ఇది భారత్‌ వ్యూహాత్మక ముందడుగేనా? | Is It A Strategic Move by India After Big Deal With USA? | Sakshi
Sakshi News home page

ఇది భారత్‌ వ్యూహాత్మక ముందడుగేనా?

Feb 7 2026 10:54 AM | Updated on Feb 7 2026 11:23 AM

Is It A Strategic Move by India After Big Deal With USA?

ఎట్టకేలకు భారత్‌ మరో ముందడుగు వేసింది.  ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్‌ వ్యూహాత్మక ముందడుగు వేసింది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా సుంకాల ఆంక్షలను తగ్గించింది. మరి ఇది రష్యాతో వాణిజ్య స్నేహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుటు హాట్‌ టాపిక్‌గా మారింది. 

రష్యాతో స్నేహంపై ప్రభావం ఎంత?
రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్‌పై విధించిన ఆంక్షల నడుమే  ట్రంప్‌ సుంకాలను తగ్గించారు. అయితే ఇది రష్యాతో సంబంధాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే అనుమానం కూడా మరొకవైపు మొదలైంది.  రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలకు భారత్‌ కట్టుబడటంతో ఓ డైలమా ఏర్పడింది. ఇక రష్యాతో భారత్‌ సంబంధాలు చెడిపోయినట్లేనా అనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా చమురు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేస్తుందని కూడా చెప్పకొచ్చారు. 

అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో రష్యా చమురును చేయడం కష్టమేనా? అంటే అవుననక తప్పదు. అయితే  కేవలం చమురు అంశమే భారత్‌-రష్యాల స్నేహంపై ప్రభావం చూపదని విశ్లేషకులు అంటున్నారు. రష్యాతో భారత్‌కు చాలా వాణిజ్య ఒప్పందాలున్నాయని, కేవలం చమురు అంశం పక్కకు వెళ్లిపోయినంత మాత్రాన ఈ ఇరు దేశాల సుదీర్ఘ ‍స్నేహ  బంధం ఎక్కడికి పోదని అంటున్నారు. 

భారత్‌కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు
భారత్‌కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. భారత్‌ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు భారత్‌పై అమెరికా ఆంక్షలు చమురుపై మాత్రమే. అంటే చమురును మాత్రమే రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేయదన్నమాట. భారత్‌కు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి పరికరాల్లో రష్యా కీలక భాగస్వామి. భారత్‌ స్వదేశీ ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ, రష్యా టెక్నాలజీపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. 

ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపు దిశగా సాగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌కు రష్యా ఎరువు, లోహాలు సరఫరా కూడా చేస్తోంది.  ఇలా అమెరికా, యూరప్ ఒత్తిళ్ల మధ్య భారత్‌ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాతో కుదిరిన డీల్‌ భారత్‌ వ్యూహాత్మక ముందడుగానే చెప్పుకోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇది సమతుల్య వ్యూహమేనని వారు అంటున్నారు.

పూర్తిగా ఆపిసినట్లేనా..?
రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయకూడదనేది అమెరికా ఆంక్షలు. అంటే సాంక్షన్‌డ్ ఎంటిటీస్( ఆంక్షలు ఉన్న సంస్థలు), నాన్‌ -సాంక్షన్‌డ్ ఎంటిటీస్(ఎటువంటి ఆంక్షలు లేని సంస్థలు) అనే వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. రష్యాలోని ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే చమురు కొనుగోల చేయకూడదా.. లేక ఎటువంంటి ఆంక్షలు లేని సంస్థల నుంచి కూడా చమురు కొనుగోలు చేయకూడదా అనేది ప్రస్తుతం కాస్త డైలమాలోనే ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నప్పుడు ఈ రెండింటి కింద కూడా చమురు కొనుగోలు చేయకూడదనే విషయం అర్థమవుతున్నా ఇక్కడ పూర్తిగా క్లారిటీ లేదు.  

ఇదిలా ఉంచితే, భారత్‌-రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ,  గత రెండు మూడేళ్లుగా ప్రాపంచిక పరిస్థితుల కారణంగా కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో సంబంధాలు మళ్లీ చురుకుగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇప్పుడు అమెరికా ఆంక్షలతో రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయకుండా ట్రంప్‌ చేసినప్పటికీ, రష్యాతో ఉన్న పలు వాణిజ్య సంబంధాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది భారత్‌ అమలు చేస్తున్న వ్యూహాత్మక ముందడుగుగానే చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమెరికాతో ఎంత వరకూ అవసరముందో అంతవరకూ, రష్యాతో ఏమి అవసరమో వాటిని మాత్రమే పటిష్టం చేసుకునేలా భారత్‌ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడానికి వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.

ఇదీ చదవండి:
ట్రంప్‌ సుంకాలు.. భారత్‌కు భారీ ఊరట

Advertisement
 
Advertisement
Advertisement