రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.
In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳
pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026
దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


