ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.
28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.
Study, Stream, Succeed with #BSNL !
Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu— BSNL India (@BSNLCorporate) November 15, 2025


