నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మేఘాలయలోని షిల్లాంగ్‌లోని ఖైందాయ్ లాడ్ (పోలీస్ బజార్)లో ఒక ఆసక్తికర సంఘటన నమోదైంది. విదేశీ టూరిస్టు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. స్థానికులు ఆమె చుట్టూచేరి సందడి చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో స్పెషాల్టీ ఏముంది అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నూతన సంవత్సర వేడుకల మధ్యలో ఒక విదేశీ పర్యాటకురాలు ఉత్సాహంగా నృత్యం చేశారు. దీంతో చాలామంది ఆమె చుట్టూ చేరారు. కొంతమంది ఉత్సాంగా అడుగులు కదిపారు, మరికొంతమంది ఆమె చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడిన ఆమెను కాపాడటం విశేషంగా నిలిచింది.
ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
ఆ క్షణం ఆమె స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఆస్కారం కల్పించారు. ఆమె స్వేచ్ఛకు, మర్యాదకు భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దూరం పాటిస్తూ, సురక్షితంగా , సుఖంగా ఉండేలా మహిళా డ్యాన్సర్‌ను గౌరవించిన తీరును కొనియాడారు. స్త్రీలను గౌరవించే షిల్లాంగ్ సంస్కృతిని, స్థానిక ఖాసీ పురుషుల ప్రవర్తనపై ప్రశంసలు వెల్లువెత్తాయి.


