పీఎల్‌ఐ పథకానికి 55 కంపెనీలు సై.. | PLI Scheme Attracts 55 Companies Commits Rs 13203 Crore Investments | Sakshi
Sakshi News home page

పీఎల్‌ఐ పథకానికి 55 కంపెనీలు సై..

Feb 11 2026 5:54 PM | Updated on Feb 11 2026 6:04 PM

PLI Scheme Attracts 55 Companies Commits Rs 13203 Crore Investments

న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్‌ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం మూడో రౌండ్‌ను కేంద్ర స్టీల్‌ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్‌గ్రేడెడ్‌ అలాయ్‌ స్టీల్‌ తయారీలో 8.7 మిలియన్‌ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్‌కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.

వీటిలో పీఎస్‌యూ దిగ్గజం సెయిల్‌ సేలం స్టీల్‌ ప్లాంట్‌తో స్టీల్‌ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్‌ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో పీఎల్‌ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.

మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌.. లక్ష్యాలు రెండింటికీ  తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్‌ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్‌ టన్నుల స్పెషాలిటీ స్టీల్‌ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement