ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ వద్ద దాఖలు
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ వద్ద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లపై అధికంగా వచి్చనట్టు ఆర్‌బీఐ తాజా డేటా తెలియజేస్తోంది.
➤2024–25లో మొత్తం 13,34,244 ఫిర్యాదులు ఆర్‌బీఐ ఇంటెగ్రేటెడ్ అంబుబ్స్‌మన్ వద్ద దాఖలయ్యాయి. 2023–24లో 11,75,075 ఫిర్యాదులు వచ్చాయి. కాకపోతే 2023–24లో 33 శాతం అధిక ఫిర్యాదులతో పోలి్చతే తర్వాతి సంవత్సరంలో తగ్గాయి.
➤సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీఆర్‌పీసీ) 9,11,384 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో 1,08,331 ఫిర్యాదులను దేశవ్యాప్తంగా ఉన్న 24 అంబుడ్స్‌మన్ ఆఫీసులకు బదిలీ చేసింది. 10,589 ఫిర్యాదులను కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ (సీఈపీసీ)కు బదిలీ చేసింది. మిగిలిన 7,76,336 ఫిర్యాదులు నిబంధల ప్రకారం లేనివిగా పరిగణిస్తూ కొట్టివేసింది.
➤2025 మార్చి 31 నాటికి 16,128 ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి.
➤రుణాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత క్రెడిట్‌కార్డులపై ఎక్కువగా ఉన్నాయి.
➤మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు 12.74 శాతం తగ్గాయి.
➤అత్యధికంగా 2,41,601 ఫిర్యాదులు (81.53 శాతం) బ్యాంకులకు సంబంధించి రాగా, 43,864 ఫిర్యాదులు ఎన్‌బీఎఫ్‌సీలకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి.
➤ప్రవేటు బ్యాంకులకు వ్యతిరేకంగా వచి్చన ఫిర్యాదుల్లో 37.53 శాతం పెరుగుదల ఉంది.
➤ప్రభుత్వరంగ బ్యాంకులపై 8.45 శాతం మేర ఫిర్యాదులు తగ్గాయి.


