రావోయి మా ఇంటికీ... టీ ఉన్నది... గరం గరం ఫుడ్‌ ఉన్నది! | US vlogger visits remote Himalayan village | Sakshi
Sakshi News home page

రావోయి మా ఇంటికీ... టీ ఉన్నది... గరం గరం ఫుడ్‌ ఉన్నది!

Dec 7 2025 1:20 PM | Updated on Dec 7 2025 1:31 PM

US vlogger visits remote Himalayan village

‘అతిథి దేవోభవ’ అనే మాటకు కేరాఫ్‌ అడ్రస్‌ మన దేశం. ఈ మాటను మరోసారి నిజం చేసే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో రెండు మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అమెరికన్‌ వ్లోగర్‌ మాల్వీనా హిమాలయ ప్రాంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఎవరూ పరిచయం లేక΄ోయినా, ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు గొప్ప ఆతిథ్యం దొరికింది. 

తమకు వచ్చిన ఇంగ్లీష్‌లోనే... ‘ప్లీజ్‌ డ్రింక్‌ టీ’ అన్నారు. ‘ప్లీజ్‌ టేక్‌ ఫుడ్‌’ అన్నారు. వీడియోలో... మాల్వీనా ఒక వృద్ధురాలిని పలకరిస్తుంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత మాల్వీనా బయలు దేరేముందు ‘భోజనం చేసి వెళ్లు’ అని పట్టుబడుతూ ఆ బామ్మ ఒకటికి రెండుసార్లు అడగడం నెటిజనులను కదిలించింది. ‘భోజనం వద్దు టీ చాలు’ అని అడిగింది మాల్వీనా. ఆప్యాయత, అనురాగాల రుచుల ఆ టీ ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? ఏమంటారు మాల్వీనా! 

(చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్‌ మాములుగా లేదుగా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement