బైక్ కొనుగోలుదారుల్లో చాలామంది మైలేజ్ ఎక్కువ ఇచ్చేవాటినే సెలక్ట్ చేసుకుంటారు. అందులోనూ కొంత తక్కువ ధరలో లభిస్తే.. అంతకంటే సంతోషం ఉంటుందా?, కాబట్టి ఈ కథనంలో మన దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే 5 బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.
హీరో HF డీలక్స్
హీరో HF డీలక్స్ ప్రారంభ ధర రూ. 56,742 (ఎక్స్-షోరూమ్). ఇది దాదాపు 70 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 97.2 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 7.91 hp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లైట్ క్లచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్‌లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో స్ప్లెండర్ ప్లస్‌ను రూ. 74,152 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. హీరో మోటోకార్ప్ ఈ కమ్యూటర్ బైక్ లీటరుకు దాదాపు 80 కి.మీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. ఇది 7.91 హెచ్‌పి పవర్ అందించే.. 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్‌లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.
హోండా షైన్
హోండా షైన్ 100 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఇది 98.98cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.28 hp పవర్, 8.05 Nm టార్క్ అందిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 71,959. ఇది డ్యూయెల్ టోన్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇది 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్ దాని విభాగంలో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో ఒకటిగా ఉంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 55,500 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్ ఇండికేటర్, 5 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్, లాంగ్ సీట్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు పొందుతుంది.
బజాజ్ ప్లాటినా
బజాజ్ ప్లాటినా 100 అధిక మైలేజ్ అందించే కమ్యూటర్ బైకులలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 59,049 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 99.59 సీసీ ఇంజిన్ 8.08 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది లీటరుకు 72 కిమీ మైలేజ్ అందిస్తుంది. ప్లాటినాలో పొడవైన సీటు, సరైన రియర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ & కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటివి ఉన్నాయి.
గమనిక: పైన చెప్పుకున్న బైక్స్ ధరలు కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. మీరు ఎంచుకునే మోడల్ లేదా వేరియంట్, కలర్ ఆప్షన్స్ మొదలైనవి ధరల మీద ప్రభావం చూపుతాయి. అంటే ధరలు మారే అవకాశం ఉందన్నమాట. మైలేజ్ విషయంలో కూడా తప్పకుండా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.


