న్యూ ఇయర్‌ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం? | 2 Held With 150 Kg Explosives In Rajasthan | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?

Dec 31 2025 3:01 PM | Updated on Dec 31 2025 3:29 PM

2 Held With 150 Kg Explosives In Rajasthan

ఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది. రాజస్థాన్ టోంక్‌ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును  స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ సంచులతో ఉన్న కారును సీజ్‌ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్‌కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని.. వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని.. కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement