న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, భారీ విమానాల రద్దు, నియంత్రణ చర్యలు లాంటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.వందలాది విమానాలను రద్దు చేసిన అనేకమంది ప్యాసెంజర్లను చెప్పరాని ఇక్కట్ల పాలు చేసింది. ప్రయాణీకులకు రద్దు చేసిన టికెట్ల ఫీజును పూర్తిగా వాపసు చేయడంతోపాటు, వారి లగేజీని సురక్షితంగా అందించాల్సిన బాధ్యత కూడా ఇండిగోదేనని విమానయాన శాఖ స్పష్టం చేసింది. లేని పక్షంలో నియంత్రణ సంస్థ చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.
ఈ పరిణామాలతో దిగి వచ్చిన ఇండిగో ప్రయాణీకులకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత చర్యకు ఉపక్రమించింది. ఈ క్రమంలో రూ.827 కోట్ల విలువైన టిక్కెట్లను తిరిగి చెల్లించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు 2 వారాల్లో రూ.827 కోట్లు ఇండిగో తిరిగి చెల్లించింది. అలాగే 9,000 బ్యాగుల్లో 4,500 తిరిగి ఇచ్చింది. నవంబర్ 21, డిసెంబర్ 7 మధ్య క్యాన్సిల్ 9,55,591 టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 1- 7తేదీల మధ్య రూ.569 కోట్ల విలువైన దాదాపు ఆరు లక్షల టిక్కెట్ల రద్దు సొమ్మును తిరిగి చెల్లించినట్లు వారు తెలిపారు. 9వేల బ్యాగుల్లో దాదాపు 4,500 కూడా వినియోగదారులకు డెలివరీ చేశారు. రాబోయే 36 గంటల్లో బ్యాలెన్స్ బ్యాగులను డెలివరీ చేయనున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం 138 గమ్యస్థానాలకు గాను 137 విమానాలకు 1,802 విమానాలను నడపాలని యోచిస్తోంది.
ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్


