
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్ తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్‌తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..
ఆహ్లాదకరమైన ప్రకాశం: ఆధునికమైన, విలాసవంతమైన టచ్ కోసం వెచ్చని ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. ఇంటి లోపల, మెట్ల భాగంలో ఈ లైట్లను ఏర్పాటు చేస్తే అధిక విద్యుత్తు ఖర్చు కాకుండానే పరిసరాలను ఆహ్లాదకరంగా, కాంతివంతం చేస్తాయి.
లైట్ల తోరణం: ప్రకాశవంతమైన తోరణాన్ని గుమ్మానికి ఏర్పాటు చేస్తే, పండగ ముంగిట్లోకి ఇట్టే వస్తుంది. ఇక సిల్క్ టాసెల్స్, పూసలు లేదా ఫెయిరీ లైట్లతో కూడిన స్ఫటికాలనూ ఎంచుకోవచ్చు, ఇది సంప్రదాయాన్ని అధునాతనంగా చూపడంతో పాటు అతిథుల స్వాగతానికి అందమైన కాంతిని అందిస్తుంది.
పేపర్ లాంతర్లు: రంగు రంగుల కాగితపు పొరలతో చేసే ఈ లాంతర్లు కాంతిని వినూత్నంగా వెదజల్లుతుంటాయి. ఈ లాంతర్లు బాల్కనీలు, ఇంటి ముందు వసారాలాంటి స్థలాల్లో వేలాడదీయాలి. మెటాలిక్ గోల్డ్, క్రీమ్ లేదా పేస్టెల్ షేడ్స్‌లో వీటిని మనమే తయారు చేసుకోవచ్చు.
కొవ్వొత్తి స్టాండ్‌లు: కలప, ఇత్తడి లేదా పాలరాతి శిల్పాకృతులను పోలి ఉండే కొవ్వొత్తి స్టాండ్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి వెదజల్లే అందం ఇంటికి మెరుపును తీసుకువస్తుంది. పండుగ వాతావరణానికి ఈ కొవ్వొత్తుల స్టాండ్లు మేలైన ఎంపిక. వారసత్వంగా వస్తున్న కొన్ని గృహాలంకరణ వస్తువులను, తిరిగి బాగు చేయించి కొవ్వొత్తుల స్టాండులుగా ఉపయోగించవచ్చు.
మట్టి దీపాలు: టెర్రకోట దీపాలు ఆధునిక ఇంటీరియర్‌లను వారసత్వ సౌందర్యానికి అనుసంధానిస్తాయి. విలాసవంతమైన టచ్ కోసం వాటిని హైలైట్ చేయవచ్చు. వీటిని కిటికీలు, బాల్కనీలు, లివింగ్‌రూమ్‌లు, ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా తయారు చేసుకొని, ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మేలు చేసేవే కాదు, రీ సైక్లింగ్ పద్ధతుల వల్ల కూడా మేలైన ఫలితాలను పొందవచ్చు.
ఎన్నార్