వందేళ్ల ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'షనెల్‌' ప్రత్యేకతలివే..! | Model Bhavitha Mandava chanel event: It is a French luxury fashion house | Sakshi
Sakshi News home page

Bhavitha Mandava: వందేళ్ల ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'షనెల్‌' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..

Dec 7 2025 12:00 PM | Updated on Dec 7 2025 4:21 PM

Model Bhavitha Mandava chanel event: It is a French luxury fashion house

మన హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్లిన భవిత మండవ అనే అమ్మాయి మోడలింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్‌లో ర్యాంప్‌ను ఓపెన్ చేసి ఫ్యాషన్‌ ప్రపంచంలో కొత్త స్టార్‌గా నిలిచింది. ర్యాంప్‌ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్‌గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్‌ చేయడం. ఒక తెలుగమ్మాయి ఈ ఘనతను సాధించడంతో ఒక్కసారిగా ఏంటీ షనెల్‌ మోతీర్స్‌ దార్‌ షో, దాని స్పెషాలిటీ గురించి ఆరాలు మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'షనెల్‌' ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందామా..

మెతీర్స్ దార్ (Métiers d'Art) అంటే  ఫ్రెంచ్ భాషలో దీని అర్థం "కళల లేదా హస్తకళలు". ఈ ఫ్యాషన్‌ షోను షనెల్‌ నిర్వహిస్తోంది. 

ఈ ఫ్యాషన్‌ షో ప్రత్యేకత..
సంప్రదాయ హస్తకళల నైపుణ్యాలను, వాటిని సృష్టించే కళాకారుల గురించి  ప్రపంచానికి పరిచయం చేయడం, వాటికి గుర్తింపు తీసుకురావడమే ఈ షో ప్రధాన ముఖ్యోద్దేశం. ఇక ఈ షోలో అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఫెదర్ వర్క్, జ్యువెలరీ, లెదర్ వర్క్ వంటి కలెక్షన్లను ప్రదర్శిస్తారు.

 

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్‌..
షనెల్‌ అనేది 1910లో ఫ్రెంచ్‌ మహిళా ఫ్యాషన్‌ డిజైనర్‌ గాబ్రియెల్ కోకో షనెల్‌ స్థాపించిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది మహిళల శైలిలో చక్కదనం, సరళత, కాలాతీత డిజైన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం తదితరాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. దీన్ని 1910లో పారిస్‌, ఫ్రాన్స్‌ దేశాలలో ఈ షెనల్‌ బ్రాండ్‌ని స్థాపించారు ఫ్రెంచ్‌ మహిళా డిజైనర్‌ కోకో. 

దీని ప్రధాన కార్యాలయం లండన్‌. దీనికి ప్రపంచవ్యాప్తంగా బోటిక్‌లు కూడా ఉన్నాయి. ఇది హాట్‌ కోచర్‌ , రెడీ టు వేర్‌ దుస్తులు, హ్యాండ్‌ బ్యాగులు, పలు ఫ్యాషన్ ఉపకరణాలు, వాచ్‌లు, చక్కటి ఆభరణాలు, పెర్ఫ్యూమ్‌ తదితర సౌందర్య సాధానాలను ప్రమోట్‌ చేస్తుంది. 

ఈ బ్రాండ్‌ ఐకానిక్‌ క్రియేషన్స్‌..

  • చానెల్ నం. 5 పెర్ఫ్యూమ్ (1921) - ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ సువాసనలలో ఒకటి.

  • చానెల్ సూట్ - మహిళలకు ఆధునిక చక్కదననానికి సింబల్‌

  • ది లిటిల్ బ్లాక్ డ్రెస్ - ఫ్యాషన్‌లో ప్రధానమైనదిగా మారిన కోకో చానెల్ ఆవిష్కరణ.

  • 2.55 హ్యాండ్‌బ్యాగ్ - చైన్ స్ట్రాప్‌తో క్విల్టెడ్ లెదర్, ఇప్పటికీ ప్రపంచం మెచ్చిన హ్యాండ్‌బ్యాగ్‌గా పేరుతెచ్చుకుంది.

ప్రత్యేకతలు..
ఫ్యాషన్‌లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలను స్వేచ్ఛగా తమ ఫ్యాషన్‌ను వ్యక్తపరిచే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే సౌకర్యవంతంగా దుస్తులన ధరించడాన్ని పరిచయం చేసింది. ఇది ఆధునాతనకు పెద్దపీట వేస్తూనే..సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే గాక సాధికారతను కూడా సూచించింది. 

అంతేగాదు ఎంబ్రాయిడీరీ, ప్లీటింగ్‌ నగల తయారీతో కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైనే బోటిక్‌లతో త్వరితగతిన అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్రాండ్‌లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్రాండ్‌ సీఈవో లీనా నాయర్‌ మన భారతీయ మూలాలకు చెందినవాడు కావడం విశేషం. క్రియేటివ్‌ డైరెక్టర్‌ మాథ్యూ బ్లేజీ తన సృజనాత్మక ఫ్యాషన్‌ ఆవిష్కరణలతో ఈ షనెల్ ప్రభావాన్ని మరింత విస్తరింప చేస్తూనే ఉన్నారు. 

 

 

(చదవండి: అంతర్జాతీయ మోడల్‌గా హైదరాబాదీ.. ట్రెండింగ్‌లో భవితా మండవ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement