కొంతమంది భక్తులు.. తాము నమ్మిన దేవునికి ధనం సమర్పించుకుంటారు. ఇంకొందరు వాహనాలు సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరైనా.. ఎవరి నమ్మకం వారిది. ఇటీవల 'గురువాయూరప్పన్'కు (దేవాలయానికి) టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 (TVS Apache RTX 300) బైక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.
గురువాయూరప్పన్ దేవాలయానికి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ TVS Apache RTX 300 బైకును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ.. దేవస్వం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్వం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300
టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300ను.. కంపెనీ రూ.1.99 లక్షల ప్రారంభ ధరలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఇది బేస్, టాప్, బీటీఓ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.
ఇదీ చదవండి: 2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
అపాచీ ఆర్‌టిఎక్స్ 300 బైక్.. 299 సీసీ ఇంజిన్‌తో 9,000rpm వద్ద 36hp పవర్ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది Apache RR 310 తర్వాత తయారీదారు యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన బైక్‌గా నిలిచింది. ఇది ఆఫ్ రోడర్‌గా మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ టూరర్‌గా కూడా ఉపయోగపడుతుంది.


