ప్రకృతి నడకలు, పక్షుల ఫోటోగ్రఫీకి అనువైనది.
కరావే ఫ్లెమింగో పాయింట్
నవీ ముంబైలోని సీవుడ్స్‌లో టీఎస్ చాణక్య సమీపంలో, సుందరమైన వెట్‌ల్యాండ్స్‌లో నడుస్తూ ఫ్లెమింగోలను చూడొచ్చు. ప్రశాంతమైన పరిసరాలు, కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు, పర్యావరణ పర్యాటకానికి గొప్ప ప్రదేశంగా మారాయి. ఫ్లెమింగో గుంపులను దగ్గర నుంచి చూసేందుకు సీజనల్ బోట్ రైడ్‌లు అందుబాటులో ఉంటాయి.
భిగ్వాన్‌లోని ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్స్
తరచుగా మహారాష్ట్ర భరత్‌పూర్ అని పిలువబడే భిగ్వాన్ పక్షి ప్రేమికులకు అంతగా తెలియని రత్నం. పూణే సమీపంలోని యశ్వంత్ సాగర్ జలాశయం ఫోటోగ్రాఫర్‌లకు మరొక హాట్‌స్పాట్.
కర్నాల పక్షుల అభయారణ్యం
ముంబైకి సమీపంలో ఉన్న ఈ అభయారణ్యం ట్రెక్కింగ్ ట్రైల్స్, ఇతర వలస జాతులతో పాటు ఫ్లెమింగోలను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చారిత్రాత్మక కర్నాల కోటకు నిలయం. అంతేకాదు, పక్షులను చూడటానికి గొప్ప ప్రదేశం.
నందూర్ మధమేశ్వర్ పక్షుల అభయారణ్యం :
నాసిక్‌లోని ఒక ముఖ్యమైన చిత్తడి నేల ఇది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు అనువైనది. ఈ అభయారణ్యం రామ్‌సర్ ప్రదేశంగా గుర్తించబడింది, శీతాకాలంలో వేలాది వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి కోయ్నా వన్యప్రాణుల అభయారణ్యం, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌తోపాటు మహారాష్ట్ర నేచర్ పార్క్‌లను కూడా సందర్శించవచ్చు.
ఫ్లెమింగోలను చూడటం అనేది కేవలం దృశ్యాలను వీక్షించే కార్యక్రమం కాదు. వేగవంతమైన ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండే అందమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను మనసులో ముద్రించుకోవచ్చు. నిశ్శబ్దంలో నీటి అలలు, తెల్లవారుజామున ఆకాశంలో మెత్తటి రెక్కల శబ్దంలో నవీ ముంబై విలువైన అరుదైన సహజ విహారయాత్రను అందిస్తుంది.
సూర్యోదయం–సూర్యాస్తమయాలు అత్యుత్తమం...
ఉదయం 7 నుండి 9 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 4 నుండి 6 గంటల మధ్య, పక్షులు చురుకుగా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ విహరించవచ్చు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50, గైడెడ్ బోట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.500..
పడవ ప్రయాణానికి..
ఈ ప్రదేశాలలో స్థానిక మత్స్యకారులు నేచర్ లవర్స్‌కి సూర్యోదయ పడవ ప్రయాణాలను అందిస్తారు. పక్షులకు దాణా వేయడం, వాటిని అందుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు ఎగరడం.. ఆహ్లాదంగా అనిపించే ఉదయాలే దీనికి ఉత్తమ సమయం. అభయారణ్యం వెలుపల పడవ ప్రయాణాలు సాధారణంగా ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పడవ ప్రయాణానికి సీజన్, వ్యక్తుల సమయాన్ని బట్టి వ్యక్తికి రూ.900 – రూ.1,500 మధ్య ఖర్చవుతాయి.
ఇలా చేరుకోవచ్చు...
హైదరాబాద్ ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి రెండు గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. తరువాత రైలు లేదా టాక్సీ ప్రయాణం ద్వారా నవీ ముంబైకి వెళ్లచ్చు. వాషి, నెరుల్, సీవుడ్స్‌లో వసతి సదుపాయం లభిస్తుంది.
మన దేశానికి అరుదెంచే వలస పక్షుల సమయాలు...
