ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి పెద్దగా ఏమి ఆశించారు. పిల్లల క్షేమమే సదా ఆ కాక్షించే ఆ పేరెంట్స్ రుణం ఏమిచ్చినా..తీర్చుకోలేం. వాళ్ల ప్రేమ అనంతం, అజరామరం. వాళ్లకు ఎంతో ఇష్టమైన పని, లేదా వాళ్ల లైఫ్ డ్రీమ్‌ని నెరవేరిస్తే..ఏ పిల్లలకైనా అంతకు మించిన గొప్ప విజయం మరొకటు ఉండదు. అలాంటి గొప్ప సక్సెస్‌ని సాధించాడు ఈ కొడుకు. తన అమ్మకు ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. ఏ తల్లైన ఇంతకుమించి ఇంకేం కోరుకుంటుంది పిల్లల నుంచి అనిపిస్తుంది కూడా.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మనీష్ అనే వ్యక్తి విమానం ఎక్కడం అనేది తనతల్లి చిరకాల కోరిక అని. అది ఈ రోజు నెరవేరబోతుందంటూ..తల్లి కొడుకులిద్దరూ విమానం ఎక్కుతున్న దగ్గర నుంచి లోపల కూర్చొని విండోని వీక్షిస్తున్న ప్రతీది వివరంగా చూపించాడు.
తన తల్లి మొత్తం కుటుంబంలోనే విమానం ఎక్కిన ఏకైక మహిళ అని భావోద్వేగంగా అన్నాడు. ఆమె కూడా తన కొడుకుతో విమానం ఎక్కుతూ భావోద్వేగంగా చుట్టూ పరికిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి వీడియోలో.
ఆమె ఆ ఫ్టైట్‌లో భోజనం తింటూ సిగ్గుపడుతున్న క్షణాలు, కొడుకుని చూస్తూ..తన కల నెరవేర్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్న కమనీయ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఏ తల్లిందడ్రులైనా..ఇంతకు మించి పిల్లల నుంచి ఏమి ఆశించరేమో అనిపిస్తుంది.
(చదవండి: బ్యాండ్ లేదు.. బరాత్ లేదు..సింపుల్‌గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్ జంట)


