టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఐటీ బాంబేలో టెక్‌ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
టెక్‌ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి.


