రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రాయల్ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓర్లాండోకు చెందిన బిలియనీర్ పద్మజ , రామరాజు మంతెన దంపతుల కుమార్తె నేత్ర మంతెన, మరో వ్యాపారవేత్త సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు , CTO వంశీ గదిరాజు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూ.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Jr.),ఆయన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్ ఉత్సాహంగా స్టెప్పులు వేయడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఉదయపూర్‌లో జరుగుతున్న వివాహ వేడుకల్లో భాగంగా జూ. ట్రంప్ బాలీవుడ్పాట బీట్‌లకు డ్యాన్స్‌చేశారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తన హిట్ పాట "వాట్ ఝుమ్కా?"కి సాంగ్‌కు వీళ్లద్దిరనీ ఆహ్వానించి మరీ స్టెప్పులు వేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అటు వధూవరులు నేత్ర, వంశీ కూడా రణ్‌వీర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు.
;
లేక్స్ సిటీలో నేత్ర మంతెన, వంశీకి పెళ్లి సందడి మొదలైంది. సంగీత వేడుక నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ స్టార్-స్టడెడ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా శుక్రవారం (నవంబర్ 21) సంగీత్ వేడుక జరిగింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ సంగీత్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, కృతి సనన్ ,వరుణ్ ధావన్‌లతో సహా బాలీవుడ్ తారలు సందడి చేశారు. "ఆంఖ్ మారే", గల్లీ బాయ్ "అప్నా టైమ్ ఆయేగా" పాటలతో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరినీ స్టెప్పులేయించి, అతిథులందరినీ అలరించారు. బెట్టినా బంగారు లెహంగా-చోలిలో అద్భుతంగా కనిపించగా, రణ్‌వీర్ నల్లటి ఫార్మల్ సూట్‌లో మెరిశాడు.