పింక్ ఫ్లెమింగోలు శీతాకాలంలో దాదాపు నవంబర్ నుండి మే వరకు భారతదేశానికి వస్తాయి. జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా సందడి చేస్తాయి. ఫ్లెమింగో సీజన్ మాత్రం నవంబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. కాక΄ోతే వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ సీజన్‌లో నివాసి లెస్సర్ ఫ్లెమింగోలు, వలస వచ్చిన గ్రేటర్ ఫ్లెమింగోలు రెండూ కనిపిస్తాయి.
ట్రావెల్ ట్రెండ్స్
జెన్ ఏఐ వోవర్ అడ్మిన్ రాబోయే కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగబోతోంది. ప్రయాణికులు ఇప్పటికే ట్రావెల్ ప్లాన్, బుకింగ్‌ల కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ కూడా రంగంలోకి దిగడంతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులువు అయింది.
ప్రయాణాలకు సంబంధించి ఏఐ సాంకేతికతను వాడుకోవడానికి సంబంధించి మంచితోసాటు చెడు కూడా ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఆల్గోరిథమిక్ సిఫారసులు వోవర్ టూరిజానికి కారణం అవుతాయని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రయాణానికి సూచిస్తాయని, ట్రావెల్ స్కామ్స్ జరగడానికి కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
‘ప్రయాణాల కోసం ఏఐ సాధనాలను వాడుకోవడానికి సంబంధించి ఎన్నో పరిమితులు ఉన్నాయి’
అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మీన్ బినా.
ఇతర రాష్ట్రాలలోనూ...
మహారాష్ట్రలోని చిత్తడి నేలలు, సరస్సులతోపాటు గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్, ఒడిశాలోని చిలికా సరస్సు వంటి తీర్ర΄ాంతాలలో ఫ్లెమింగోలు అద్భుతమైన అందాలలో కనువిందు చేస్తాయి. మహారాష్ట్రలో భిగ్వాన్ ‘దక్షిణ భారత్‌పూర్‘ అని పిలుస్తారు, ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్ ఫ్లెమింగో గుంపుకు ప్రసిద్ధి చెందింది.
గుజరాత్‌లో...
అతిపెద్ద లెస్సర్ ఫ్లెమింగో బ్రీడింగ్ గ్రౌండ్ (ఫ్లెమింగో సిటీ) కు నిలయం. నల్ సరోవర్, థాల్ లేక్ పక్షుల కేంద్రం, ఖిజాదియా పక్షుల అభయారణ్యంలో శీతాకాలంలో ఫ్లెమింగోలు పుష్కలంగా కనువిందు చేస్తాయి.
చేరుకోవడానికి ప్రయాణ మార్గం...
విమానంలో... హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్ ΄ోర్ట్ నుంచి అహ్మదాబాద్ లేదా జామ్ నగర్‌కు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి నల్ సరోవర్, థాల్ ్ర΄ాంతాలకు కారు లేదా లోకల్ ట్రైన్‌లో చేరుకోవచ్చు. కచ్‌కు విమానంలో లేదా రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకొని తర్వాత రాన్‌కు ప్రయాణించవచ్చు.
రాజస్థాన్
సాంబార్ సరస్సు ఫ్లేమింగోలకు శీతాకాలపు విడిది ప్రదేశం. హైదరాబాద్ నుండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది సాంబార్ లేక్. విమానం /రైలు మార్గాల్లో వయా జైపూర్‌కు చేరుకొని వెళ్లాలి. రైలు మార్గంలో నాగ్‌పూర్, ఫులేరా కు చేరుకోవచ్చు.
ఒడిశా
భారతదేశంలోని అతిపెద్ద తీర్రప్రాంత సరస్సు అయిన చిలికా సరస్సు వేలాది మందిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ నుంచి చిలికా సరస్సు రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్/ ట్రెయిన్/ బస్ మార్గాల ద్వారా విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా చేరుకోవచ్చు. భువనేశ్వర్‌కి విమానంలో వెళ్లి అక్కణ్ణుంచి టాక్సీ లేదా ట్రెయిన్ ద్వారా సరస్సుకు చేరుకోవచ్చు.
– నిర్మలారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి


