ఇకముందు... ‘కుక్కలు ఏం చేస్తాయి?’ అనే ప్రశ్నకు– ‘ఇంటికి కాపలా కాస్తాయి’ అనే ఏకైక సమాధానం మాత్రమే వినిపించక΄ోవచ్చు. ‘ఇంకా ఎన్నో చేస్తాయి’ అని చెప్పవచ్చు. కుక్కలను మరింతగా ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే... డాగోసోఫీ బటన్. గృహోపకరణాలను శునకం నియంత్రించడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది.
కుక్కలు తమ యజమానులకు మరిన్ని ఇంటి పనులలో సహాయం చేయడానికి వీలుగా యానిమల్–కంప్యూటర్ ఇంటరాక్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న అప్లికేషన్‌ను రిసీవర్‌లో ప్లగ్ చేయాలి. తద్వారా ఫ్యాన్ ఆన్‌చేయడం, లైట్ ఆఫ్ చేయడం... మొదలైన వాటికి డాగోసోఫీ బటన్ ఉపయోగపడుతుంది.
నీలి, తెలుపు రంగులో ఉన్న డోగోసోఫీ బటన్‌ను శునకానికి కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ బటన్ చాలా సున్నితంగా ఉంటుంది. కుక్క తన ముక్కుతో బటన్‌ను తట్టడంతో అది యాక్టివేట్ అవుతుంది.
ఇలా చేయడానికి శునకానికి కొంత శిక్షణ అవసరం ‘డాగోసోఫీ ఈ పరికరాలను మాత్రమే, ఇంత సంఖ్యలో మాత్రమే నియంత్రిస్తుందనే పరిమితి లేదు. మీ సృజనాత్మకతతో ఎన్ని పరికరాలైనా నియంత్రించేలా శునకానికి శిక్షణ ఇవ్వవచ్చు’ అంటున్నారు డాగోసోఫీ రూపకర్తలు.
(చదవండి: మలబద్ధకం నివారణ కోసం..! ఈట్ ఫ్రూట్)


