breaking news
hand art
-
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
మన హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిన భవిత మండవ అనే అమ్మాయి మోడలింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్లో ర్యాంప్‌ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్‌గా నిలిచింది. ర్యాంప్‌ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్‌గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడం. ఒక తెలుగమ్మాయి ఈ ఘనతను సాధించడంతో ఒక్కసారిగా ఏంటీ షనెల్ మోతీర్స్ దార్ షో, దాని స్పెషాలిటీ గురించి ఆరాలు మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందామా..మెతీర్స్ దార్ (Métiers d'Art) అంటే ఫ్రెంచ్ భాషలో దీని అర్థం "కళల లేదా హస్తకళలు". ఈ ఫ్యాషన్ షోను షనెల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్ షో ప్రత్యేకత..సంప్రదాయ హస్తకళల నైపుణ్యాలను, వాటిని సృష్టించే కళాకారుల గురించి ప్రపంచానికి పరిచయం చేయడం, వాటికి గుర్తింపు తీసుకురావడమే ఈ షో ప్రధాన ముఖ్యోద్దేశం. ఇక ఈ షోలో అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఫెదర్ వర్క్, జ్యువెలరీ, లెదర్ వర్క్ వంటి కలెక్షన్లను ప్రదర్శిస్తారు. View this post on Instagram A post shared by Bhavitha Mandava (@bhavithamandava) వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్..షనెల్ అనేది 1910లో ఫ్రెంచ్ మహిళా ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్ కోకో షనెల్ స్థాపించిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది మహిళల శైలిలో చక్కదనం, సరళత, కాలాతీత డిజైన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం తదితరాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. దీన్ని 1910లో పారిస్, ఫ్రాన్స్ దేశాలలో ఈ షెనల్ బ్రాండ్‌ని స్థాపించారు ఫ్రెంచ్ మహిళా డిజైనర్ కోకో. దీని ప్రధాన కార్యాలయం లండన్. దీనికి ప్రపంచవ్యాప్తంగా బోటిక్‌లు కూడా ఉన్నాయి. ఇది హాట్ కోచర్ , రెడీ టు వేర్ దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, పలు ఫ్యాషన్ ఉపకరణాలు, వాచ్‌లు, చక్కటి ఆభరణాలు, పెర్ఫ్యూమ్ తదితర సౌందర్య సాధానాలను ప్రమోట్ చేస్తుంది. ఈ బ్రాండ్ ఐకానిక్ క్రియేషన్స్..చానెల్ నం. 5 పెర్ఫ్యూమ్ (1921) - ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ సువాసనలలో ఒకటి.చానెల్ సూట్ - మహిళలకు ఆధునిక చక్కదననానికి సింబల్ది లిటిల్ బ్లాక్ డ్రెస్ - ఫ్యాషన్‌లో ప్రధానమైనదిగా మారిన కోకో చానెల్ ఆవిష్కరణ.2.55 హ్యాండ్‌బ్యాగ్ - చైన్ స్ట్రాప్‌తో క్విల్టెడ్ లెదర్, ఇప్పటికీ ప్రపంచం మెచ్చిన హ్యాండ్‌బ్యాగ్‌గా పేరుతెచ్చుకుంది.ప్రత్యేకతలు..ఫ్యాషన్‌లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలను స్వేచ్ఛగా తమ ఫ్యాషన్‌ను వ్యక్తపరిచే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే సౌకర్యవంతంగా దుస్తులన ధరించడాన్ని పరిచయం చేసింది. ఇది ఆధునాతనకు పెద్దపీట వేస్తూనే..సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే గాక సాధికారతను కూడా సూచించింది. అంతేగాదు ఎంబ్రాయిడీరీ, ప్లీటింగ్ నగల తయారీతో కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైనే బోటిక్లతో త్వరితగతిన అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్రాండ్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్రాండ్ సీఈవో లీనా నాయర్ మన భారతీయ మూలాలకు చెందినవాడు కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ తన సృజనాత్మక ఫ్యాషన్ ఆవిష్కరణలతో ఈ షనెల్ ప్రభావాన్ని మరింత విస్తరింప చేస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by @ideservecouture (చదవండి: అంతర్జాతీయ మోడల్‌గా హైదరాబాదీ.. ట్రెండింగ్‌లో భవితా మండవ) -
కదిలే బొమ్మాళీ
ఎంటర్టెయిన్మెంట్ కోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై డిపెండ్ అవుతున్న రోజుల్లో తోలుబొమ్మలాటలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే! లామకాన్‌లో జరిగిన ఈ పప్పెట్ షో చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు. అనంతపురం నుంచి వచ్చిన ‘వినాయక తోలుబొమ్మలాట’ కళాకారుల బృందం ఇక్కడ లంకిణి శాప విమోచనం, రామరావణయుద్ధం ప్రదర్శించింది. ప్రతి పాత్రను సజీవంగా చూపించిన తోలుబొమ్మలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తోలుబొమ్మలాటలో తెరపై కదిలే బొమ్మలను మాత్రమే చూస్తాం. కానీ దానికోసం తెరవెనుక చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. బొమ్మలు తయారు చెయ్యటం నుంచి రంగులు వెయ్యటం, ఆట మొదలు పెట్టిన తర్వాత సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం.. ఇలా వివిధ కళల సమాహారం. ప్రేక్షకుడి అభిరుచిని బట్టి తనకు నచ్చిన అంశాన్ని ఆస్వాదించే అవకాశం వుంటుంది. అలనాడు ఆముదం దీపాలు, కాగడాల మధ్య ప్రదర్శించిన ఈ ఆటకొంతకాలం పెట్రోమ్యాక్స్ లైట్ల సాయంతో వెలిగింది. ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని లైటింగ్, సౌండ్ పద్ధతులను కూడా అడాప్ట్ చేసుకుంది. నైపుణ్యం కావాలి... తోలుబొమ్మల రూపు రేఖలు, రంగులు, వాటిపై నగిషీ... అన్నీ నిపుణతతో కూడుకున్న అంశాలు. 20 నిముషాల పాటు వున్న ఈ రెండు ప్రదర్శనల్లో 40కు పైగా బొమ్మల్ని వాడారు. ‘జంతు చర్మంతో చేసే ఈ బొమ్మల తయారీకి ఒక నెల సమయం పడుతుంది’ అంటున్నాడు కళాకారుడు శివరాం. శివరాత్రి, దసరా, వినాయకచవితి సందర్భాల్లో వారం రోజులు రాత్రంతా మహాభారత, రామాయణ గాథలు ప్రదర్శించే వాళ్లు. అలా చాలా సేపు సాగే ప్రదర్శనల్లో పద్యం, సూక్తులు, ఊళ్లో వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచిచెడుల సూచనలు, కేతిగాడు, రంగి లాంటి హాస్యపాత్రల ద్వారా కానుకలు ఇచ్చిన వారికి పొగడ్తలు, ఇవ్వని వారికి తెగడ్తలతో కూడిన హాస్య సంభాషణలు వుండేవి. ‘ఈ రోజుల్లో అంత వ్యవధి కష్టం కాబట్టి వాటిని కుదించి గంట, రెండుగంటలకు పరిమితం చేస్తున్నాం’ అని చెబుతున్నాడు కళాకారుడు సిందే గంగిశెట్టి. తాతల కాలం నుంచి వస్తున్న ఈ కళకు ఎక్కువ ఆదరణ లేక... తమ పిల్లలు తోలుబొమ్మలాటను నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చటం లేదని ఆవేదన చెందుతోంది కళాకారిణి వనారస వీరమ్మ. పెళ్లిళ్లు, పుట్టినరోజులకు ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే తమకు ఇంత అన్నం పెట్టిన వారవుతారు, కళను కాపాడినవారవుతారని అంటోందామె. రామాయణ, మహాభారత గాథలను నేటికీ పల్లెపదాలతో పదిలంగా పంచుతున్న కళారూపాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది. ఆకట్టుకుంటాయి... ‘అచ్చమైన తెలుగు భాషే అర్థం కాదు ఇక ఈ పద్యాలు ఎలా అర్థమవుతాయని అని వాపోతుంటారు కొందరు. చక్కని పద్యాన్ని గానం చేసే స్థాయి కళాకారులకు వుంది. ఆ పద్యాన్ని అర్థం చేసుకునే భాషా స్థాయి పెంపొందించుకోవటం ప్రేక్షకుల పని. కొన్ని తరాలుగా ఒక సంస్కృతిని కాపాడుతూ వస్తున్న వాళ్లు తమ భాషను మార్చుకోవలసిన పనిలేదు. మాతృభాషలో నాలుగు మాటలు అర్థం చేసుకోలేని దురవస్థ ప్రేక్షకుడిదే అవుతుంది కానీ కళాకారుడిది కాదు’ అంటున్నారు రీసెర్చ్ స్కాలర్, పప్పెటీర్ గంజి మాధవీలత. ‘తలను గిర్రున రౌండ్‌గా తిప్పే గ్రాఫిక్స్ రోబో పిల్లలకు బాగా నచ్చాడు. అలాంటి చిట్టిపొట్టి బొమ్మలే లైవ్‌లో ఆడుతూ పాడుతూ, డైలాగ్‌లు చెప్తూ ఉంటే పిల్లలను ఆకట్టుకోకుండా ఎందుకుంటాయి. పిల్లలకు మనం చూపించక పోవటం వల్ల ఈ కళలకు దూరం అవుతున్నారు కానీ, ఆకట్టుకునే శక్తి లేక కాదు’ అంటున్నారు ఓ చిన్నారి పేరెంట్ కవిత.


