దీన్ని సివిక్‌ సెన్స్‌ అంటారా..రోడ్డుపై రచ్చ | Civic sense is a rare luxury in India Couple cooks meal on highway viral video | Sakshi
Sakshi News home page

దీన్ని సివిక్‌ సెన్స్‌ అంటారా..రోడ్డుపై రచ్చ

Dec 12 2025 3:08 PM | Updated on Dec 12 2025 3:27 PM

Civic sense is a rare luxury in India Couple cooks meal on highway viral video

రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనల్ని ఇండియాలో  చాలామందివాహనదారులు అస్సలు లెక్క చేయరు.. ఫ్రీ లెఫ్ట్‌ వదిలేయండి.. దాన్ని ఆక్రమిస్తే జరిమానా అని  స్వయంగా  ట్రాఫిక్‌ అధికారులు హెచ్చరిస్తున్నా సరే అస్సలు పట్టించుకోరు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ముందుకు పోతారు. ట్రాఫిక్‌ని జాం చేస్తారు. మరికొంతమంది సోషల్‌ మీడియా, రీల్స్‌ పిచ్చోళ్లు ఉంటారు. మినిమం సివిక్‌ సెన్స్‌ పాటించకుండా రోడ్డు మధ్యలోనే షూటింగ్‌ లంటూ, పిచ్చి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తూ ఉంటారు. 

ఇపుడు రహదారిపై కనీస మర్యాద పాటించని జంట గురంచి తెలుసుకుందాం. వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది.  హైవే మధ్యలో హాయిగా భోజనం తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పౌరుల రోడ్డు మర్యాదలు, భద్రతా అవగాహనపై కొత్త విమర్శలకు తావిస్తోంది.

నలంద ఇండెక్స్ ద్వారా X హ్యాండిల్ పోస్ట్  చేసిన ఈ వీడియోలో  తమ కారు రోడ్డు పక్కన పార్క్‌ చేసి వంట చేయడాన్ని చూడొచ్చు.  సిలిండర్‌,  వంటపాత్రలు, కూరగాయలు, కిరాణా  సరుకులు  సంచులను రోడ్డుపై చెల్లాచెదురుగా  పడవేసిన వైనం నెట్టింట చర్చకు దారితీసింది.

ఇండియాలో సివిక్‌ సెన్స్‌ అనేది చాలా అరుదు. ఉదాహరణకు  ఇక్కడ  చూడండి : ఒక కుటుంబం రోడ్డు మధ్యలో వంట మొదలు పెట్టేసింది. అక్కడంతా చిరాకు చేసి పడేసింది అని క్యాప్షన్‌తో  ఈ వీడియో పోస్ట్‌ అయింది. అయితే ఇదే విషయంపై ఇలారోడ్డుపై వంట చేయడం, ప్రాణాలకు ప్రమాదం కదా ఆమెను ప్రశ్నిస్తే.. ఆ మహిళ ఎలాంటి సంకోచం లేకుండా  ఇలా సమాధానం ఇచ్చింది “మేము రోడ్డు పక్కన వంట చేయకూడదని కూడా మాకు తెలుసు,కానీ అది రోడ్డు (ఎదురుగా ఉన్న లేన్ వైపు చూపిస్తూ) అని చెప్పింది. ఇది  సర్వీసు  రోడ్డు విశ్రాంతి ప్రాంతం. ఈ ప్లేస్‌ విశ్రాంతి, వంట కోసం ఉద్దేశించబడింది.” అని సమాధానం చెప్పింది తాపీగా చపాతీలు చేస్తూ. పక్కనే ఒక  చిన్నారిని కూడా  గమనించవచ్చు.

ఈ వీడియో విభిన్న వాదనలకు ఆజ్యం పోసింది. ఇలాంటి వాళ్లని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించి జరిమానా విధించాలి, ఇది ఆమోదయోగ్యం కాదు అని,  ఇలా  రోడ్డు వంట చేసుకొని తినడం ప్రజా స్థలాన్ని  ఇతరులకు ఆరోగ్యం, భద్రతా సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆ రహదారి గుండా ఏవాహనాలు పోవడం లేదు కదా, అందుకే ఆ జంట అలా చేసిందని మరికొందరు  సమర్ధించారు. ఇలాంటి కుటుంబాలకు సరియైన స్థలాన్ని, సపోర్ట్‌ అందించాలని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement