
తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్‌కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని తెలిపారు.
ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్‌పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు.
దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్‌కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్‌ఎంఎస్‌లు, 6నెలల పాటు బైటీవీ సబ్‌్రస్కిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సది్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు.