జనాల్ని కాపాడబోయి ప్రాణాలు వదిలిన పోలీస్ | Surajkund Mela Incident Details Latest | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన సునామీ స్వింగ్.. వీడియోలు వైరల్

Feb 8 2026 4:08 AM | Updated on Feb 8 2026 11:46 AM

Surajkund Mela Incident Details Latest

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రతి ఏటా సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా జరుగుతుంది. ఈసారి కూడా అలానే నిర్వహించారు. అయితే శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ మేళాలో ఏర్పాటు చేసిన రంగుల రాట్నం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీళ్లని కాపాడబోయిన ఓ పోలీసు.. మృతి చెందడం విషాదంగా మారిపోయింది.

అసలేం జరిగిందంటే?
సూరజ్‌కుండ్ మేళాలో సునామీ స్వింగ్ అనే భారీ రంగుల రాట్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో చాలామంది కూర్చుని ఉన్నారు. రాట్నం కూలిన వెంటనే ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. సందర్శకులు భయంతో పరుగులు తీశారు. 13 మందికి పైనే తీవ్రంగా గాయపడ్డారు. అయితే రంగుల రాట్నంలో ఇరుక్కు వారిని రక్షించేందుకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నప్పుడు.. రంగుల రాట్నంకు సంబంధించిన ఓ భారీ భాగం ఆయన ముఖానికి, తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలేశారు.

ఈ ఘటనలో గాయపడిన వాళ్లని పోలీసులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలానే ప్రమాదానికి కారణమైన రైడర్ ఆపరేటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.  ఇదే సంఘటనపై హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన పోలీస్ అధికారి జగదీష్ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement