అమ్మ అంటేనే ఓ భావోద్వేగం. సృష్టికి ప్రతిరూపం, ప్రతక్ష దైవం అమ్మే..అలాంటి అమ్మ జన్మదినోత్సవాన్ని ఏ పిల్లలైన చక్కగా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. మహా అయితే కేక్ కటింగ్ లేదా ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేయడమో చేస్తాం. కానీ ఈ ఎంటర్‌ప్రెన్యూర్ వాళ్ల అమ్మ బర్త్‌డేని ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేశాడంటే..అది పెళ్లా లేక మరేదైనా..అని ఫీల్ వస్తుంది.
ఆ రేంజ్‌లో అదిరిపోయేలా సెలబ్రేట్ చేశాడు ఆ కుమారుడు. ఆ వేడుకకు వచ్చిన వారంతా గొప్ప కొడుకు అంటూ మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ కుమారుడే ఆకాశ్ మెహాతా. తన 60 ఏళ్ల తల్లి చేతనా మెహతా పుట్టిరోజుని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేశాడంటే..ఏదో పెళ్లి వేడుక అనుకునేలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు.
ఆ వీడియో క్లిప్‌లో నాలుగు భాగాల గ్రాండ్ వేడుకలు కనిపిస్తాయి. ఇందులో భక్తి, సంగీతం, ఎడారి సఫారీ, తదితర పలు విలాసవంతమైన పార్టీలతో సన్నిహితులు, బంధువర్గం ఆశ్చర్యపోయేలా జరిపాడు.
అందరూ ఇది పుట్టినరోజు వేడుకలా లేదు, ఏదో పెళ్లికి వచ్చినట్లుగా ఉంది మాకు అంటూ ఆకాశ్ మెహాతాను మెచ్చుకున్నారు. అంతేగాదు అందరికీ నీలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండును అని ప్రశంసించారు కూడా. అందుకు సంబంధించని వీడియోని ఆకాశ్ మెహతా షేర్ చేసతూ పోస్టులో ఇలా రాశారు.
"నా ప్రాణ స్నేహితురాలికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మాటలకు మించి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ హార్ట్ ఎమోజీలను జోడించారు". ఇక నెటిజన్లు సైతం ఆ వీడియోని చూసి..అందమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షంలు. బర్త్‌డేని ఓ గొప్ప వేడుకలా చేశారంటూ ఆకాశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
(చదవండి: సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..)


