ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.
గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు.


