గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు.
ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్ టాక్‌తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు.
ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.


