రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే.


