మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది | Novo Nordisk launches Ozempic in India against diabetes for Rs 2200 per week entry dose | Sakshi
Sakshi News home page

మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది

Dec 12 2025 3:54 PM | Updated on Dec 12 2025 5:00 PM

Novo Nordisk launches Ozempic in India against diabetes for Rs 2200 per week entry dose

డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ తన బ్లాక్‌బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ డ్రగ్ ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీన్ని అధిక బరువు నియంత్రలో కూడా వాడుతున్నారు. 0.25 మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్‌కు వారానికి రూ. 2,200 ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం  ప్రకటించింది.

ఈ ఔషధం 0.25మి.గ్రా., 0.5 మి.గ్రా,  1 మి.గ్రా మూడు మోతాదు రూపాల్లో లభిస్తుంది నొప్పి లేకుండా సబ్కటానియస్  నోవోఫైన్ నీడిల్స్  ఇంజెక్షన్. ఇది  సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్. ‘ఒజెంపిక్‌’ను మొదటి 4 వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున 0.25 మి.గ్రాతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత కనీసం 4 వారాల పాటు వారానికి ఒకసారి 0.5 మి.గ్రా స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు. లాంగ్‌ డోసేజ్‌ కింద వారానికి ఒకసారి 1 మి.గ్రీ  వరకు తీసుకోవచ్చు.

ఇదీ చదవండి : దీన్ని సివిక్‌ సెన్స్‌ అంటారా..రోడ్డుపై రచ్చ

 మూడు మోతాదుల ఇంజెక్షన్‌గా  ప్రీ-ఫిల్డ్ పెన్ను వస్తుంది. దీని ఖరీదు  నెలకు రూ.8800 (వారానికి రూ.2200),  మరొక డోస్‌ ధర రూ.10,170 (వారానికి రూ.2542.5),  నెలకు రూ.11,175 (వారానికి రూ.2793.75) అవుతుందని కంపెనీ  చెప్పింది.

భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్‌లోనే ఇది అందుబాటులో ఉందన్నారు. ఇదొక కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు. వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ , యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ పేర్కొన్నారు. నిజంగా ఓజెంపిక్‌ను ఈ ధర జోన్‌లోకి తీసుకురావడం చాలా కష్టతర మైందన్నారు. ఇండియాలో వైద్యులు సూచన మేరకు ఎక్కువ మంది  తమ మందును వాడాలని ఆశిస్తున్నామన్నారు.  

దీని వాడకంపై ఆందోళనలు
మానసిక-ఆరోగ్య సవాళ్లు, ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య, విస్తృతమైన ప్రపంచ & భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి ప్రతిసవాళ్లేవీ  లేవని విక్రాంత్ శ్రోత్రియ ప్రకటించారు.

కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్‌ రోగులు అధికంగా ఉన్నారు. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు, వేగంగా అభివృద్ధి చెందుతున్నబరువు తగ్గించే మందుల మార్కెట్‌లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్‌గా ఇండియా మారింది. దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా 150 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement