‘మా పిల్లలను స్కూలుకు పంపించం' | Kolkata Couple Choose Unschooling For Their Kids to Teach Through Real Life Experiences, Read Story Inside | Sakshi
Sakshi News home page

‘మా పిల్లలను స్కూలుకు పంపించం': అన్‌స్కూలింగ్‌ సిద్ధాంతం...

Dec 11 2025 11:18 AM | Updated on Dec 11 2025 12:47 PM

Kolkata couple decides to never send kids to school Goes Virla

తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూలుకు పంపాలనుకోవడం సహజం. అయితే ఈ కోల్‌కతా దంపతులు మాత్రం ‘మా పిల్లలను స్కూలుకు పంపించం గాక పంపించం’ అంటున్నారు. వీరి ‘అన్‌స్కూలింగ్‌’ సిద్ధాంతం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ దంపతుల దృష్టిలో సంప్రదాయ విద్య అనేది...వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌!

సంప్రదాయ బడుల కంటే ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌’ ద్వారా తమ పిల్లలకు చదువు చెప్పడానికి రంగంలో దిగారు. ట్రావెల్, నేచర్‌ వాక్స్, వర్క్‌షాప్స్, హ్యాండ్స్‌–ఆన్‌ యాక్టివిటీల ద్వారా తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. విద్యాబోధనలో కొత్తదారిలో ప్రయాణిస్తున్న ఈ తల్లిదండ్రుల గురించి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెనర్‌–నటి షెనాజ్‌ ట్రెజరీ ఒక వీడియోను షేర్‌ చేసింది.

ట్రావెలింగ్‌ ద్వారా పిల్లలు చరిత్రను బాగా అర్థం చేసుకుంటారని, పిల్లలకు ఇష్టమైన క్రికెట్‌ ద్వారా కూడా వారికి కష్టమనిపించే గణితాన్ని సులభంగా నేర్పించవచ్చనీ అంటున్నారు. సంప్రదాయ కెరీర్‌ మార్గాలలో వెళ్లడం కంటే తమ పిల్లలను ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా చూడాలని వీరు కోరుకుంటున్నారు.

‘స్కూలుకు వెళ్లే విద్యార్థులు నేర్చుకోవడం కంటే ఎక్కువగా అలసిపోతున్నారు. అందుకే మేము అన్‌స్కూలింగ్‌ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాం. నిర్మాణాత్మక పాఠ్యాంశాలు కాకుండా పిల్లలు ఆసక్తి చూపించే అభ్యాస విధానం మంచిది. పాఠశాల విద్యతో పోల్చితే ఇంటి విద్యలో పేరెంట్స్‌ బాగా ఇన్‌వాల్వ్‌ అవుతారు’ అన్నారీ దంపతులు.

ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ‘నేను కూడా మీ మార్గాన్నే అనుసరిస్తున్నాను’ అని స్పందించారు సెలబ్రిటీ సారా అఫ్రీన్‌ ఖాన్‌.‘సంప్రదాయ పాఠశాల విద్య పక్కా వ్యాపారంగా మారినప్పుడు అన్‌స్కూలింగ్‌ అనుసరించదగిన మార్గం’ అని మరొకరు స్పందించారు.

కొందరు మాత్రం ఇలా స్పందించారు...
‘తోటివారితో ఎలా మెలగాలి... ఇంకా ఇతర సామాజిక సంబంధాలను అవగాహన చేసుకోవడం అనేది అన్‌స్కూలింగ్‌ ద్వారా సాధ్యపడదు. స్కూలు అనేది మినీ సమాజం. అక్కడ భవిష్యత్‌కు సంబంధించి ఎన్నో విషయాలను పిల్లలు సహజంగానే నేర్చుకోగలుగుతారు. బాల్య స్నేహలకు సంబంధించి మధుర జ్ఞాపకాలకు అన్‌స్కూలింగ్‌లో అవకాశం లేదు’.

 

(చదవండి: తస్మాత్‌ జాగ్రత్త..! బాడీబిల్డర్‌లు కండలు ముఖ్యమే కానీ..)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement