ఇంటికి అందం గృహోపకరణం. ఆ గృహోపకరణాన్ని ఆకర్షణీయమైన డిజైన్‌గా రూపొందిస్తే అది ద్విగుణీకృతమవుతుంది. అలాంటి వాటిని ‘లెదర్’తో తయారు చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు రాయదుర్గంలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ–హెచ్) హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. తమ సెమిస్టర్‌లో భాగంగా ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులు ఎఫ్‌డీడీఐ–హెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. తేజ్‌లోహిత్ రెడ్డి చొరవ, ఫ్యాకల్టీ ప్రతినిధుల ప్రోత్సాహంతో వీటిని తయారు చేశారు.
బెడ్ ల్యాంపులు, గోడకు వేలాడదీసే ల్యాంప్‌లలో వాడిన లెదర్‌పై రకరకాల చిత్రాలు వేసి అందులో అమర్చిన ల్యాంప్ వెలిగిస్తే రంగు రంగుల చిత్రం చూడచక్కగా కనిపిస్తూ విద్యార్థుల ప్రతిభకు పట్టం టడుతోంది.
గోడకు, ఇంటి ముందు వేలాడ దీసేలా ల్యాంప్‌లకు చుట్టూరా లెదర్‌ను అమర్చి దానికి రంగులు వేయడంతో ‘ట్రెండీ’గా కనిపిస్తోంది.
(చదవండి: జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్‌లు కూడా..)


