మౌంజారో జోరు..  | Obesity drug Mounjaro becomes India top-selling in October | Sakshi
Sakshi News home page

మౌంజారో జోరు.. 

Nov 16 2025 5:21 AM | Updated on Nov 16 2025 5:21 AM

Obesity drug Mounjaro becomes India top-selling in October

భారీ స్థాయిలో ఔషధ విక్రయాలు

ఏడు నెలల్లోనే రూ. 333 కోట్ల అమ్మకాలు 

స్థూలకాయాన్ని తగ్గించుకోవడంపై పెరుగుతున్న ఆసక్తే కారణం 

సాక్షి, బిజినెస్‌ డెస్క్: భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలు అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన మౌంజారో (టిర్జెపటైడ్‌) విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే యాంటీబయోటిక్‌ ఆగ్మెంటిన్‌ని మించి ఇది అక్టోబర్‌లో ఏకంగా రూ. 100 కోట్ల అమ్మకాలు సాధించింది.

 ఫార్మా దిగ్గజం ఎలీ లిలీ ఈ ఏడాది మార్చిలో దీన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అక్టోబర్‌ నాటికి సుమారు ఏడు నెలల్లో ఏకంగా రూ. 333 కోట్ల అమ్మకాలు సాధించినట్లు ఫార్మార్యాక్‌ డేటాలో వెల్లడైంది. ఒబేసిటీ సెంటర్లు మొదలైనవి కూడా దీన్ని నేరుగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తుండటంతో ఇది సుమారు రూ. 450 కోట్ల స్థాయిలో ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో దీనికి పోటీగా నోవో నోర్డిస్క్‌ జూన్‌లో ప్రవేశపెట్టిన అమ్మకాలు రూ. 28 కోట్లుగా మాత్రమే నమోదయ్యాయి. 

జనరిక్‌ ఔషధమైన టిర్జెపటైడ్‌ను ఎలీ లిలీ అంతర్జాతీయంగా మోంజారో (టైప్‌ 2 డయాబెటిస్‌కి), జెప్‌»ౌండ్‌ (స్థూలకాయ నియంత్రణకి) పేరిట రెండు బ్రాండ్స్‌గా విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా దీని విక్రయాలు ఇప్పటివరకు 24.8 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. ఫార్మా దిగ్గజం మెర్క్‌ చెందిన క్యాన్సర్‌ ఔషధం కీట్రూడాని కూడా (23.3 బిలియన్‌ డాలర్లు) మించిపోయాయి. స్థూలకాయం, మధుమేహం కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మోంజారో బాగా విజయవంతం అవుతుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ ఈ స్థాయిలో విక్రయాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

ఇండియా కోసం ప్రత్యేక వ్యూహం.. 
మౌంజారోను క్విక్‌పెన్, వయాల్స్‌ రూపంలో ఎలీ లిలీ అంతర్జాతీయంగా విక్రయిస్తోంది.  నెలరోజులకు సరిపడే నాలుగు వారాల డోస్‌ల కింద క్విక్‌పెన్‌ రేటు వయాల్స్‌తో పోలిస్తే అధికంగా ఉంటోంది. ప్రస్తుతం దేశీయంగా డోసేజీని బట్టి వయాల్స్‌ (వారానికి సరిపడే సింగిల్‌ డోస్‌) ధర సుమారు రూ. 3,281 నుంచి ప్రారంభమవుతుండగా, నాలుగు డోస్‌ల ప్యాక్‌గా ఉండే క్విక్‌పెన్‌ రేటు రూ. 13,125 నుంచి మొదలవుతోంది. సింగిల్‌ డోస్‌ రేటు ఒకే రకంగా ఉన్నప్పటికీ క్విక్‌పెన్‌ను ప్యాక్‌గా కొనుక్కోవాల్సి రావడమనేది, కొత్తగా ప్రయతి్నంచి చూద్దాం అనుకునే వారికి కాస్త భారంగా అనిపించవచ్చు.

 పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవైనా వస్తే మిగతా ప్యాక్‌ మొత్తాన్ని పక్కన పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో దీన్ని జోలికి వెళ్లకపోయే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పెన్స్‌ కొరత కూడా నెలకొనడంతో వాటి కోసం వేచి చూస్తూ కూర్చోకుండా ఎలీ లిలీ ముందుగా భారత్‌లో వయాల్స్‌ని ప్రవేశపెట్టింది. అనుకోకుండా ఈ వ్యూహమే భారీగా సక్సెస్‌ అయ్యింది. మొదటిసారిగా ప్రయతి్నద్దామనుకునే వారితో పాటు వైద్యులు కూడా ఒకసారి ప్రయోగాత్మకంగా ప్రిస్రై్కబ్‌ చేసేందుకు అందుబాటు ధరలో లభిస్తుండటం, అటు పోటీ ఔషధం వెగోవీ కేవలం ఖరీదైన పెన్స్‌ రూపంలోనే (డోసేజీని బట్టి సుమారు రూ. 17,345 నుంచి ఉంటుంది) మోంజారోకి కలిసి వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

కీలకంగా భారత్‌ మార్కెట్‌... 
స్థూలకాయాన్ని తీవ్రమైన వ్యాధిగా గుర్తించాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వాలు, హెల్త్‌కేర్‌ సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు ఎలీ లిలీ అండ్‌ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్‌ విన్‌స్లో టకర్‌ ఇటీవల తెలిపారు. భారత్‌ తమకు కీలక మార్కెట్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా మరిన్ని వినూత్న ఔషధాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. యూర్‌పీక్‌ అనే మరో బ్రాండ్‌ పేరిట భారత్‌లో టిర్జెపటైడ్‌ లభ్యతను మరింతగా పెంచే దిశగా దేశీ ఫార్మా దిగ్గజం సిప్లాతో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఎలీ లిలీ చేతులు కలిపింది. డాక్టర్ల ప్రి్రస్కిప్షన్‌లతో రిటైల్‌ అమ్మకాలకు కాస్మెటాలజిస్టులు, ఒబేసిటీ సెంటర్లు సైతం నేరుగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేస్తుండటం సైతం మౌంజారో భారీ విక్రయాలకు కారణంగా నిలుస్తోంది. 

ఫైజర్‌ 10 బిలియన్‌ డాలర్ల డీల్‌.. 
స్థూలకాయ నియంత్రణ ఔషధాలకి భారీగా డిమాండ్‌ నెలకొనడంతో ఈ విభాగంలో డీల్స్‌ కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. వెయిట్‌–లాస్‌ ఔషధాల పోటీలో కాస్త వెనుకబడిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కూడా పరుగు ప్రారంభించింది. తాజాగా ప్రత్యర్థి సంస్థ నోవో నార్డిస్క్‌తో పోటీ పడి మరీ మెట్‌సెరా అనే స్టార్టప్‌ సంస్థను కొనుగోలు రేసులో విజేతగా నిలి్చంది. ఒబేసిటీ ఔషధాలను తయారు చేస్తున్న మెట్‌సెరా కొనుగోలు కోసం ఏకంగా 10 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం మెట్‌సెరా ఔషధాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఫైజర్‌ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తుండటమనేది ఈ విభాగంలో ఉత్పత్తులకు నెలకొన్న డిమాండ్‌ని సూచిస్తోందని విశ్లేషకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement