భారతదేశ చేనేత వారసత్వాలను కాపాడటానికి అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్‌వోవెన్, నేడు ప్రఖ్యాత నటి శోభితా ధూళిపాళను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది.
ఈ భాగస్వామ్యం గురించి ఆద్యం హ్యాండ్‌వోవెన్ - బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ.. “ఆద్యం ఎల్లప్పుడూ మగ్గం వెనుక ఉన్న వ్యక్తులకు, మన చేతి వృత్తులను రూపొందించే సంస్కృతులకు & అభివృద్ధి చెందుతున్న సంప్రదాయాలకు అండగా నిలుస్తుంది. శోభిత నేటి కాలపు మహిళ, చేనేత వస్త్రాలతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతమైనది.. సహజమైనది. ఆమె మా ప్రచారకర్తగా నిలవటం కొత్త తరం కోసం భారతీయ పనితనంను ప్రతి ఒక్కరూ అభిమానించేలా చేయాలనే మా ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.
శోభితా ధూళిపాల తన సంతోషాన్ని వెల్లడిస్తూ “కళ, భావోద్వేగాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా చేతితో తయారు చేసినప్పుడు, అది దానిని సృష్టించిన వ్యక్తి యొక్క ముద్రను కలిగి ఉంటుంది. నేత సంఘాలతో ఆద్యం చేస్తోన్న కృషి, అన్ని రూపాల్లో సంస్కృతిని వేడుక జరుపుకునే సిద్దాంతంతో కలిపి, ఈ అనుబంధాన్ని నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది..” అని అన్నారు.


