సర్క్‌స్‌లోనూ, పార్క్‌ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్ఫులగా ఉండాలి. లేదంటే ఈ కీపర్‌కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ సఫారీ పార్క్‌లో జంతువుల సర్కస్‌కి సంబంధించి లైవ్ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్‌ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు.
కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్‌లోకి తరలించారు. అది జూకీపర్ సంచి నిండా యాపిల్స్, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు.
ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
A zoo handler was briefly attacked by a black bear during a performance at Hangzhou Safari Park. The worker is safe, the bear has been removed from public shows, and officials say smell of treats may have triggered the animal’s reaction. pic.twitter.com/qtI38aBV0B
— Open Source Intel (@Osint613) December 7, 2025
(చదవండి: షీస్ ఇండియా షో..)


