దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మెటల్ స్టాక్స్ లో బలమైన కొనుగోళ్లు, గ్లోబల్ ర్యాలీతో వరుసగా రెండవ సెషన్ లోనూ లాభాలను విస్తరించాయి. మధ్యాహ్నం 3:30 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 449.53 పాయింట్లు లేదా 0.53 శాతం పెరిగి 85,267.66 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 148.40 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 26,046.95 వద్ద ఉంది.
టాటా స్టీల్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు పతనమయ్యాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం పెరిగాయి. సెక్టార్లలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.63 శాతం పెరిగి టాప్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ గా నిలిచింది. దీంతోపాటు నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, మీడియా సెక్టార్‌లకు నష్టాలు తప్పలేదు.


