అమెరికా బైక్‌లపై జీరో టారిఫ్‌!  | India offers zero tariffs on 800 to 1600cc Harley Davidson motorcycles | Sakshi
Sakshi News home page

అమెరికా బైక్‌లపై జీరో టారిఫ్‌! 

Feb 8 2026 4:53 AM | Updated on Feb 8 2026 11:40 AM

India offers zero tariffs on 800 to 1600cc Harley Davidson motorcycles

అమెరికా నుంచి దిగుమతి అయ్యే బైక్‌లపై సున్నా టారిఫ్‌లను భారత ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఇంజన్‌ కెపాసిటీ 800 సీసీ నుంచి 1,600 సీసీ దాకా ఉన్న బైక్‌లకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జీరో టారిఫ్‌ల వల్ల అమెరికా బ్రాండ్‌ అయిన హర్లీ–డేవిడ్‌సన్‌ బైక్‌లకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

 1,600 సీసీదాకా ఇంజన్‌ సామర్థ్యం కలిగిన బైక్‌లపై దిగుమతి సుంకాన్ని గతేడాది 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. 1,600 సీసీకి మించి ఇంజన్‌ సామర్థ్యం ఉన్న బైక్‌లకు సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. ఇకపై దాన్ని సున్నాగా మార్చబోతున్నారు. అమెరికా కార్లు, డీజిల్‌ వాహనాలు, పెట్రోల్‌ వాహనాలకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వబోతోంది.  

→ మధ్యంతర ఒప్పందంలో భాగంగా అమెరికా యాపిల్‌ పండ్లకు కోటా ఆధారిత పన్ను మినహాయింపులు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. కిలోకు రూ.100 కంటే తక్కువ ధర ఉన్న అమెరికా యాపిల్స్‌ను ఇండియాలోకి అనుమతించరు. ప్రస్తుతం దిగుమతి చేసుకున్న యాపిల్స్‌కు 50 శాతం సుంకం విధిస్తున్నారు. దీన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. భారత్‌ ప్రతిఏటా అమెరికా నుంచి 6 లక్షల టన్నుల యాపిల్స్‌ దిగుమతి చేసుకుంటోంది.  

→ అమెరికా వైన్స్, స్పిరిట్స్, డ్రైఫ్రూట్స్‌పై సున్నా టారిఫ్‌లు లేదా టారిఫ్‌ల తగ్గింపు అమల్లోకి రాబోతోంది. దీనివల్ల ఆయా సరుకులు చౌకగా భారతీయులకు అందుబాటులోకి వస్తాయి.  అమెరికా వాల్‌నట్స్, బాదం, పిస్తా సహా ఇతర ఎండు ఫలాలు, పప్పుల ధరలు తగ్గబోతున్నాయి. వీటిపై సుంకాల మినహాయింపులు ఇవ్వనున్నారు. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే పండ్లు, కూరగాయలు, మసాలాలు, టీ, కాఫీ, బేకరీ ఉత్పత్తులపై టారిఫ్‌లు రద్దు చేయడానికి అమెరికా అంగీకరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement